
రాకాసి అలలకు బోటు ధ్వంసం
సంతబొమ్మాళి: మండలంలోని లక్కివలస పంచాయతీ గెద్దలపాడు తీర ప్రాంతంలో సముద్ర అలల ధాటికి ఓ బోటు ధ్వంసమై రూ. 20 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం సముద్రపు వేట ముగించుకొని 50 బోట్ల ను సముద్రంలో లంగరు వేశారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం గెద్దలపాడు గ్రామానికి చెందిన మత్స్యకారులు వేటకు బయల్దేరారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో లంగరు వేసిన బోట్లు ఏమవుతాయని ఆందోళనతో 50 మంది మత్య్సకారులు తెప్పలపైన సము ద్రంలోకి వెళ్లారు. మూడు గంటలు కష్టపడి లంగరు వేసిన 49 బోట్లను ఒడ్డుకు చేర్చగా అందులో ఒక బోటు కనిపించలేదు. కొద్దిసేపు మత్య్సకారులు గాలించగా బోటు సముద్రంలో మునిగిపో యి ఉండడాన్ని గమనించారు. తాళ్ల సాయంతో సుమారు వందమంది మత్య్సకారులు బోటును తీరం ఒడ్డుకు చేర్చడానికి కష్టపడ్డారు. అయితే అల ల ఉద్ధృతికి బోటు ధ్వంసమై వలలు చిరిగిపోయి సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత మత్స్యకారుడు శ్రీరంగం వీరాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన బోటు, వలను ఫిషరీస్, రెవెన్యూ అధికారులతో పాటు మైరెన్ పో లీసులు పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. బోటు మీద ఆధారపడి జీవిస్తున్న 20 మ త్య్సకార కుటుంబాలు వీధిన పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని మత్య్సకార నాయకులు చింతల రాజులు, శ్రీరంగం రాజులు కోరారు.