
మెకానిక్ కుమారుడికి రెండు ఉద్యోగాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మహారాణిపేటకు చెందిన కోసూరు నవీన్‌కుమార్ ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. కాశీబుగ్గలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న కోసూరు భాస్కరరావు, నిర్మల దంపతుల కుమారుడైన నవీన్ 2021లో బీఎస్సీ పూర్తి చేసి విశాఖలో కోచింగ్ తీసుకున్నాడు. పలుమార్లు బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమై విఫలమైనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో సాధన చేశాడు. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పీఓగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించానని నవీన్ తెలిపారు.
సైనికుడికి సలాం
బూర్జ: మండలంలోని అన్నంపేట గ్రామానికి చెందిన మామిడి సింహాచలం 22 ఏళ్లు సైన్యంలో సర్వీసు పూర్తి చేసి ఉద్యోగ విరమణ పొంది గ్రామానికి వచ్చినందుకు బుధవారం స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం లవ్లీయూత్ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం, సునీత దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు అప్పలనాయుడు, మాణిక్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ నెల 4న భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించి శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం ఎంపికలు నిర్వహించారు. 55 కేజీల విభాగంలో బి.అభి, వైకుంఠం, 60 కేజీల విభాగంలో విభాగంలో ఎస్.బన్నీ, సుమంత్, 65 కేజీల విభాగంలో ఎం.రాంబా బు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణ్, జిల్లా అధ్యక్షుడు తారకేశ్వరరావు, కార్యదర్శి కె.గౌరీశంకర్, సీనియర్ బాడీ బిల్డర్లు బి.విజయకుమార్ సందీప్, చరణ్ పాల్గొన్నారు.

మెకానిక్ కుమారుడికి రెండు ఉద్యోగాలు

మెకానిక్ కుమారుడికి రెండు ఉద్యోగాలు