సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర గ్రామంలో వినాయకుడి ఆలయం వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక రోడ్డు దాటుతుండగా రొయ్యల వ్యాన్ ఢీకొట్టడంతో కాపుగోదాయవలసకు చెందిన నందిగాం కాళీ దుర్గాప్రసాద్ (55) మృతి చెందాడు. ఇతను బోరుభద్ర పెట్రోల్ బంక్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి పోలీసులు తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
సోంపేట: మండలంలోని కొర్లాం గ్రామంలో తారకేశ్వర శివాలయం వద్ద చెరువులో పడి వృద్ధుడు మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బారువ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బాలిగాం గ్రామానికి చెందిన గున్న గున్నయ్య(70) పరిసర ప్రాంతాల్లో యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మృతిచెందాడు. ఎస్‌ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై కొండముచ్చుల దాడి
కంచిలి: మండలంలోని డోలగోవిందపురంలో కొండముచ్చుల దాడిలో అదే గ్రామానికి చెందిన సింధు మూళి అనే బాలిక తీవ్ర గాయాలపాలయ్యింది. మంగళవారం తల్లి ఢిల్లీశ్వరితో కలిసి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళుతుండగా మూడు కొండముచ్చులు ఒక్కసారిగా వచ్చి గాయపరిచాయి. వెంటనే బాలికను మఠం సరియాపల్లి పీహెచ్‌సీలో చేర్పించి చికిత్స చేయించారు. గ్రామంలో చాలా రోజులుగా కోతులు, కొండముచ్చులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యాన్ ఢీకొని బంక్ ఆపరేటర్ మృతి


