
నాలుగు గంటలకే ఆధార్ సేవలు బంద్
సోంపేట: ఈకేవైసీలో భాగంగా ఆధార్ అప్‌డేట్ కో సం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్ప డం లేదు. సోంపేట మండలం జింకిభద్ర పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బెంకిలి, జింకిభ ద్ర పంచాయతీల ప్రజల కోసం గురువారం ఆధార్ డ్రైవ్ నిర్వహించారు. అయితే డిజిటల్ అసిస్టెంట్ సురేష్ సాహు నాలుగు గంటలకే సేవలు ముగించడంతో అంతవరకు వేచి ఉన్న లబ్ధిదారులు నిరాశ తో వెనుదిరిగారు. ప్రస్తుతం వేరే సచివాలయానికి వెళ్లి సేవలు అందిస్తామని, శుక్రవారం పలాసపురం పంచాయతీ వద్ద కూడా ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తామని, అక్కడికి వచ్చి అప్‌డేట్ చేసుకోమని చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఎంపీడీఓ సీహెచ్ ఈశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఐదు గంటలకు వరకు పేర్లు నమోదు చేసి ఆధార్ అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.