
7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు చెప్పారు. పరీక్ష కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రెగ్యులర్‌గా, సప్లిమెంటరీ విధానంలో 9000 మంది వరకు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు.
పీజీ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు పీజీ పరీక్షల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పీజీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం తెలిపారు. పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్ష రాసేవిద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నా రు. ఈ నెల 21 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బీటెక్ 8వ సెమిస్టర్ పరీక్షకు సంబంధించి ఈ నెల 14వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని, పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వర్సిటీ అఫిలియేషన్ బీపీఈడీ, డీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీ లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు.
‘అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలి’
పలాస: అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని సి.పి.ఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మంది రం వద్ద గురువారం కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు భారత విప్లవోద్యమంలో అగ్రనాయకుల్లో ఒకరైన పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి సభ ఈనెల 13న పలాసలో జరగనుందని, అలాగే అమరవీరులు రాయల సుభాష్ చంద్రబోస్, చండ్రపుల్లారెడ్డి, మాదాల నారాయణస్వామి వర్ధంతిలు కూడా ఇదే నెలలో ఉన్నాయని, వారి జ్ఞాపకార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, పోతనపల్లి కుసుమ, వంకల పాపయ్య, కుత్తుం హేమ, మురిపింటి తాతారావు, సార జగన్, మద్దిల వినోద్, బదకల ఈశ్వరి, జడ్డే అప్పయ్య పాల్గొన్నారు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు
పాతపట్నం : నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే అలాంటి దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతోపాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని శ్రీకాకుళం ఫుడ్ కంట్రోల్ అధికారి కె.వెంకటరత్నం హెచ్చరించారు. పాతపట్నంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కిరాణా, స్వీట్స్, టీ, తదితర దుకా ణాలను తన బృందంతో కలిసి గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఒడిశా నుంచి తీసుకువచ్చిన నకిలీ వస్తువులు చెలామణీ చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రంగులు కలిపిన ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె.లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు

7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు