
ప్రశ్నపత్రాలను స్కూల్ పాయింట్ వద్దకే చేర్చాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షల ప్రశ్నాపత్రాలను స్కూల్ పాయింట్ వద్దకే చేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు ఉదయానికే పాఠశాలకు చేరుకొని, ఆ తర్వాత పరీక్ష ప్రశ్నాపత్రాలు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు అనేక సమయాల్లో ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ప్రశ్నాపత్రాలకు వెళ్లి పాఠశాలకు వస్తుండగా యాక్సిడెంట్ జరిగి మృత్యువాతపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం ఎంతమాత్రం సరికాదన్నారు. స్కూల్ పాయింట్ వద్దకే ప్రశ్నాపత్రాలు చేరవేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని విన్నవించారు.
ఎస్పీ స్పందనకు 81 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ స్పందనకు 81 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా అధికారులతో ఎస్పీ జూమ్ కాల్‌లో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదులకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
మెళియాపుట్టి: మండలంలోని హడ్డివాడ గ్రామంలో టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్ అధ్వర్యంలో పాతపట్నం ఎకై ్సజ్ సిబ్బంది సమన్వయంతో నాటుసారా తయారీ స్థావరాలపై సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 450 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. అలాగే 80 లీటర్ల సారాతో కొసింటి నరసింహ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సారా తయారీకి వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మట్టి ట్రాక్టర్లు పట్టివేత
రణస్థలం: మండల పరిధిలోని రామతీర్థాలు రహదారిలో ఆదివారం రాత్రి నాలుగు మట్టి ట్రాక్టర్లను జే.ఆర్.పురం పోలీసులు పట్టుకున్నారు. అయితే జే.ఆర్.పురం సర్కిల్ పోలీస్‌స్టేషన్ వద్ద ట్రాక్టర్లను ఉంచి తదుపరి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అలాగే మండల తహసీల్దార్ ఎన్.ప్రసాద్ అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై భూగర్భ గనులశాఖ అధికారులు రూ.3,500 అపరాధ రుసుము విధించారు. వీటిపై జే.ఆర్.పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవికి వివరణ కోరగా మట్టి ట్రాక్టర్లును అదివారం రాత్రి పట్టుకున్నామని, అయితే ఒక నిర్మాణ దశలో ఉన్న ఇంటికి తీసుకెళ్తున్నట్లు తెలిసి విడిచిపెట్టామన్నారు. మరో గ్రావెల్ ట్రాక్టర్‌కు మైన్సు అధికారులు ఫైన్ వేసి విడిచిపెట్టమని అర్డర్ రావడంతో వదిలేశామని తెలియజేశారు.
సేవా దృక్పథం అలవర్చుకోవాలి
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థులు సేవా దృక్పథం అలవర్చుకోవాలని శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ అన్నారు. జాతీయ సేవా పథకం విద్యార్థులకు సోమవారం వాలంటీర్ సర్వీస్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకంలో ప్రతీ విద్యార్థి చేరాలన్నారు. కార్యక్రమంలో ఏవో మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ పాల్గొన్నారు.

ప్రశ్నపత్రాలను స్కూల్ పాయింట్ వద్దకే చేర్చాలి

ప్రశ్నపత్రాలను స్కూల్ పాయింట్ వద్దకే చేర్చాలి