
ఉపాధి వేతనదారుకి పాముకాటు
నరసన్నపేట: మండలంలో ని కోమర్తికి చెందిన ఉపాధి వేతనదారు పెరుమోల తులసి పాముకాటుకు గురైంది. పోలాకి చానల్‌లో గత వారం రోజులుగా ఉపాధి పని నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం పనికి అందరితో కలిసి తులసి కూడా వెళ్లింది. అయితే అక్కడ మట్టిని తొలగించేందు కు జంగిల్ తొలగిస్తున్నప్పుడు కాలికి పాము కరిచింది. వెంటనే అప్రమత్తమైన ఫీల్డ్ అసిస్టెంట్, మేట్‌లు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలి పారు. ముందు జాగ్రత్త చర్యగా రక్త పరీక్షలు చేసి అవసరమైన వైద్యమందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముద్దాయికి ఏడాది జైలు శిక్ష
పొందూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన ముద్దాయి లారీ డ్రైవర్ కిల్లాన శ్రీనుకు పొందూరు జూనియర్ సివిల్ జడ్జి బి.జ్యోత్స్న ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 2019వ సంవత్సరంలో పొందూరు మండలంలోని గారపేట గ్రామానికి చెందిన అంబళ్ల సంతోష్, చీమల మణికంఠలు బైక్‌పై వెళ్తుండగా, రెడ్డిపేట జంక్షన్ వద్ద లారీతో కిళ్లాన శ్రీను ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. చీమల మణికంఠ తీవ్రగాయాలపాలైయ్యాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ మహ్మద్ యాసిన్ లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పొందూరు కోర్టులో విచారణ జరగగా డ్రైవర్ శ్రీనుకు జడ్జి శిక్ష విధించారు.