
ప్రశ్నించకపోతే రూ.50 వేలు ఇస్తారట: ఎంపీపీ మొదలవలస
ఎచ్చెర్ల మండలంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చాలా చోట్ల నాణ్యత పట్టించుకోవడం లేదని ఎంపీపీ మొదలవలస చిరంజీవి అన్నారు. కాంట్రాక్టర్లతో పీఆర్ ఇంజినీర్లు కుమ్మకై ్క 10 శాతం పీసీలు వసూళ్లు చేసుకుని నాణ్యత లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. దీనిపై తాను అధికారులను ప్రశ్నిస్తే ‘రూ.50 వేలు ఇస్తాం.. నాణ్యత విషయంలో మాత్రం అడగవద్దు’ అని అన్నారని ఎంపీపీ ఆరోపించారు. దీనిని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా పరిగణించి.. పరిశీలించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వాగ్వాదాలు పెరుగుతున్న తరుణంలో జెడ్పీ చైర్‌పర్సన్ విజయ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.