
ఊరిలోన.. చైత్ర వీణ
● జిల్లావ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు
● ఊరూరా పంచాంగ పఠనాలు
విశ్వావసుకు స్వాగతం పలుకుతూ కోయిలమ్మలు కొత్త పాటలు కట్టాయి..
వేకువన కువకువలన్నీ ఆ పాటలతోనే గడిచాయి. ఊరూవాడా కోవెల వాకిటే కూర్చున్నాయి.. ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను ఆరారా విన్నాయి. అన్నదాతలంతా నాగళ్లు చేతబట్టారు.. ఏరువాక సాగారో అంటూ హుషారైన పాటందుకున్నారు. కొత్త చిగుర్లతో ప్రకృతి చైత్రవీణ మోగించింది. తెలుగు వారి కొత్త ఏడాది నాడు ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో మెరిసిపోయారు. జనమంతా వసుదైక కుటుంబంలా కలిసిమెలిసి విశ్వావసుకు
స్వాగతం పలికారు.
అష్ట ఫలాలతో విజయదుర్గమ్మ

ఊరిలోన.. చైత్ర వీణ