తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

తప్పనిసరి

Apr 2 2025 12:48 AM | Updated on Apr 3 2025 1:32 AM

తప్పన

తప్పనిసరి

ట్రేడ్‌ లైసెన్స్‌..
● 90 శాతం షాపులకు లైసెన్సులు లేనట్లు గుర్తించాం ● పీడీఎస్‌ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవు ● మెడికల్‌ దుకాణాల్లో మరిన్ని తనిఖీలు ● ‘సాక్షి’తో విజిలెన్స్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు

శ్రీకాకుళం క్రైమ్‌ : అక్రమంగా వ్యాపారం సాగించే షాపులపై నిరంతరం నిఘా ఉంటుందని శ్రీకాకుళం రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రతి షాప్‌కు జీఎస్టీ లైసెన్సుతో పాటు ట్రేడ్‌ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, అనుమతులు లేనివాటిని ఇప్పటికే గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తే కేసులు బుక్‌ చేస్తామని, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు కొనరాదని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రామలక్ష్మణ కూడలి సమీపంలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రశ్న: జిల్లాలో ట్రేడ్‌ లైసెన్సు లేకుండా షాపులు ఉన్నాయా..?

జవాబు: జిల్లా కేంద్రంలో 3,109 షాపులు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్‌లైసెన్సు పొందిన్నట్లు రిజిస్టర్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో జీటీరోడ్డు, కళింగ రోడ్డు, పాలకొండ రోడ్డు, పెద్దపాడు రోడ్డులో ఇటీవల సుమారు 1100 షాపులను తనిఖీ చేశాం. వీటిలో 1046 షాపులకు ట్రేడ్‌ లైసెన్సులు లేవు. అంటే 90 శాతం అనుమతులు లేవు. వీటికి రూ.23,15,570 జరిమానా విధిస్తూ మున్సిపాలిటీ వారికి అంచనా నివేదిక పంపించాం. దీనిని బట్టి జిల్లాలో అనుమతి లేకుండా ఎన్ని ఉంటాయన్నది అంచనా వేసుకోవచ్చు.

ప్రశ్న: అక్రమంగా పీడీఎస్‌ బియ్యం తరలిపోతుంది. దీనిపై తీసుకుంటున్న చర్యలు?

జవాబు: రెండు లారీలు, ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 1434.51 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుని సీజ్‌ చేశాం. గతేడాది చివర్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 6ఏ కేసులు 28, క్రిమినల్‌ కేసులు 21 నమోదు చేశాం.

ప్రశ్న: మెడికల్‌ షాపులపై ఇటీవల దాడులు చేశారు. నిఘా కొనసాగుతుందా?

జవాబు:ప్రిస్క్రిప్షన్‌ లేకుండా, ఎకై ్స్పరీ అయిన మందులను కొన్ని షాపుల్లో అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపాం. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉండే మెడికల్‌ షాపులపై ఇప్పటికే నిఘా పెట్టాం. మరిన్ని దాడులుంటాయి.

ప్రశ్న: ఐరన్‌ స్క్రాప్‌ జిల్లా నుంచి తరలిస్తున్నట్లు వినిపిస్తోంది?

జవాబు:ఇటీవల గుంటూరు కేంద్రంగా చేసుకుని తప్పుడు జీఎస్టీ బిల్లులతో అక్రమంగా విజయనగరం, మన జిల్లాల నుంచి ఎనిమిది లారీల్లో తరలిస్తున్న 14 టన్నుల (12.5 క్యూబిక్‌ మీటర్లు) ఐరన్‌స్క్రాప్‌ను సీజ్‌ చేశాం. రూ.16 లక్షల వరకు జరిమానా విధించాం. ఒకరిపై ఎఫ్‌ఐఆర్‌ వేయించాం.

ప్రశ్న: పర్మిట్లు లేకున్నా క్వారీలు తవ్వడంపై

తీసుకుంటున్న చర్యలు?

జవాబు: నందిగాం మండలం లట్టిగాం గ్రానైట్‌ స్టోన్‌ క్రషర్‌కు సంబంధించి క్వారీ తవ్వినదానికి, తీసుకున్న పర్మిట్స్‌కు వ్యత్యాసం ఉండటంతో రూ.16 కోట్ల వరకు పెనాల్టీ విధించాం. ఇదే తరహాలో రేగులపాడులో ఇచ్చిన లీజ్‌ ఏరియా కాకుండా బయట కూడా చేస్తున్నట్లు గుర్తించి రూ.19.65 కోట్లు జరిమానా విధించాం. జగనన్న హౌసింగ్‌ స్కీమ్‌లో ఇంజినీరింగ్‌ వెరిఫికేషన్‌లో కన్‌స్ట్రక్షన్‌ బిల్లు విస్తీర్ణం కంటే స్లాబ్‌ లెవెల్‌ పెంచినందుకు గాను రూ. 6.7 కోట్ల జరిమానా వేస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఇంకెక్కడైనా ఇలా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: మీరు వచ్చాక ఖనిజ సంపద ఎంతమేర పట్టుబడింది?

జవాబు: మన జిల్లాలో కాదు గానీ, విజయనగరం జిల్లా రాజాం మండలం జి.చీపురుపల్లిలో మాంగనీస్‌ 20 టన్నులు (18 క్యూబిక్‌ మీటర్లు), ఒక పొక్లెయినర్‌, లారీ సీజ్‌ చేసి ఒకరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశాం. విజయనగరం జిల్లా బట్టిరాజేరు మండలంలో రూ. 9.75 కోట్లు, సారయ్యవలస మండలంలో రూ.12.45 కోట్ల విలువ చేసే క్వార్ట్‌జైట్‌ మినరల్స్‌ సీజ్‌ చేశాం.

ప్రశ్న: ప్రభుత్వ టార్గెట్‌ను చేరుకున్నారా.?

జవాబు: ప్రభుత్వం మాకిచ్చిన యాన్యువల్‌ టార్గెట్‌(జరిమానా) రూ.182 కోట్లు. లక్ష్యానికి ఇప్పటివరకు 196.59 కోట్లకు ప్రతిపాదనలు పంపగా సుమారు రూ.120 కోట్లకు ప్రభుత్వం ఆమోదించింది.

తప్పనిసరి1
1/1

తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement