
తిరుగుబాటు తప్పదు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు, దాడులు దౌర్జన్యకాండ చేస్తున్నారు. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాళి మండలంలో మారుమూల గ్రామాల్లో బయట సమాజానికి తెలియని ఇటువంటి దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి. పింఛన్లు ఆపివేయడం.. రేషన్ బియ్యం ఆపివేయడం చేస్తున్నారు. ఇప్పుడు సింహాద్రిపురం గ్రామంలో రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లోని మట్టితోనే దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారు. అధికారం వస్తే మంచి చేయాలి తప్పా ఇలా కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. సింహాద్రిపురం గ్రామంలో జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలి.
–ఎస్.హేమసుందర్‌రాజు,
వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, కోటబొమ్మాళి.
●