అకాల వర్షంతో రైతుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో రైతుల అవస్థలు

Published Thu, Apr 10 2025 12:39 AM | Last Updated on Thu, Apr 10 2025 12:39 AM

అకాల వర్షంతో రైతుల అవస్థలు

అకాల వర్షంతో రైతుల అవస్థలు

నరసన్నపేట: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం రైతులు అవస్థలు పడ్డారు. రబీలో పండిన ధాన్యం కళ్లాల్లో, రోడ్లపైన ఉంచారు. వర్షానికి ఈ ధాన్యం తడిచి ముద్దయ్యాయి. పండిన ధాన్యం అమ్ముకోలేక నానా అవస్థలు పడుతుండగా ఈ దశలో వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందారు. కరగాం, కంబకాయ, నరసన్నపేట, మాకివలస, దేవాది, పోత య్యవలస తదితర గ్రామాల్లో రైతుల ధాన్యం వర్షానికి తడిచాయి. అలాగే రబీ పంటలకు ఈ వర్షం అనుకూలమని వేసవి దుక్కులు కూడా చేసుకో వచ్చని వ్యవసాయాధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement