
రబీలో ధాన్యం కొనుగోలు జరిగేనా?
సారవకోట: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యం పూర్తయిందనే నెపంతో చాలాచోట్ల ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో రబీలోనైనా ధాన్యం కొనుగోలు జరిగేనా అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు. సారవకోట మండలంలోని కొత్తూరు, గోపాలపురం, అగదల, బురుజువాడ, అక్కివలస, బద్రి, లక్ష్మిపురం, సారవకోట, జగ్గయ్యపేట తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలలో వరి సాగు చేశారు. ప్రస్తుతం యంత్రాలతో నూర్పులు చేపట్టి ధాన్యం ఆరబెడుతున్నారు. కనీసం రబీలోనైనా తాము పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే చాలామంది రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై నమ్మకం లేక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ గ్రామాల నుంచి ప్రతిరోజు లారీలతో ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

రబీలో ధాన్యం కొనుగోలు జరిగేనా?