
బీసీలంటే చంద్రబాబుకు చులకన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని అందరినీ అక్కున చేర్చుకున్నారని.. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు మాత్రం ఎప్పుడూ బీసీలను, ఎస్సీలను చులకనగా చూడటం అలవాటైపోయిందని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ నాయకుడు, వైఎస్సార్ సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మనిషి గా పుట్టాలనుకునేవాడెవ్వడైనా ఎస్సీ కులంలో పుడతారా, నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, బీసీలు ఎంత చెప్పినా వినరు వంటి వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ పేరుతో మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు లెక్కలు చూపించి పథకాలు ఎగ్గొట్టే ప్రభుత్వం కూట మి సర్కారని దుయ్యబట్టారు. విజన్, పీ–4 పేర్లతో అరచేతిలో వైకుంఠం చూపించి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా బీసీలను చులకనగా చూడకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని కోరారు.
హెడ్ కానిస్టేబుల్‌కు సత్కారం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ పొందడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి దుశ్శాలువ, జ్ఞాపికలతో మంగళవారం సత్కరించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేవీ లెఫ్టినెంట్‌గా
గొండ్యాలపుట్టుగ యువకుడు
కవిటి: కేరళలోని కొచ్చి యూనిట్‌లో సబ్ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కవిటి మండలం గొండ్యాలపుట్టుగకు చెందిన దుద్ది వేణు తాజాగా లెఫ్టినెంట్ హోదాతో పదోన్నతి పొందారు. 2012లో నేవీలో సైలర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వేణు 2023 ఏప్రిల్ 1న సబ్ లెఫ్టినెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. తాజాగా లెఫ్టినెంట్ హోదాను కల్పిస్తూ నేవీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. పేదింటి కుర్రోడు ఈస్థాయిలో విజయాన్ని సాధించడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో 25 సంవత్సరాల సర్వీసు మిగిలిన నేపథ్యంలో మరిన్ని పదోన్నతులు పొందే అవకాశం ఉందని రిటైర్డ్ నేవీ ఉద్యోగులు చెబుతున్నారు.
ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
సారవకోట : మండలంలోని అలుదు గ్రామానికి చెందిన కత్తిరి జగదీష్‌కుమార్ ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కత్తిరి జనార్దనరావు, వాణిల పెద్ద కుమారుడైన జగదీష్ గత ఏడాది ఐబీపీఎస్ ద్వారా నిర్వహించిన పలు బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యాడు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఫలితాలలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు క్లర్క్‌గా ఎంపిక కాగా మంగళవారం విధుల్లో చేరాడు. తాజాగా మంగళవారం విడుదలైన బ్యాంకు పీఓ, స్పెషల్ ఆఫీసర్ పోస్టు ఫలితాల్లో బ్యాంకు ఆఫ్ బరోడాకు పీఓ, ఐటీ సెక్షన్ స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపియ్యాడు. ఈ సందర్భంగా జగదీష్‌ను గ్రామస్తులు అభినందించారు.
బుర్రకథ కళాకారుడికి డాక్టరేట్
జలుమూరు: లింగాలవలస గ్రామానికి చెందిన గంగరాపు వెంకటరమణకు పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నం, డే సిప్రింగ్ థియోలాజికల్ యూనివర్సటీ టెక్సాస్(యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 20 ఏళ్లుగా బుర్రకథ రంగంలో విశేష సేవలు, నటుడిగా, పలు సాంఘిక నాటకాల రచయితగా రాష్ట్రం నలుమూలలా వేలాది ప్రదర్శనలు ఇచ్చినందుకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుర్రకథ చరిత్రలో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి తానే కావడం ఆనందంగా ఉందన్నారు.

బీసీలంటే చంద్రబాబుకు చులకన

బీసీలంటే చంద్రబాబుకు చులకన

బీసీలంటే చంద్రబాబుకు చులకన

బీసీలంటే చంద్రబాబుకు చులకన