
కుప్పిలి మోడల్ స్కూల్‌లో విచారణ
ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్‌లో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారు ల బృందం విచారణ నిర్వహించింది. రాష్ట్ర మానిటరింగ్ అధికారి కె.ధర్మకుమార్ ఆధ్వర్యంలోని బృందం ఈ విచారణ నిర్వహించింది. కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్షలో కాపీయింగ్ ఆరోపణలపై ఐదుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. కుప్పిలి మోడల్ స్కూల్ సెల్ఫ్ సెంటర్ కావటం, చూసిరాతలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువ కావడం వంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ విచారణ నిర్వహించారు. గత మూడేళ్లలో స్కూల్ టాప ర్లు, ట్రిపుల్ ఐటీకి ఎంపికై న విద్యార్థులు అకడమిక్ ప్రగతి నివేదిక వంటివి పరిశీలించారు. అంతర్గత పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు, ఇతర ప్రతిభ వంటివి పరిశీలించారు. చూసి రాత వల్ల ట్రిపుల్ ఐటీకి విద్యార్థులు ఎంపికవుతున్నారా? విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా ఎంపికవుతున్నారా? అన్న కోణంలో ఈ విచారణ నిర్వహించారు. టాపర్ విద్యార్థుల 8, 9, 10వ తరగతుల్లో వచ్చిన ప్రోగ్రెస్ కార్డులు సైతం పరిశీలించారు. ప్రిన్సిపాల్ కె.అప్పాజీరావు వారికి పాఠశాలో విద్యా ప్రమాణాలు వివరించారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సంపాదించిన విద్యార్థులు మెరిట్ విద్యార్థులని, మాస్ కాపీయింగ్ వల్ల సీట్లు వచ్చాయన్నది అవాస్తవమని చెప్పారు. అన్ని మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు ట్రిపుట్ ఐటీ సీట్లు వస్తున్నాయని తెలిపారు.

కుప్పిలి మోడల్ స్కూల్‌లో విచారణ