టీచర్లపై ఒత్తిడి చేయడం తగదు
ప్రైమరీ స్కూల్ ఉండాలి
ప్రతీ గ్రామంలో బేసిక్ ప్రైమరీ స్కూల్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పంచాయతీ కేంద్రాల్లో కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఐదు తరగతులకు ఐదు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులను కల్పించి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని కోరారు. మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో పంచాయతీల్లో ఉన్న స్కూల్స్‌ను ఫౌండేషన్ స్కూల్స్ మార్చడం అనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివలన ప్రైవేటు విద్యకు రెట్‌కార్పెట్ వేసినట్లు అవుతుందని ఆరోపించారు. అలాగే ఇప్పుడున్న ప్రాథమికోన్నత పాఠశాలలను అవకాశం ఉన్న దగ్గర 60+ రోల్ ఉంటే హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి, మిగతా ప్రాథమికోన్నత పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లతో యథావిధిగా కొనసాగించాలని కోరారు.
శ్రీకాకుళం న్యూకాలనీ:
వివిధ అంశాల్లో ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఎంతమాత్రం తగదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లండ బాబూరావు, బమ్మిడి శ్రీరామమూర్తిలు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలను కుదించాలనే పన్నాగం చేస్తోందని మండిపడ్డారు. దీనికోసం గతంలో చేసిన ఎస్‌ఎంసీ తీర్మానాలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి అనుకూల ఎస్‌ఎంసీ తీర్మానాలు చేసి అర్జెంటుగా ఆన్‌లైన్ చేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనిని పాఠశాలల హెచ్‌ఎంల కంటే విద్యాశాఖ అధికారులే నేరుగా రంగంలోకి దిగి తమకు కావాల్సినట్లుగా చేసుకుంటే ఉపాధ్యాయులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇప్పటికే ఎస్‌ఎంసీ తీర్మానాలు చేసి మండల విద్యాశాఖ అధికారులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. మరలా ఇప్పుడు ఒకపక్క విద్యార్థులకు పరీక్షలు జరుతుండగా, ఎస్‌ఎంసీ తీర్మానాలు చేసి అప్‌లోడ్ చేయమని ఒత్తిడి చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
ప్రతీ గ్రామంలో బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాల్సిందే
ప్రభుత్వానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల విజ్ఞప్తి


