ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలోని ఊసవానిపేట గేటు సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్లే రైలులో ప్రయాణం చేస్తున్న అసోంకు చెందిన బలిన్ దుర(35) ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ జారిపడ్డాడు.
దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు జీఆర్‌పీ పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు.


