
రామగిరి క్షేత్రంలో ఐటీడీఏ పీఓ
కొత్తూరు: మండలానికి ఆనుకుని ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులిపుట్టి సమీపంలో ఉన్న కన్నెధార కొండపై నిర్మించిన రామగిరి క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. సీతారాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు పీఓను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సీతారాముల కల్యాణోత్సవానికి కొత్తూరు, సీతంపేట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలోహాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పిండి శ్రీనివాసరావు, రామగిరి క్షేత్రం కమిటీ అధ్యక్షుడు ఎస్పీ పెంటయ్య, జి.రాములునాయుడు, రాజారావు, రాములు, జి.ప్రసాదబాబు, భాస్కరరావు ప్రిన్సిపాల్ నవీన్ పాల్గొన్నారు.