
తరలించొద్దు
మా పాఠశాలలో తరగతులను మరో పాఠశాలకు తరలిస్తామని చెబుతున్నారు. దీనివలన ప్రతీరోజూ ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. రైల్వే ట్రాక్ దాటాల్సిన ఇబ్బంది ఉంది. మా ఊరులోనే ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. – బి.కుసుమ, 7వ తరగతి, బొరిగిపేట, టెక్కలి మండలం
తరలిస్తే చదువుకు దూరం
చుట్టుపక్కల సుమారు 10 గ్రామాలకు మా పాఠశాల ఎంతో ఆసరాగా ఉంది. ఇటువంటి పాఠశాలలో ప్రాథమికోన్నత తరగతులు తరలిస్తే మేము అంగీకరించం. విలీనం ప్రతిపాదన రద్దు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను విన్నవించాం. అన్ని రకాల సదుపాయాలు ఉన్న మా పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలి. – ఎస్.ఢిల్లేశ్వరరావు, విద్యార్థి తండ్రి, బొరిగిపేట, టెక్కలి మండలం
తరలిపోతే ఇబ్బందులు
మా ఊరులో ఉన్న బడిలో 6, 7, 8 తరగతులు మరో బడికి తరలిస్తారని చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వంశధార కాలువతో పాటు ప్రమాదకరమైన రోడ్డు దాటి పోలవరం వెళ్లడానికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి.
– పి.సరోజనమ్మ, విద్యార్థి తల్లి, పెద్దసాన, టెక్కలి మండలం
●

తరలించొద్దు

తరలించొద్దు