
పత్రికా విలేకరిపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న బాలు అనే ఒక పత్రికా విలేకరి (సాక్షి కాదు) తనను డబ్బులు కోసం వేధిస్తున్నాడని నగరంలోని పెద్దరెల్లి వీధికి కల్యాణి జ్యోతిప్రసాద్ ఎస్పీకి గురువారం ఫిర్యాదు చేశారు. విలేకరి తాను పనిచేస్తున్న పత్రికలో వ్యతిరేక కథనాలు రాస్తానని భయపెడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు చెప్పి కేసులు పెట్టిస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బులు తీసుకున్నాడన్నారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో భరించలేక తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నాడు. కులం పేరుతో కూడా దూషించాడని, ఎస్పీకి సంబంధిత ఆధారాలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను అందించానని తెలియజేశాడు.
అదృశ్యమైన యువతులు సురక్షితం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం (సీ్త్ర సదన్ మహిళా ప్రాంగణం) నుంచి బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న ఇద్దరు యువతులు మంగళవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో సీ్త్ర సదన్ ఇన్‌చార్జి సనపల సత్యవతి ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గత రెండు రోజులుగా వీరికోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో యువతులు కనిపించారు. దీంతో వీరిని విశాఖపట్నం ఎన్టీఆర్ నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. యువతులు సురక్షితంగా ఉండడంతో ప్రాంగణం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
యోగా పోటీల్లో
సత్తాచాటిన దంపతులు
ఆమదాలవలస: పట్టణంలోని పతాంజలి యోగా శిక్షణ కేంద్రం గురువు లగుడు అప్పన్న, ఆయన సతీమణి లగుడు లక్ష్మిలు శ్రీనగర్‌లో ఈనెల 6వ తేదీన జరిగిన యోగా పోటీల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో 50 సంవత్సరాల పైబడిన యోగా క్రీడా విభాగంలో వీరు వివిధ ఆసనాలు వేశారు. లగుడు అప్పన్న ఈ పోటీల్లో తృతీయస్థానం సాధించి కాంస్య పథకం పొందారు. అలాగే లగుడు లక్ష్మి ద్వితీయ స్థానంతో వెండి పతకం సాధించారు. వీరికి నేషనల్ యోగా అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రజిత్‌పాల్‌తో పాటు కమిటీ సభ్యులు పతకాలు అందజేశారు. అలాగే జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శి బొడ్డేపల్లి దక్షణామూర్తి, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు అభినందించారు.
తోటలో వ్యక్తి ఆత్మహత్య
పాతపట్నం: మండలంలో పాశీగంగుపేట గ్రామ సమీపంలోని జీడి, మామిడి తోటలో అదే గ్రామానికి చెందిన బురల్లా మొఖలింగం అల్లుడు మహ్మద్ షఫీ (29) గురువారం సాయంత్రం మామిడి చెట్టుకు ఊరివేసుకుని మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాశీగంగుపేట రెల్లివీధికి చెందిన బురల్లా మొఖలింగం, అతని కుమార్తె బురల్లా రాములమ్మ 8 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ రాములమ్మకు మహ్మద్ షఫీతో పరిచయం పెరగడంతో పెళ్లి చేసుకున్నారు. కాగా ప్రస్తుతం మొఖలింగం తన కుమారుడు బురల్లా మురళీ వద్ద పాశీగంగుపేటలో ఉంటున్నాడు. మమ్మద్ షఫీ నాలుగు రోజుల క్రితం పాశీగంగుపేట గ్రామానికి మామ ఇంటికి వచ్చాడు. భార్య హైదరాబాద్‌లో ఉంది. గురువారం సాయంత్రం గ్రామస్తులు షఫీ ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్‌ఐ బి.లావణ్య, పోలీసులు సంఘటన స్థలంకు చేరుకున్నారు. విషయాన్ని భార్య రాములమ్మకు ఫోన్‌లో తెలియజేయడంతో ఆమె భర్త మృతి అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. తన భర్తకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏమీ లేదన్నారు. సంఘటన స్థలం వద్ద క్లూస్ టీమ్ విచారణ చేపట్టింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

పత్రికా విలేకరిపై ఫిర్యాదు

పత్రికా విలేకరిపై ఫిర్యాదు