
అంతే వీరు.. మారదు తీరు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తీరు మారడం లేదు. ఏ సీటు చూసినా ఏమున్నది గర్వకారణం.. శాఖ సమస్తం అవినీతిమయం అన్న రీతిలో ఇక్కడ వసూళ్లు జరుగుతున్నాయి. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇన్‌చార్జిల నియామకం, బిల్లులు పెట్టడం, ఇలా ప్రతి పనికీ ఒక రేటును నిర్ణయించారు. ఇక్కడి సిబ్బందే అవినీతి గురించి బాహాటంగా చెబుతున్నారు.
అ‘ధనపు’ బాధ్యతలు
శాఖలో ఇష్టానుసారం అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉన్న పని చేసేందుకే ఇబ్బందులు పడుతుంటే.. అదనపు వసతి గృహాల బాధ్యత తీసుకుంటున్న ఏకై క శాఖ బీసీ సంక్షేమమే. కనీసం హాస్టళ్ల మధ్య దూరమైనా పరిగణనలోకి తీసుకోకుండా ఇన్‌చార్జిలను నియమిస్తున్న వైనం విస్మయపరుస్తోంది. వార్డెన్ పోస్టుల నియామకాలు లేకపోవడం, పదో న్నతులు, ఉద్యోగ విరమణలు వంటి కారణాలతో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. దీంతో ఇన్‌చార్జిలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఇదే అదనుగా చాలా మంది వసూళ్లకు తెర తీస్తున్నారు. వీరి వల్ల నిజాయితీగా ఉండేవారికి కూడా చెడ్డపేరు వస్తోంది. నరసన్నపేట బీసీ బాలికల వసతి గృహాన్ని పొందూరులోని హెచ్‌డబ్ల్యూకి అప్పగించారు. ఈ రెండింటి మధ్య దూరం 50 కిలోమీటర్లు. రెండు హాస్టళ్ల మధ్య చాలా హాస్టళ్లు ఉన్నాయి. అయినా బాధ్యతల అప్పగింతలో ఇవేవీ చూసుకోలేదు. బీసీ సంక్షేమ శాఖ వార్డెన్‌ను కాదని, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించడం మరో విచిత్రం. ఇచ్ఛాపురం–బారువ, రాజపురం–పలాస–కంచిలి, కింతలి–మురపాక వంటి హాస్టళ్ల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉన్నా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యకరం.
మామూళ్ల మత్తులో బీసీ సంక్షేమ శాఖ
పనిని బట్టి రేటు.. లేదంటే సాకు
ఇవి ఇక్కడ షరా ‘మామూలే’
ఇటీవల బీసీ కళాశాల వసతి గృహంలో ఒక విద్యార్థినిపై దాడి జరిగింది. ఇక్కడి వార్డెన్‌పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు, ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. ఆ శాఖ ఉన్నతాధికారి అన్ని ఖర్చులు వార్డెన్ చేత పెట్టించి బిల్లులు మాత్రం ఉన్నతాధికారి అప్పగించారు.
పోలవరంలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఆ వార్డెన్ విద్యార్థుల కోసం పెట్టిన ఖర్చు కంటే ఉన్నతాధికారుల కోసం పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ. ఒక వేళ ఎవరి గురించైనా పేపర్‌లో వార్త వస్తే ఉన్నతాధికారులు దాన్నీ సొమ్ము చేసుకుంటారని భోగట్టా.
స్టడీ సర్కిల్‌కు చైర్‌లు కొనడానికి కలెక్టర్ డబ్బులిచ్చినా.. ప్రతి వార్డెన్ చేత రెండేసి కుర్చీలు కొనిపించి తీసుకున్నారు.

అంతే వీరు.. మారదు తీరు