
రెండు కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో 2 కేజీల 140 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి. వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన లక్ష్మికాంత్ బలియార్, అతని బావ మోహన్‌దాస్‌ప్రదాన్‌లు ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లక్ష్మికాంత్ గంజాయిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. ఈ క్రమంలో అక్కడి గంజాయి వ్యాపారి షాహాజి రామజాదవ్‌తో సికింద్రాబాద్‌లో పరిచయం ఏర్పడింది. తనకు కిలో గంజాయి అందజేస్తే రూ.7500 చెల్లిస్తానని చెప్పడంతో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. వీరితో పాటు అక్కడికి వచ్చిన రామజాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.