● ఆదిత్యాలయంలో 49 మంది దినసరి వేతనదారులకు పెండింగ్ జీతాల చెల్లింపుపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ
● 15 రోజుల్లోగా ఔట్‌సోర్సింగ్ అవసరాలపై నివేదిక కోసం త్రీమెన్ కమిటీ నియామకం
అరసవల్లి:
ఏళ్ల తరబడి ఆదిత్యాలయంలో పనిచేసిన 49 మంది దినసరి వేతనదారులకు ఎట్టకేలకు పెండింగ్ జీతా ల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నుంచి సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వచ్చేశాయి. ఈ శుభవార్త వినగానే దినస రి వేతనదారులంతా ఎగిరి గంతేశారు. అయితే ఇంతలోనే ఆ ఉత్తర్వుల్లో అసలైన మెలిక అర్థమై నీరసించిపోయారు. ‘గత 14 నెలలుగా ఉన్న పెండింగ్ జీతాలన్నీ వారికి చెల్లించేసి వెంటనే వారందరినీ ఆలయ విధుల నుంచి తొలిగించండి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పెండింగ్ జీతాలు రూ.70 లక్షలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో గత కొన్నేళ్లుగా మొత్తం 49 మంది దినసరి వేతనదారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత ఏడాది ఫిబ్రవరి నుంచి నేటి వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. అన్నదానం విభాగంలో 8 మంది, ప్రసాదాల తయారీ విభాగంలో ఏడుగురు, భజంత్రీ సిబ్బంది ఆరుగురు, పరిచారిక సిబ్బంది ఇద్దరు, అలాగే మిగిలిన పరిపాలన, టిక్కెట్లు విక్రయ కౌంటర్లు, కంప్యూటర్ విభాగ సిబ్బంది, స్వీపర్లు, పారిశుద్ధ్య సిబ్బంది 26 మంది కలిపి మొత్తంగా 49 మందికి నెలకు సుమారుగా రూ.5,50,500 వరకు జీతాలు కింద చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం 14 నెలలకు గా ను సుమారుగా రూ.70 లక్షల వరకు పెండింగ్ కింద జీతాలను ఆలయం నుంచే వారికి చెల్లించాల్సి ఉంటుంది.
ఆలయంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇక్కడ ఇంతవరకు భక్తు ల సౌకర్యార్థం 49 మంది దినసరి వేతనదారులే విధులను నిర్వర్తించేవారు. అయితే తా జాగా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రాప్తికి వీరికి పెండింగ్ జీతాలిచ్చేసి వెంటనే తొలిగించాల్సి ఉంది. అనంతరం ఆల య అవసరాలకు వాస్తవంగా ఎంత మంది సిబ్బంది అవసరమన్న అంశంపై ప్రత్యేక నివేదిక కోరుతూ త్రిమెన్ కమిటీని కూడా కమిషనర్ నియమించారు. ఈమేరకు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (విశాఖపట్నం), జిల్లా దేవదాయ శాఖాధికారి (శ్రీకాకుళం)తో పాటు అరసవల్లి ఆలయ ఈఓ (డిప్యూటీ కమిషనర్)లతో కూడిన కమిటి రానున్న 15 రోజుల్లోగా ఆదిత్యాలయానికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది కావాలన్న నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఇకమీదట ఆలయంలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ నైపుణ్యతతో కూడిన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండనున్నారని స్పష్టమౌతోంది. ఎన్నో ఏళ్లుగా స్వామి ఆలయాన్ని నమ్ముకుని పనిచేసుకుంటున్న తమ కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకూడదని చెప్పడంపై దినసరి వేతనదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
జీతాలిమ్మని ఆదేశాలు వచ్చాయి
ఆలయంలో దినసరి వేతనదారులుగా పనిచేస్తున్న 49 మందికి పెండింగ్ జీతాలిమ్మని, అలాగే వారిని వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు వచ్చాయి. అలాగే ఔట్‌సోర్సింగ్ నియామక అవసరాల కోసం త్రీమెన్ కమిటీ నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.
– వై.భద్రాజీ, ఆలయ ఈఓ
జీతాలిచ్చేసి.. తీసేయండి
జీతాలిచ్చేసి.. తీసేయండి