
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ఇచ్ఛాపురం రూరల్: తమ స్థలానికి ఎదురుగా ఉన్న రచ్చబండను తొలగించి, ఆ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కె.శాసనాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఇటీవల తన అనుచరులతో కలిసి రచ్చబండను తొలగించారు. దీనిపై సాక్షి దినపత్రికలో ‘పచ్చ తమ్ముడి బరితెగింపు’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు బుధవారం స్పందించారు. ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు’ అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డు తహసీల్దార్ కె.వెంకటరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు.
16 గొర్రె పిల్లల సజీవదహనం
మెళియాపుట్టి: మండలంలోని కరజాడ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, దాసరి ఢిల్లేశ్వరరావు, సార రామయ్యలకు చెందిన 16 గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి. మార్చి 30వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు పెంపకందారులు చెబుతున్నారు. బుధవారం పలువురు పెంపకందారులతో మాట్లాడగా గిట్టని వాళ్లెవరో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుమారు రూ.50 వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

హెచ్చరిక బోర్డు ఏర్పాటు