రోడ్డు ప్రమాదంలో షిఫ్ట్ ఆపరేటర్ మృతి
నందిగాం: మండల కేంద్రమైన నందిగాం ఫ్లై ఓవర్ వంతెనపై గురువా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలా స సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ సంపతి రావు రవికిరణ్(38) మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్యపేటకు చెందిన రవికిరణ్ పలాస విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పలాస వెళ్తుండగా నందిగాం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైకి వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఎగిరిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు హైవే అంబులె న్స్ సిబ్బంది వచ్చి రవికిరణ్‌ను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి. రవికిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెడ్ కానిస్టేబు ల్ బి.వి.రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


