కలెక్టర్‌తో చర్చలు సఫలం
ఏర్పాట్లు పూర్తిచేశాం..
జిల్లాలో నేటి నుంచి మొదలయ్యే టెన్త్‌క్లాస్ జవాబుపత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ, డీఈఓ సూచనల మేరకు అధికారు లు, ఎగ్జామినర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – లియాకత్ ఆలీఖాన్,
ఎగ్జామినేషనల్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాకుళం
●
శ్రీకాకళం న్యూకాలనీ:
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2025 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో గురువారం నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. స్పాట్‌లో భాగస్వామ్యమయ్యే ఉపాధ్యాయులు తొలిరోజు బహిష్కరిస్తామని తొలుత చెప్పినా బుధవారం సాయంత్రం కల్లా స్పష్టత రావడంతో యథావిధిగా స్పాట్ ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతోపాటు సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య స్కూల్ కేంద్రాలుగా మూ ల్యాంకనం నిర్వహించనున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య నేతృత్వంలో స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్/ అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లుగా ఉప విద్యాశాఖాధికారులు ఆర్.విజయకుమారి(శ్రీకాకుళం), పి.విలియమ్స్(టెక్కలి/పలాస) వ్యవహరించనున్నారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు(వాల్యుయేషన్)గా మరో ఏడుగురు సీనియర్ హెచ్‌ఎంలను నియమించారు. జవాబుపత్రాలను దిద్దే అన్ని గదుల్లో సీసీ కెమెరాలను అమర్చారు.
శరవేగంగా కోడింగ్ ప్రక్రియ..
స్పాట్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఆర్జేడీ, డీఈఓ, ఇతర అధికారులు ఆరా తీశారు. టెన్త్ జవాబుపత్రాలకు సంబంధించి తెలుగు/సంస్కృతం/ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు(లాంగ్వేజ్ పేపర్లు), మాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్‌స్టడీస్ మొత్తం 7 పేపర్లకు సంబంధించి 24 పేజీల బుక్‌లెట్స్‌తో కూడిన 1,81,367 జవాబు పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. కోడింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తెలుగుమీడియం, ఇంగ్లీషు మీడియం, ఒరియా మీడియం జవాబుపత్రాల మూల్యాంకనం జరగనుంది.
1229 మంది సిబ్బంది..
టెన్త్ స్పాట్‌కు1229 మంది టీచర్లు భాగస్వామ్యం అవుతున్నారు. సబ్జెక్టు టీచర్లు పూటకు 20 పేపర్ల చొప్పున రోజుకు 40 పేపర్లను దిద్దనున్నారు. పేపర్‌కు రూ.10 చొప్పున 40 పేపర్లకు రూ.400 కేటాయిస్తారు. డీఏగా సుదూర ప్రాంతాల పాఠశాలల నుంచి హాజరయ్యే ఉపాధ్యాయులకు అవుట్‌స్టేషన్ అలవెన్స్‌గా రూ.400 చెల్లిస్తారు. స్పెషల్ అసిస్టెంట్లకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తారు. అరకొరగా ఉండే ఈ మొత్తాలని గత ఏడాదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.
జిల్లాలో మొదలుకానున్న
టెన్త్ మూల్యాంకన ప్రక్రియ
శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత
పాఠశాలలో కోడింగ్ ప్రక్రియ
జిల్లాకు చేరిన 1.81 లక్షల జవాబుపత్రాలు
మరో ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత
స్పాట్ కేంద్రాలకు దూరంగా డీఈఓ
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం పాతబస్టాండ్: కుప్పిలి కాపీయింగ్ ఘటనలో టీచర్ల సస్పెన్షన్ నేపథ్యంలో స్పాట్ బహిష్కరిస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ విజ్ఞప్తి మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రంగంలోకి దిగారు. ద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మధ్యవర్తిత్వం ద్వారా బుధవారం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్లు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్‌మోహన్‌లతో కలెక్టర్ తన కార్యాల యంలో చర్చలు జరిపారు. ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సస్పెన్షన్‌కు గురై హోల్డ్‌లో ఉన్న నలుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురిపై బుధవారం రాత్రి సస్పెన్షన్ ఎత్తివేశారు. ఉపాధ్యాయులపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేసేందుకు నిర్ణయించారు. స్పాట్ కేంద్రాలకు డీఈఓను దూరంగా ఉంచేందుకు కూడా అంగీకరించారు. విచారణ కమిటీ నివేదిక ప్రకారం డీఈఓపై తగు చర్యలు చేపడతామని చెప్పారు.
నేటి నుంచే స్పాట్
నేటి నుంచే స్పాట్