
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థుల జీవన గమనాన్ని, వారి భవిష్యత్తును నిర్దేశించేది విద్య మాత్రమేనని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి జిల్లా కేంద్రంలో భారత్, స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం ప్రాంగణంలో శనివారం పాఠశాల విద్యా శాఖ–సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన పిల్లల అవసరాలు గుర్తించడం ప్రభుత్వ బాధ్యతని, వారికి పరికరాలు అందజేసే కార్యక్రమం చాలా గొప్పదన్నారు. భారత్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు నూతన భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం స్కౌట్స్ గైడ్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, ఆర్.విజయకుమారి, జి.రాజేంద్రప్రసాద్, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ బుడుమూరు గోవిందరావు, సెక్టోరియల్ అధికారులు, స్కౌట్స్‌గైడ్స్ అధికారులు, టీచర్లు పాల్గొన్నారు.