
సాయిప్రియకు స్టేట్‌ఫస్ట్ ర్యాంక్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన రేడియోథెరపిస్ట్ ఎండీ పరీక్షలో శ్రీకాకుళం నగరానికి చెందిన కింతలి సాయిప్రియ స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ను కై వసం చేసుకుంది. రేడియోలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా స్థిరపడాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలియజేశారు. తల్లిదండ్రుల సహకారంతోనే స్టేట్‌ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగానన్నారు. ఎంబీబీఎస్ కాకినాడ, ఎండీ, జీఎస్‌ఎల్ రాజమండ్రిలో పూర్తి చేసినట్లు తెలిపారు. సాయిప్రియ తల్లి గొండు వెంకటలక్ష్మి టీచర్‌గా పని చేస్తుండగా, తండ్రి కాళిదాసు బిజినెస్ చేస్తున్నారు. ఆమె చెల్లి అపర్ణ సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు.