Srikakulam District News
-
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
గార: మండలంలోని వాడాడ పంచాయతీ యాబాజీఖాన్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం వాడాడకు చెందిన కొందరు వ్యక్తులు చెరువులోని గొయ్యిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. మృతదేహం ఎండిన స్థితిలో కనిపించడంతో వెంటనే సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఆర్.జనార్దనరావు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంతో తనిఖీలు జరిపించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు నిక్కరు, జేబులో ఖైనీ ప్యాకెట్, నోటు, చిల్లర పైసలు ఉన్నాయని చెప్పారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రిమ్స్‌లో ఇన్ని సమస్యలా?
శ్రీకాకుళం: జిల్లాకే ప్రధాన ఆస్పత్రిగా ఉన్న రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో ఇన్ని సమస్యలు ఉంటే ఎలా అని కలెక్టర్ దినకర్ పుండ్కర్ హాస్పిటల్ అధికారులను ప్రశ్నించారు. రోగులు, విద్యార్థులు, వైద్యులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘సాక్షి’లో పలు కథనాలు రావటంతో పాటు వ్యక్తిగతంగా కొన్ని ఫిర్యాదులు అందటంతో శుక్రవారం రిమ్స్ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని గుర్తించిన కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. పెద్దగా సమస్య లేదని రిమ్స్ అధికారులు చెప్పగా.. అక్కడే ఉన్న వాష్ బేసిన్ వద్ద ట్యాప్ విప్పగా నీరు రాలేదు. దీంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. రెండో బోరు ఏర్పాటు చేయాలని ఏపీహెచ్ఎంహెచ్ఐడిసీ ఈఈని ఆదేశించారు. లిఫ్టు సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం హెచ్ఓడీలతో సమావేశమయ్యారు. ఖాళీ పోస్టుల వివరాలను తెలియజేస్తే భర్తీకి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మే మొదటి వారం నాటికి ఆస్పత్రి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ షకీల, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం, ఆర్‌ఎంఓలు డాక్టర్ సుభాషిని, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ షర్మిళ, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సీపీ శ్రీదేవి, డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ డి.పార్వతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అసంతృప్తి -
టెక్కలిని మున్సిపాలిటీగా మారుస్తాం
టెక్కలి/సంతబొమ్మాళి: జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామని.. అయితే పంచాయతీగా ఉంటే సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా మున్సిపాలిటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సుమారు రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో టెక్కలి–చెట్లతాండ్ర రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా మార్గంలో పర్యటించే క్రమంలో చిరు వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే జీవనోపాధి చేస్తున్నామని ఇప్పుడు రోడ్డు విస్తరణతో రోడ్డున పడతామని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. టెక్కలిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ కె.జాన్ సుధాకర్, టీడీపీ నాయకులు కె.హరివరప్రసాద్, బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.దమయంతి, ఎం.రాము, ఎల్.శ్రీనివాస్, కె.కామేష్, ఆర్ అండ్ బీ అధికారులు డీఈ రవికాంత్, జేఈ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కేశవరావుపేట పంచాయతీ కింతలి మిల్లు కూడలి వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ద్విచక్ర వాహనంపై చిలకపాలెం వైపు వెళ్తుండగా.. కింతలి మిల్లు సమీపంలో పంక్చర్ కావటంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్లాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను 108 అంబులెన్సు ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేయగా.. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలానికి చెందిన సీహెచ్ రవి, డి.ప్రసాద్‌లు ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కగా ఉన్న కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రెండు కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో 2 కేజీల 140 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి. వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన లక్ష్మికాంత్ బలియార్, అతని బావ మోహన్దాస్ప్రదాన్లు ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లక్ష్మికాంత్ గంజాయిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. ఈ క్రమంలో అక్కడి గంజాయి వ్యాపారి షాహాజి రామజాదవ్తో సికింద్రాబాద్‌లో పరిచయం ఏర్పడింది. తనకు కిలో గంజాయి అందజేస్తే రూ.7500 చెల్లిస్తానని చెప్పడంతో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. వీరితో పాటు అక్కడికి వచ్చిన రామజాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెను ప్రమాదం తప్పింది!
హమ్మయ్యా.. ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై ఫరీదుపేట కూడలి కొయ్యరాళ్లు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి స్వల్ప గాయాలు కాగా, ఆమె తల్లిదండ్రులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహమూర్తి అనే ఉపాధ్యాయుడు విధులు ముగించుకుని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలోని తన నివాసానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఒడిశా వైపు వెళుతున్న కారు కొయ్యరాళ్లు సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి ఉపాధ్యాయుడి కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో టీచర్ కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఒడిశా వైపు వెళ్తున్న కారులో చిన్నారి లిఖితకు స్వల్ప గాయాలయ్యాయి. భార్యాభర్తలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. హైవేపై రెండు కార్లు ఢీ చిన్నారికి గాయాలు.. క్షేమంగా బయటపడిన తల్లిదండ్రులు -
అనుమానంతోనే అంతమొందించాడు
ఐదు నెలల గర్భిణి.. ఆమె కాలు తూలితేనే చూసిన వారి గుండెలు జారుతాయి. అలాంటిది ఆమైపె ఓ నలుగురు కర్కశంగా రాడ్డులతో దాడి చేశారు. నిలువునా అనుమానపు భూతం ఆవహించిన భర్త.. మృగంలా మారి దగ్గరుండి మరీ ఈ మారణ హోమం జరిపించాడు. వేగంగా పరిగెత్తి పారిపోలేని ఆమె అశక్తతను అదనుగా తీసుకుని కనికరం లేకుండా కొట్టి చంపేశారు. నమ్మి వెనక వెళ్తే ఉసురు తీశాడు. కవిటి : ప్రేమించి.. పెద్దలను ఒప్పించి అదే ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. వివాహమై ఐదేళ్లు అయ్యింది.. అన్యోన్య దాంపత్యానికి మూడేళ్లు పాప జన్మించింది. రెండేళ్లుగా ఏమైందో ఏమో.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈలోగా భార్య గర్భం దాల్చింది.. తనకు పుట్టబోయే సంతానంపైనా అనుమానం కలిగి భార్యపై విపరీత ద్వేషం పెంచుకున్నాడు..ఎలాగైనా అంతమొందించాలని పథకం రచించాడు.. మరో ముగ్గురి సహకారంతో భార్యను గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా హతమార్చాడు. కవిటి మండలం అర్.కరాపాడు గ్రామానికి చెందిన కొంతాల మీనాక్షి భర్త దిలీప్ కుమార్ కర్కశత్వానికి బలైంది. దీనికి సంబంధించి ఇచ్ఛాపురం పోలీసులు కేసును శుక్రవారం ఛేదించారు. దిలీప్‌కుమార్‌తో పాటు హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రూ. 3.50 లక్షలకు కిరాయి.. ఆర్.కరాపాడులోనే ఎలక్ట్రీషియన్‌గా ఉన్న దిలీప్‌కు అదే గ్రామానికి చెందిన మీనాక్షితోనే 2020 జులై 29న ప్రేమ వివాహమైంది. రెండేళ్లుగా భార్య మీనాక్షిపై అనుమానం పెంచుకున్న దిలీప్ కుమార్ గర్భిణి అని కూడా ఆలోచించకుండా చంపాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం పాత్రాపుర్ బ్లాక్ కేశరపడకు చెందిన మెట్టూరు రవికి రూ. 3.50 లక్షల కిరాయికి మాట్లాడాడు. ఇతను స్వతహాగా ఆటో డ్రైవర్ కావడం, పందుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇదే వ్యాపారం చేస్తున్న విశాఖపట్నం అరిలోవ కాలనీ దుర్గా బజారుకు చెందిన వనము దాసుతో వ్యాపార పరిచయముండటంతో అతనిని ఒప్పించగలిగాడు. కవిటి మండలం జాడుపూడిలో ఖాళీగా తిరుగుతున్న తోట భానుప్రసాద్‌ను కూడా హత్యలో పాలుపంచుకునేలా పురమాయించారు. ఎలా హత్య చేశారంటే.. మీనాక్షిని వైద్యపరీక్షల నిమిత్తం భర్త దిలీప్‌కుమార్ మార్చి 28న సోంపేట వెళ్లారు. తిరుగు పయనంలో రాత్రి 8.30 గంటలకు ఆర్.కరాపాడు రైల్వేగేటు దగ్గరకు వచ్చేసరికి కొంతమంది దుండగులు భర్త ఉంటుండగానే కిరాకతకంగా దాడి చేసిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన వెంటనే భర్త దిలీప్ కుమార్ పరారవ్వడం, ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయుడు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించడం, దర్యాప్తు ప్రారంభించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారం దారి దోపిడీలా చిత్రీకరించాలనుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనాలపై ఆర్.కరాపాడు గేటు వద్ద దారిలో కాపుకాచారు. అప్పటికే ద్విచక్రవాహనంపై భార్య మీనాక్షితో కలిసి వస్తున్న దిలీప్ బండి ఆపేయడంతో ముందుగా భానుప్రసాద్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో దాడి చేయడం, ఆ తర్వాత మిగతా ఇద్దరూ పిడిగుద్దులు గుద్దడం ఆరంభించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి చేర్చినట్టు నటించి భర్త అక్కడి నుంచి పరారయ్యారు. అనుకున్న ఒప్పందం ప్రకారం మెట్టూరు రవికి భార్యను చంపాక దిలీప్‌కుమార్ రూ. 2.50 లక్షలు ఇచ్చాడని, రూ. లక్ష ఇవ్వలేదని విచారణలో తెలిసింది. ఈ మేరకు నిందితుల నుంచి ఐరన్‌రాడ్, రెండు ద్విచక్రవాహనాలు, గోల్డ్ చైన్, నాలుగు మొబైళ్లు స్వాధీనం పోలీసులు చేసుకున్నారని డీఎస్పీ వివరించారు. కిరాయి ఇచ్చి గర్భిణిని చంపించిన భర్త ముగ్గురితో రూ.3.50 లక్షలకు ఒప్పందం కేసును ఛేదించిన ఇచ్ఛాపురం పోలీసులు భర్తతో సహా నలుగురికి రిమాండ్ -
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతగా కావ్యశ్రీ
ఆమదాలవలస: భారత తపాలా శాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన (లేఖా రచన) పోటీల్లో ఆమదాలవలస శ్రీవాణి విద్యానికేతన్‌లో 8వ తరగతి చదువుతున్న ఇ.కావ్యశ్రీ విజేతగా నిలిచింది. పోస్ట్ కార్డు, ఇన్‌ల్యాండ్ లెటర్, ఎన్వలప్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పాఠశాలలో తల్లిదండ్రుల సమక్షంలో శ్రీకాకుళం హెడ్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ వండాన హరిబాబు రూ.25,000 చెక్‌ను అందజేశారు. సుమారు ఎనిమిది వేల మంది పాల్గొన్న ఈ పోటీల్లో కావ్యశ్రీ విజేతగా నిలవడం జిల్లాకు దక్కిన గౌరవమని సూపరింటెండెంట్ అభినందించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల సమక్షంలో బహుమతి అందుకోవడం ఆనందంగా ఉందని కాశ్యశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా కావ్యశ్రీకి శిక్షణ ఇచ్చిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కె.వి.రాజారావును పాఠశాల డైరెక్టర్ బి.వెంకటేశ్వర్లు, బి.నారాయణమూర్తి, విశ్రాంత ఎంఈఓ ఎస్.వి.రమణ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంపత్, ప్రణవి, తరుణ్, ఇందుమతి, హరిబాబు, అప్పలనాయుడు, పోస్టల్ శాఖ స్టెనో పూజారి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లు అడ్డుకోకపోవడం దారుణం శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లింలకు అండగా ఉంటామని మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇప్పుడు వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు కావాల్సిన బలం ఉన్నా అడ్డుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జోనల్ ఇన్చార్జి ఎంఏ రఫీ, జిల్లా అధ్యక్షులు ఎం.ఎ.బేగ్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం అమలుకు బాహాటంగా మద్దతిచ్చి పూర్తిస్థాయిలో బిల్లును పాస్ చేయడానికి చంద్రబాబు ప్రత్యక్ష కారణమయ్యారని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 13లో ఉన్న ముస్లింల పరిరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. దేశ సౌభాగ్యానికి ప్రతీకలమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు నష్టపరిచే ప్రక్రియకు చేయి కలపడం సరికాదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఎస్.అమానుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్, పట్టణ అధ్యక్షుడు అబూబకర్, ఉపాధ్యక్షుడు సర్ఫరాజ్ భయ్యా, జహంగీర్, అజ్గర్, అలీబేగ్, సయ్యద్ రషీద్, ఎంఏ సిరాజుద్దీన్, బహదూర్ జానీ, కేఎస్ మదీనా పాల్గొన్నారు. రూ.10 లక్షల విలువైన చెట్లు దగ్ధం ఆమదాలవలస: మండలంలోని లొద్దలపేటలో పూజారి శ్రీలత అనే రైతు తోటలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో 200 శ్రీగంధం చెట్లు, 200 సర్వీ చెట్లు, కొన్ని మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయారు. భర్త ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నందున ఆమదాలవలసలో నివాసం ఉంటున్నామని, ఊరిలో తాము లేని సందర్భం చూసుకొని దుండగులు నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని కోరారు. బెల్లం క్రషర్ షెడ్ దగ్ధం ఆమదాలవలస: మండలంలో చేపేనపేటలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో బుడితి సాంబమూర్తికి చెందిన బెల్లం క్రషర్ షెడ్ కాలిపోయింది. పక్కనున్న పొలంలో పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. షెడ్‌తో పాటు బెల్లం తయారీలో ఉపయోగించే ఇనుప పెనాలు, క్రషర్ ఇంజన్ దగ్ధమైందని, సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. -
మిస్టర్ ఆంధ్రా పోటీల్లో సిక్కోలు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీల్లో శ్రీకాకుళం బాడీబిల్డర్లు సత్తాచాటారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కవిటి చెందిన దుదిస్టీ మజ్జి 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచారు. ఎస్.వైకుంఠరావు(శ్రీకూర్మం) 60 కేజీల విభాగంలో 4వ స్థానం, కె.అవినాష్ (పలాస) తదితరులు రాణించారు. వీరిని భీమవరానికి చెందిన ఎమ్మెల్యే అంజిబాబు, సంఘ రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ వి.విజయ్ బహుమతులు అందజేశారు. వీరిని శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ కె.గౌరీశంకర్, అధ్యక్షులు తారకేశ్వరరావు, చీఫ్ పేట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణరావు, వడ్డాది విజయ్‌కుమార్, బలగ ప్రసాద్, సీనియర్ బాడీబిల్డర్లు, జిమ్ నిర్వాహకులు, కోచ్‌లు అభినందించారు. వన్యప్రాణుల సంహారం.. నలుగురిపై కేసు సారవకోట: వన్య ప్రాణుల సంహారం చేస్తున్న నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సారవకోట సెక్షన్ ఆఫీసర్ ఎల్.ఈశ్వరరావు తెలిపారు. సారవకోట రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని పలు చోట్ల నాటుబాంబులు ఉపయోగించి వన్య ప్రాణులను సంహరిస్తున్నారని సమాచారం అందడంతో శుక్రవారం సారవకోట, పాతపట్నం అటవీ శాఖాధికారులు మాటు వేశారు. సరుబుజ్జిలి మండలం యరగాం సమీపంలో 19 నాటుబాంబులతో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీతంపేటకు చెందిన మోహనరావు, సరుబుజ్జిలి మండలానికి చెందిన సింహాచలం, త్రినాథరావు, ఎల్ఎన్ పేటకు చెందిన జగన్నాథంలుగా గుర్తించారు. -
శ్రీకాకుళం
అనుమానంతోనే.. ఐదు నెలల గర్భిణి హత్య కేసు తేలింది. అనుమానంతో భర్తే చంపేసినట్టు పోలీసులు నిర్ధారించారు. –8లోఆదిత్యా క్షమించవా..ఆదిత్యుని వార్షిక కల్యాణ క్రతువుకు ప్రచారం కరువైంది. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కూడా జరగలేదు. –8లోవెళ్లొస్తాం నేస్తం.. రిమ్స్‌లో ఇన్ని సమస్యలా..? రిమ్స్ ఆస్పత్రిని కలెక్టర్ పరిశీలించారు. సమస్యలు చూసి నిర్ఘాంతపోయారు. –8లో శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తేలినీలాపురం గ్రామంలో ఉన్న విదేశీ పక్షుల విడిది కేంద్రంలో ఉన్న సైబీరియా పక్షులున్యూస్రీల్ -
ఆధార్‌కు దారి కష్టాలు
టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో గల హెడ్ పోస్టల్ కార్యాలయంలో ఆధార్ నమోదు కోసం వచ్చిన వినియోగదారులు శుక్రవారం గేటు బయట పడిగాపులు కాశారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయం ప్రాంగణం నుంచి పోస్టల్ కార్యాలయానికి ఉన్న గేటు మార్గాన్ని పశు సంవర్ధక శాఖాధికారులు మూసివేశారు. దీంతో ఆధార్ నమోదుకు వచ్చిన వారితో పాటు పోస్టల్ సిబ్బంది గేటు బయట పడిగాపులు కాశారు. కొంత సమయం తర్వాత పశు సంవర్ధక శాఖ డీడీ జయరాజ్ కార్యాలయానికి చేరుకోవడంతో, పోస్టల్ సిబ్బందికి డీడీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోస్టల్ సిబ్బంది మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే మార్గా న్ని వినియోగిస్తున్నామని, ఇప్పుడు ఆధార్ నమోదు కోసం వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. అయితే తమ కార్యాలయం ప్రాంగణం నుంచి పోస్టల్ కార్యాలయానికి వెళ్లే వారంతా పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారంటూ పశు సంవర్ధక శాఖాధికారులు చెప్పడం గమనార్హం. -
తేలని వాటా.. తెచ్చిన తంటా
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బాల మురళీకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోవడం సంచలనమైంది. అయితే ఆయనతో పాటు సీసీ సురేష్‌కుమార్ కూడా బుక్కవ్వడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ దాడుల వెనుక కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం అన్నీ కార్యాలయ ముఖ్య విభాగాధికారిగా పనిచేస్తున్న ‘ఆయన’ అని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. కాంతమ్మ అనే దివ్యాంగురాలు, సీనియర్ అసిస్టెంట్‌ను అడ్డం పెట్టుకుని కథను నడిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంప ముంచిన వాటాలు వైద్యారోగ్య శాఖలో అవినీతి ఇప్పుడు బహిర్గతమైంది గానీ.. ఇక్కడ మామూళ్ల వసూలు చాలా మామూ లు విషయమన్న సంగతి అన్ని విభాగాలకు తెలుసు. ఫైలుకు ఓ రేట్ పెట్టుకుని వ్యవహారాలు నడుస్తున్న ఈ కార్యాలయంలో కొత్తగా డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన బాలమురళీకృష్ణ తన క్యాంపు క్లర్క్‌లను మార్చేసి జిల్లాకు చెందిన ఓ బడా నేత సిఫారసుతో సురేష్‌కుమార్‌ను సీసీగా నియమించుకున్నా రు. ఇక్కడే వైద్యారోగ్య శాఖ సిబ్బందిలో లుకలుకలు బయటపడ్డాయి. కొత్త సీసీ వచ్చాక డీఎంహెచ్ఓ ఎవరితోనూ సంబంధం లేకుండా తన సొంత దుకా ణం తెరుచుకున్నారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు కూడా ప్రచురితమైన సంగతి విదితమే. దీంతో అంతవరకు సాగిన ‘మూమూళ్ల’ వ్యవహారంలో తేడాలు వచ్చాయి. అప్పటివరకు ప్రతి ఫైల్ మూవ్ ఆర్డర్‌కు కూడా విభాగానికి ఒక్కో వాటా వెళ్లేది. కొన్ని రోజులుగా అన్ని విభాగాలు వాటాలు క్యాన్సి ల్ అయిపోయి నేరుగా డీఎంహెచ్ఓ చాంబర్‌కే మామూళ్లు చేరిపోయాయి. దీంతో వివాదాలు పెరిగి ఏసీబీకి తమ వారితో ఫిర్యాదు చేసేంత స్థాయికి చేరిపోయాయి. ఫలితంగా ఏకంగా జిల్లా అధికారి ఏసీబీ చేతికి చిక్కాల్సి వచ్చింది. పైగా ఫిర్యాదుదారురాలు కాంతమ్మపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయన్న సంగతి కూడా పాఠకులకు తెలిసిందే. ఈమె కొంత మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట వసూ ళ్లు చేయడంతో బాధితులంతా నిలదీయడంతో కొ న్ని నెలల పాటు విధులకు వెళ్లకుండా మాయమైపోయింది. ఇవే సెలవుల అనంతరం వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ వద్ద నుంచి రీపోస్టింగ్కు ఆదేశాలు పొందినప్పటికీ మూవ్ ఆర్డర్ ఇవ్వాల్సిన డీఎంహెచ్ఓ లంచం డిమాండ్ చేయగా కాంతమ్మ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించింది. దీనివెనుక విభాగాధిపతి ఉన్నారన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ జాయినింగ్ ఆర్డర్లు వ్యవహారంలో కూడా ఆ కీలక ఉద్యోగి పాత్ర ఉందన్న సంగతిపై తేల్చాలని కూడా మంత్రి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. డీఎంహెచ్‌ఓపై ఏసీబీ దాడుల వెనుక పెద్ద ప్లాన్ వాటాల సమస్యే కొంపముంచిందంటున్న వైద్యశాఖ వర్గాలు -
ఆన్లైన్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఎస్సీ రాయనున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఆన్లైన్ శిక్షణ అందించనున్నామని, ఈ శిక్షణ కు గాను ఈనెల 10వతేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమాధికారి ఇ.అనురాధ తెలిపారు. మెగా డీఎస్సీ టెట్ పరీక్షలో అర్హత సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసులైన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కేటగిరీలకు చెందిన వారు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని, టెట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో శ్రీకాకుళంలోని 80 అడుగులు రోడ్డులో గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం ఫోన్ నంబర్లు 7382975679, 9295653489ను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు పది, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, రెండు ఫొటోలు అందజేయాలని తెలిపారు. రిమ్స్‌లో ప్రత్యేక ఓపీ క్లినిక్‌లు శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకు ప్రత్యేక ఓపీ క్లినిక్‌లను కొన్ని రోజుల పాటు నిర్వహించనున్నామని రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక క్లినిక్‌లో సంబంధిత వ్యాధి లక్షణాలు గల వ్యక్తులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. ఈ క్లినిక్‌లో పా ల్గొనే వారంతా వ్యాధికి సంబంధించిన పాత రికార్డులు, వారి ఆధార్ కార్డుతో పాటు సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈనెల 7వ తేదీన మూర్ఛ వ్యాధి, 10వ తేదీన రొమ్ము వ్యాధులు, 11వ తేదీన థైరాయిడ్ సమస్యలు, 15వ తేదీన హె ర్నియా, కడుపులో వాపులు, బీర్జాలు, 16వ తేదీన పచ్చ కామెర్లు, కాలేయం తదితర సంబంధిత సమస్యలు, 23వ తేదీన పాదాల వ్యాధులు, మధుమేహంకు సంబంధించిన పాదాల సమస్యలున్న వారంతా హాజరుకావచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ప్రత్యేక ఓపీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటిలో గ్యాస్ లీక్ హిరమండలం: హిరమండలంలోని చిన్నకోరాడ వీధిలో పెను ప్రమాదం తప్పింది. వీధిలో ని దేవరశెట్టి శ్రీనివాసరావు భార్య శ్రీదేవి శుక్రవారం ఇంటిలో వంటచేయడానికి గ్యాస్‌స్టవ్‌ను వెలిగించగా.. ట్యూబ్ ద్వారా గ్యాస్ లీకై సిలిండర్‌లో మంటలు చేలరేగాయి. దీంతో ఆమె భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే చిన్నకోరాడ సెంటర్లో హోటల్ నిర్వహిస్తున్న భర్తకు విషయం చెప్పారు. అప్పటికే ఇంటి నిండా పొగలు కమ్ముకున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి, కొత్తూరు అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. గ్యాస్ కార్యాలయం నుంచి వచ్చిన కృష్ణంరాజు సిలిండర్ నుంచి వచ్చిన మంటలను పూర్తిగా అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మంటలు అదుపులోకి వచ్చాశాయి. -
వారు చెప్పిందే ముహూర్తం
సమస్యలు సరిదిద్దుతాం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి ఇరు పార్టీలు హాజరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తిచేయడం జరుగుతోంది. స్లాట్ బుకింగ్ ఈ రోజే ప్రారంభం కావడంతో చిన్నచిన్న సమస్యలున్నా సరిదిద్దుతాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు స్లాట్ బుక్ చేసుకున్న తరువాతే రిజిస్ట్రేషన్‌కు వస్తే మంచిది. – నాగలక్ష్మి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌శాఖ డీఐజీ, శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ ● స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ ● చలానా తీశాకే రూ.200తో స్లాట్ ● స్లాట్ సమయంలో వెళ్లకుంటే డబ్బులు పోయినట్లే ● సాంకేతిక, సమస్యలతో తప్పని తిప్పలు ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): భూముల క్రయవిక్రయాలకు జనం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం భారీగా భూములు ధరలు పెంచి ప్రజల నెత్తిన భారం వేసింది. నిత్యావసరాల సంగతి సరేసరి. విద్యుత్ బిల్లుల భారం ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసి వస్తోంది. ఏదో ఒక రూపేణా ప్రజల నెత్తిన భారం వేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకుపోవడమే కూటమి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా స్లాట్ బుకింగ్ సిస్టమ్ తెరపైకి తీసుకొచ్చి మరో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సాధారణంగా మంచి ముహూర్తం చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం రివాజు. కానీ ఈ కొత్త పద్ధతితో వారు చెప్పిందే ముహూర్తంగా మారుతోంది. స్లాట్ బుకింగ్‌తో తప్పని తిప్పలు భూముల కొనుగోలు, అమ్మకాలు చేసుకునే వారు డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్ తయారు చేయించుకుని ఐజీఆర్ఎస్ సర్వీ స్లో వివరాలన్నీ నమోదు చేసుకుని సంబంధిత వ్యక్తులు సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇవన్నీ చేస్తూ ముందస్తుగానే చలానా తీస్తేనే స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. స్లాట్ సమయానికి ఒక వేళ ఏదైనా కారణం వల్ల రిజిస్ట్రేషన్‌కు హాజరు కాలేకపోయినా.. సాంకేతిక పరమైన సమస్యలు ఉండి రిజిస్ట్రేషన్ కాకపోయినా స్లాట్ డబ్బులు పోయినట్లే. ఆ రోజులో ఎన్నిసార్లు స్లాట్ బుక్ చేస్తే అన్ని రూ.200 చెల్లించాల్సిందే. ఓ మంచి ముహూ ర్తాన రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించాలనుకుంటే ఆన్లైన్లో స్లాట్ దొరికితేనే వారికి రిజిస్ట్రేషన్ లేకుంటే అంతే సంగతులు. స్లాట్ బుక్ చేసుకున్నాక కొనుగోలు చేసిన వారికో అమ్మిన వారికో అనారోగ్యం వచ్చినా, డబ్బులు ఎడ్జస్ట్మెంట్ కాకపోయినా, బ్యాంక్‌లో చలానా తీయడం ఆలస్యం కావడం లాంటి సంఘటనలు ఎదురైతే రిజిస్ట్రేషన్ జరగదు. స్లాట్ సమయానికి సబ్ రిజిస్ట్రార్లు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోయినా డబ్బులు వృధాగా పోతాయి. స్లాట్లు సరిగా జరగకపోవడంతో రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయంలో గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఇదే పెద్ద పండగ..
ఊరంతా పందిరి వేయాలి.. ఇంటింటా పచ్చ తోరణాలు కట్టాలి.. మంగళ వాద్యాలు ప్రతి వీధిలోనూ వినిపించాలి.. సాగర ఘోషతో సమానంగా వేదమంత్రాలు ప్రతిధ్వనించాలి.. ఆ సందడి మధ్య రామచంద్రుడి పెళ్లి జానకమ్మతో జరగాలి.. ఇది నువ్వలరేవు కట్టుబాటు. అనాదిగా పాటిస్తున్న ఆచారం. రాముడి పెళ్లికి ఆ ఊరివారంతా పెళ్లి పెద్దలుగా మారిపోతారు. ఇంటి ఆడపడుచుకు కన్యాదానం చేసినంత సంబరంగా సీతమ్మను రామ చంద్రుడి చేతిలో పెడతారు. పెళ్లి చేయగానే పండగ కాదు.. కదా మరో ఆరు రోజులాగి రావణ సంహారాన్ని కూడా కానిచ్చి నవమి వేడుకలు పూర్తి చేస్తారు. ● సాగర తీరంలో సీతారాముల పరిణయం ● నువ్వలరేవులో ఆధ్యాత్మిక శోభ ● 12వ తేదీ వరకు అట్టహాసంగా శ్రీరామనవమి ఉత్సవాలు వజ్రపుకొత్తూరు రూరల్: వలస పక్షులు వచ్చి వాలిపోయాయి. చలువ పందిళ్లు కొలువు దీరాయి. శుభరాట కూడా ఠీవిగా నిలబడింది. మొత్తానికి నువ్వలరేవు మినీ అయోధ్యలా మారిపోయింది. జిల్లాలోనే అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవు రామనవమికి సిద్ధమైంది. పెద్దలు పెట్టిన కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఈ గ్రామంలో సీతారాముల కల్యా ణం చేయడం తమ బాధ్యతగా భావిస్తారు. ఈ మత్స్యకార గ్రామంలో సుమారు 3,300 ఇళ్లు ఉండగా దాదాపుగా 12 వేల మంది జనాభా ఉన్నారు. కేవలం బెహరా, మువ్వల, బైనపల్లి ఇంటి పేర్లతో ఉండే ఈ గ్రామంలో ‘బెహరా’లను గ్రా మ పెద్దగా నిర్ణయిస్తారు. పెద బెహరా, చిన బెహరాలు చెప్పే మాటలకు కట్టుబడి కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో జరిగే అన్ని ఉత్సవాల కంటే సీతారాముల కల్యాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏటా వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మార్చి 30 (ఆదివారం) నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమాలు ఇవే రామ నవమి వేడుకల కోసం గ్రామంలో పెద్దలంతా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమాలను రూపొందించారు. గత నెల 30న సాయంత్రం దాసుడు ఇంటి నుంచి దేవరతో బయలుదేరి ఠక్కురాణి అమ్మవారికి పూజలు చేసి జెండా ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల 12న జరిగే రావణ సంహారంతో ముగియనున్నాయి. ఉత్సవాల్లో ప్రధా న ఘట్టం శ్రీరామనవమి. ఆ రోజున ముందుగా గ్రామ దేవత బృందావతి అమ్మవారి ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే రామాలయం వద్ద మరో జెండాను ఆవిష్కరించి హోమం, యజ్ఞాలతో పండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య సీతారాములు కల్యాణం కనుల పండువగా జరుపుతారు. తర్వాత రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా యువకులు డ్యాన్స్‌లు, పగటి వేషాలతో అలరిస్తారు. కర్రసాము, పాండురంగ నాటకం, రామ నాటకం, రామయ్య పట్టాభిషేకం, మంతాము ఎక్కడ ఉన్నా గ్రామ దేవత బృందావతి అమ్మవారి చల్లన దీవెనలు, సీతారాముల కరుణా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చించి అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని పెద్ద పండగగా ఏటా జరుపుకుంటారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఊరంతా మెరిసిపోతోంది. ఉత్సవాలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా వస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల చొరవతో గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు ముస్తాబైన నువ్వలరేవు గ్రామం ఆచారాలకు పెద్ద పీట తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తాం. వలస కూలీలు ఎక్కడ ఉన్నా స్వగ్రామానికి చేరుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పూజారులు, యువకులు సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటాం. – బైనపల్లి నవీన్, సొసైటీ అధ్యక్షుడు, నువ్వలరేవు● వేడుకలకు సిద్ధ్దమైన రామాలయం డపారాధన, కోయి డ్యాన్స్, రావణ దహనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగిస్తారు. ఐకమత్యంతో నవమి ఉత్సవాలు తరతరాలుగా వస్తున్న శ్రీరామ నవమి ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. మా ఇంటి ఇలవేల్పుగా బృందావతి అమ్మవారిని కొలుచుకుంటూ మాకు అదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముడు, సీతమ్మలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – మువ్వల పూర్ణచంద్రరావు, సర్పంచ్, నువ్వలరేవు -
7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు చెప్పారు. పరీక్ష కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రెగ్యులర్‌గా, సప్లిమెంటరీ విధానంలో 9000 మంది వరకు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. పీజీ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు పీజీ పరీక్షల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పీజీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం తెలిపారు. పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్ష రాసేవిద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నా రు. ఈ నెల 21 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బీటెక్ 8వ సెమిస్టర్ పరీక్షకు సంబంధించి ఈ నెల 14వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని, పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వర్సిటీ అఫిలియేషన్ బీపీఈడీ, డీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీ లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. ‘అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలి’ పలాస: అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని సి.పి.ఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మంది రం వద్ద గురువారం కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు భారత విప్లవోద్యమంలో అగ్రనాయకుల్లో ఒకరైన పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి సభ ఈనెల 13న పలాసలో జరగనుందని, అలాగే అమరవీరులు రాయల సుభాష్ చంద్రబోస్, చండ్రపుల్లారెడ్డి, మాదాల నారాయణస్వామి వర్ధంతిలు కూడా ఇదే నెలలో ఉన్నాయని, వారి జ్ఞాపకార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, పోతనపల్లి కుసుమ, వంకల పాపయ్య, కుత్తుం హేమ, మురిపింటి తాతారావు, సార జగన్, మద్దిల వినోద్, బదకల ఈశ్వరి, జడ్డే అప్పయ్య పాల్గొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు పాతపట్నం : నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే అలాంటి దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతోపాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని శ్రీకాకుళం ఫుడ్ కంట్రోల్ అధికారి కె.వెంకటరత్నం హెచ్చరించారు. పాతపట్నంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కిరాణా, స్వీట్స్, టీ, తదితర దుకా ణాలను తన బృందంతో కలిసి గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఒడిశా నుంచి తీసుకువచ్చిన నకిలీ వస్తువులు చెలామణీ చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రంగులు కలిపిన ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె.లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం
వజ్రపుకొత్తూరు: మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు బుంగ ధనరాజు, వంక కృష్ణలు మంగళవారం చేపల వేట సాగిస్తుండగా జరిగిన తెప్ప ప్రమాదంలో గల్లంతై మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు పార్టీ తరఫున మృతుని కుటుంబాలకు రూ.50,000 చొప్పున గురువారం ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక సాయం అందించిన వారిలో పార్టీ నాయకులు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, పాలిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వాడ మధుకేశ్వరరావు, వైస్ ఎంపీపీ వంక రాజు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు, మత్య్సకార ఐక్యవేదిక నాయకులు ఉన్నారు. 11 ఇసుక ట్రాక్టర్ల పట్టివేతహిరమండలం: వంశధార నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఎన్.హనుమంతురావు, ఎస్ఐ ఎండీ యాసిన్ హెచ్చరించారు. వంశధార నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 11 ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్, ఎస్ఐలు గురువారం ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని భగీరథిపురం, పిండ్రువాడ, ఎంఎల్పురం గ్రామాల పరిధిలో వంశధార నది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, ట్రాక్టర్ల యజమానులతో కూడా మాట్లాడామని, ఇక్కడ రీచ్ లేదని వివరించామని తెలిపారు. ట్రెంచ్‌లు ఏర్పాటు చేసినా వాటిని కప్పి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై సమాచారం రావడంతో పోలీసులతో కలిసి దాడి చేశామన్నారు. దాడి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లతోపాటు నదిలో ఉన్న 3 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి మెదటి హెచ్చరికగా అపరాధ రుసం వేస్తున్నట్లు తెలిపారు. హిరమండలంలో ఇసుక రీచ్ లేదని, ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు వినయ్ శ్రీకాకుళం న్యూకాలనీ: 15వ ఆలిండియా సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి తుంగాన వినయ్ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఈనెల 4 నుంచి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరం వేదికగా జరగనున్నా యి. ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల హాకీ జట్టుకు వినయ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల కోసం ఇప్పటికే ఆంధ్రా జట్టుతో కలిసి యూపీ చేరుకున్నాడు. గతనెల 6 నుంచి 8 వరకు గుంటూరులో జరిగిన రాష్ట్రపోటీల్లో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. శ్రీకాకుళం నగరం ఫాజుల్‌బాగ్‌పేట వీధికి చెందిన తుంగాన గోపి కుమారుడు వినయ్. -
నాలుగు గంటలకే ఆధార్ సేవలు బంద్
సోంపేట: ఈకేవైసీలో భాగంగా ఆధార్ అప్డేట్ కో సం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్ప డం లేదు. సోంపేట మండలం జింకిభద్ర పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బెంకిలి, జింకిభ ద్ర పంచాయతీల ప్రజల కోసం గురువారం ఆధార్ డ్రైవ్ నిర్వహించారు. అయితే డిజిటల్ అసిస్టెంట్ సురేష్ సాహు నాలుగు గంటలకే సేవలు ముగించడంతో అంతవరకు వేచి ఉన్న లబ్ధిదారులు నిరాశ తో వెనుదిరిగారు. ప్రస్తుతం వేరే సచివాలయానికి వెళ్లి సేవలు అందిస్తామని, శుక్రవారం పలాసపురం పంచాయతీ వద్ద కూడా ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తామని, అక్కడికి వచ్చి అప్డేట్ చేసుకోమని చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఎంపీడీఓ సీహెచ్ ఈశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఐదు గంటలకు వరకు పేర్లు నమోదు చేసి ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సర్వం దోచేస్తారు
షికారుకెళ్తారు.. శ్రీకాకుళం క్రైమ్ : బండిపై సాయంత్రం అలా షికారుకి వెళ్లినట్లు తామెంచుకున్న గ్రామానికి వెళతారు.. వెంట తీసుకెళ్లిన ఫోన్లను స్విచ్చాఫ్ చేసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి తిరిగి వెళ్లిపోతారు.. అదే రోజు రాత్రి చోరీ ఎక్కడ చేద్దామనుకున్నారో.. ఆ ఇంటికి కాస్త దూరంలో బండి పార్కింగ్ చేసి వారి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, స్క్రూ డ్రైవర్‌తో ఇంటి తాళాలు పగులగొడతారు.. బీరువా తలుపులు విరగ్గొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి దోచుకుని పరారవుతారు.. ఇలా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 17 చోట్ల చోరీలు చేసి ఎట్టకేలకు కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 37 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండిని స్వాధీనపర్చుకున్నారు. ఈ మేరకు నిందితు లైన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగ రం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన ముద్దాడ నర్సింగరావులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. కాశీబుగ్గ పోలీసులకు చిక్కి.. గతేడాది మే 24న కాశీబుగ్గ పీఎస్ పరిధిలో బంగారం, వెండి చోరీ చేసిన కేసులో నిందితులైన భాస్క ర్, నర్సింగరావులు గురువారం నర్సిపురం రైల్వేగే ట్ ఎక్స్–సర్వీస్‌మ్యాన్ క్యాంటీన్ ఎదురుగా వాహన తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఆధ్వర్యంలో సీఐ చంద్రమౌళి నిందితులను విచారించగా వారు చేసిన ఒక్కొక్క నేరం వెలుగులోకి వచ్చాయి. కాశీబుగ్గ, మెళియాపుట్టి, జె.ఆర్.పురం, టెక్కలి పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, శ్రీకాకుళం రూరల్, వన్‌టౌన్, టూ టౌన్లో మూడేసి చోరీలు, పాతపట్నంలో రెండు చోరీలు చేయగా మన్యం జిల్లా పాలకొండలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలివే.. 17 కేసుల్లో 76 తులాలకు గాను రూ.36.80 లక్షల విలువైన 37 తులాల బంగారు ఆభరణాలు, 184.58 తులాల వెండికి గాను 20 తులాల వెండి, రూ.5 లక్షలు విలువ చేసే డైమండ్ ఆభరణాలకు గాను రూ.2 లక్షలు విలువైన డైమండ్ బ్రాస్లెట్, డైమండ్ లాకెట్, రూ. 3.44 లక్షల నగదుకు గాను రూ.25 వేలు నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువైన రెండు బైక్‌లు, రూ.2 లక్షలు విలువైన ఓ స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించడంలో కృషిచేసిన కాశీబుగ్గ పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన గజదొంగలు 17 చోరీలు చేసిన ఇద్దరు నిందితుల అరెస్టు ఒకరిది ఎచ్చెర్ల మండలం ముద్దాడ, మరొకరిది పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట 37 తులాల బంగారం, 20 తులాల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి లెక్కకు మించి కేసులు.. నిందితుల్లో ఒకరైన పోలా భాస్కరరావుపై శ్రీకాకుళంలో 19. విజయనగరంలో 16, విశాఖపట్నం(రూరల్–2) జిల్లాల్లో 37 చోరీ కేసులు నమోదవ్వగా ఎనిమిదింటి లో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. నర్సింగరావుపై 17 కేసులుండ గా (శ్రీకాకుళం–9, విజయనగరం–4, విశాఖపట్నం సిటీ–3, పార్వతీపురం మన్యం–1) మూడింటిలో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. చిన్నప్పటి నుంచే.. భాస్కరరావు తన తొమ్మిదో సంవత్సరంలోనే అప్పయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ కాలనీలో ఓ ఇంట్లో డబ్బులు దొంగిలించడంతో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో జువైనల్ కేసు నమోదైంది. మూడు నెలలు పాటు విశాఖ అబ్జర్వేషన్ హోంలో ఉన్నాడు. అప్పటి నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. ఇక నర్సింగరావు శ్రీకాకు ళం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంలో పనిచేస్తూ బై క్‌ను దొంగిలించి జైలుకి వెళ్లాడు. ఇద్దరికీ విశాఖపట్నం సెంట్రల్ జైలులో పరిచయమేర్పడి బయటకొచ్చాక రాత్రిపూట చోరీలు చేయడం మొదలుపెట్టారు. -
రోడ్డు ప్రమాదంలో షిఫ్ట్ ఆపరేటర్ మృతి
నందిగాం: మండల కేంద్రమైన నందిగాం ఫ్లై ఓవర్ వంతెనపై గురువా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలా స సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ సంపతి రావు రవికిరణ్(38) మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్యపేటకు చెందిన రవికిరణ్ పలాస విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పలాస వెళ్తుండగా నందిగాం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైకి వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఎగిరిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు హైవే అంబులె న్స్ సిబ్బంది వచ్చి రవికిరణ్‌ను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి. రవికిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెడ్ కానిస్టేబు ల్ బి.వి.రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టెన్త్ స్పాట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల రెండు కేంద్రాలుగా మూల్యాంకనం మొదలైంది. తొలిరోజే మొత్తం 7 సబ్జెక్టుల పేపర్లకు దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది. బాలికోన్నత పాఠశాలలో హిందీ, ఇంగి్ల్ష్, ఆల్ ఒరియా సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేశారు. మిగిలిన అన్ని సబ్జెక్టుల మూల్యాంకనాన్ని శ్రీచైతన్య పాఠశాల కేంద్రంలో చేపడుతున్నారు. కొద్దిమంది మినహా నియామకాలు అందుకున్న ఉపాధ్యాయులంతా స్పాట్లో పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీనాటికి స్పాట్‌ను ముగించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర పరిశీలకులు హాజరు.. పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ స్పాంట్ కేంద్రాలను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్/ఏసీ లియాకత్ ఆలీఖాన్, ఉపవిద్యాశాఖాధికారులు/డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. 1229 మంది వరకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. వీరికి అధికారులు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 7 రోజుల్లో స్పాట్‌ను పూర్తిచేసేలా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. స్పాట్ కేంద్రాలకు దూరంగా తిరుమల చైతన్య.. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ తిరుమల చైతన్య స్పాట్ కేంద్రాలకు దూరంగా ఉన్నారు. స్పాట్ కేంద్రంలో సెల్ఫోన్లు నిషేధమని అధికారులు చెప్పినా.. అది మాటలకే పరిమితమైంది. 2 కేంద్రాల్లో.. ఏడు పేపర్లకు మొదలైన మూల్యాంకనం 7 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు స్పాట్ కేంద్రాలకు దూరంగా డీఈఓ తిరుమల చైతన్య -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన బచ్చు వరలక్ష్మి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులకు విరాళ చెక్కును అందించారు. ఈ సందర్భంగా శోభనాద్రాచార్యులు మాట్లాడుతూ రూ.లక్ష అంతకుమించి విరాళాలిచ్చిన దాతలకు రథసప్తమి వంటి పర్వదినాల్లో విశిష్ట దర్శనానికి డోనర్ పాసులిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు. పీఆర్ ఇంజినీరింగ్ ఎస్ఈగా రవి అరసవల్లి: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ)గా గిద్దలూరి రవి గురువారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఈయన పాలకొండ పీఆర్ ఈఈగా బాధ్యతలు నిర్వర్తించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లాలో డివిజన్ల ఈఈలు ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. పీఆర్ ఇంజినీర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి గౌరవపూర్వకంగా కలిశారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సేవలను మరింత విస్తరిస్తానని రవి తెలిపారు. 6న ఎస్సీ వర్గీకరణ సమావేశం రణస్థలం: ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై సూచనలు, సలహాలు, చర్చ నిర్వహించేందుకు ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని ఇలిసిపురం వద్ద అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాల ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్ల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకట న విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీపీగా భాగ్యలక్ష్మి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏపీపీ)గా గొద్దు భాగ్యలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె నియామకం పట్ల జిల్లా బార్ అసోసియే షన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు గురువారం అభినందనలు తెలియజేశారు. ఆన్లైన్లో కూచిపూడి నాట్య శిక్షణ శ్రీకాకుళం కల్చరల్: కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు నగరానికి చెందిన ప్రముఖ నాట్యకారిణి స్వాతి సోమనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో కోర్సులు, ఎంఏ కూచిపూడి డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9849107426 నంబరును సంప్రదించాలని కోరారు. -
తండ్రీకొడుకులపై ఆర్మీ జవాన్ దాడి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చిన్నసాన పంచాయతీ గంగుపేట గ్రామంలో తండ్రీకొడుకులపై ఓ ఆర్మీ జవాన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగుపేట గ్రామానికి చెందిన చదునుపల్లి అప్పన్నకు తన అన్న కుమారుడైన ఆర్మీ జవాన్ చదునుపల్లి రాముకు మధ్య కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. గురువారం ఉదయం ఈ విషయమై అప్పన్నకు రాముకు మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో రాము కత్తితో చిన్నాన్న అప్పన్నపై దాడి చేశాడు. తొడ, చేతులను తీవ్రంగా గాయపరిచాడు. అప్పన్న కుమారుడు హరిబాబు అడ్డుకునే ప్రయ త్నం చేయగా అతనికి సైతం గాయాలయ్యాయి. గ్రామస్తులు కలుగచేసుకుని గొడవను ఆపి బాధితులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్ప న్న పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వై ద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయ ణ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొలం విషయంలో గొడవ కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు -
గంజాయితో వ్యక్తి అరెస్టు
సోంపేట: మండలంలోని కొర్లాం జాతీయ రహదారి వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బారువ ఎస్ఐ హరిబాబునాయుడు అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్ వద్ద సీఐ బి.మంగరాజు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొర్లాం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేయగా 1.050 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడు ఒడిశా నుంచి బాపట్లకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో బారువ ఎస్ఐ హరిబాబునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీ రైతుల భూముల్లో.. అక్రమంగా మట్టి తవ్వకాలు
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నరసన్నపేట మండలం బొడ్డవలసకు చెందిన ఎస్సీ రైతు కుటుంబాలు శ్రీరాంపురం వద్ద సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూముల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తహసీల్దార్ అనుమతి ఇచ్చారంటూ వందల కొద్దీ ట్రాక్టర్ల మట్టిని తవ్వేస్తున్నారు. పంట భూముల్లో మట్టిని తవ్వితే పంటలు ఎలా పండుతాయి.. తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ఎస్సీ రైతులు కూన అప్పలరామన్న, కూన రామారావు, కూన ఉపేంద్రలు వాపోతున్నారు. మండలంలోని రావులవలస పంచాయతీ శ్రీరాంపురం రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 25లో ఎల్పీ నంబరు 359లో తమకు మూడు ఎకరాల పొలం ఉందని, దీనిని 60 ఏళ్లుగా సాగు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దౌర్జన్యంగా తమ భూముల్లో మట్టిని తవ్వి పంటలు పండించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారని వాపోయారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావులవలస, గుండవల్లిపేటలకు చెందిన కొందరు ఎమ్మెల్యే పేరు చెప్పి మట్టి తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని, కులం పేరుతో దూషించి దుర్భాషలాడుతున్నారని వాపోయారు. తహసీల్దార్ వద్దకు వెళ్లగా వెంటనే స్పందించి ఆర్ఐ, వీఆర్వోలను పంపారని, అయినా మట్టి తవ్వకాలు ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయిస్తామని తెలిపారు. రోడ్డు పనులకు అవసరమంటూ తవ్వకాలు ట్రాక్టర్ లోడు రూ.500కు అమ్ముకుంటున్న టీడీపీ నాయకులు పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన అనుమతి ఇవ్వలేదు.. రైతుల భూముల్లో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆర్ఐ, వీఆర్వోలను పంపి మట్టి తవ్వకాలను ఆపించాం. మళ్లీ తవ్వుతున్నట్లు మాకు తెలియదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, నరసన్నపేట తహసీల్దార్ -
ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి
శ్రీకాకుళం రూరల్: విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని, పకడ్బందీ ప్రణాళికతో లక్ష్యా న్ని చేరుకోవచ్చునని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. గురువారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కోర్సు చదివితే భవిష్యత్‌లో బాగా స్థిరపడతామో ఆ కోర్సునే ఎంచుకోవాలన్నారు. అందులో తగిన నైపుణ్యత సాధిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. విద్యార్థులు ప్రతి విషయానికీ తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా ఎలా ఎదగాలో అలవర్చుకోవాలన్నారు. ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తిరుగుబాటు తప్పదు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు, దాడులు దౌర్జన్యకాండ చేస్తున్నారు. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాళి మండలంలో మారుమూల గ్రామాల్లో బయట సమాజానికి తెలియని ఇటువంటి దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి. పింఛన్లు ఆపివేయడం.. రేషన్ బియ్యం ఆపివేయడం చేస్తున్నారు. ఇప్పుడు సింహాద్రిపురం గ్రామంలో రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లోని మట్టితోనే దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారు. అధికారం వస్తే మంచి చేయాలి తప్పా ఇలా కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. సింహాద్రిపురం గ్రామంలో జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలి. –ఎస్.హేమసుందర్‌రాజు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, కోటబొమ్మాళి. ● -
నేటి నుంచే స్పాట్
కలెక్టర్‌తో చర్చలు సఫలం ఏర్పాట్లు పూర్తిచేశాం.. జిల్లాలో నేటి నుంచి మొదలయ్యే టెన్త్‌క్లాస్ జవాబుపత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ, డీఈఓ సూచనల మేరకు అధికారు లు, ఎగ్జామినర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – లియాకత్ ఆలీఖాన్, ఎగ్జామినేషనల్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాకుళం ●శ్రీకాకళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2025 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో గురువారం నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. స్పాట్లో భాగస్వామ్యమయ్యే ఉపాధ్యాయులు తొలిరోజు బహిష్కరిస్తామని తొలుత చెప్పినా బుధవారం సాయంత్రం కల్లా స్పష్టత రావడంతో యథావిధిగా స్పాట్ ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతోపాటు సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య స్కూల్ కేంద్రాలుగా మూ ల్యాంకనం నిర్వహించనున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య నేతృత్వంలో స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్/ అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లుగా ఉప విద్యాశాఖాధికారులు ఆర్.విజయకుమారి(శ్రీకాకుళం), పి.విలియమ్స్(టెక్కలి/పలాస) వ్యవహరించనున్నారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు(వాల్యుయేషన్)గా మరో ఏడుగురు సీనియర్ హెచ్ఎంలను నియమించారు. జవాబుపత్రాలను దిద్దే అన్ని గదుల్లో సీసీ కెమెరాలను అమర్చారు. శరవేగంగా కోడింగ్ ప్రక్రియ.. స్పాట్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఆర్జేడీ, డీఈఓ, ఇతర అధికారులు ఆరా తీశారు. టెన్త్ జవాబుపత్రాలకు సంబంధించి తెలుగు/సంస్కృతం/ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు(లాంగ్వేజ్ పేపర్లు), మాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్స్టడీస్ మొత్తం 7 పేపర్లకు సంబంధించి 24 పేజీల బుక్‌లెట్స్‌తో కూడిన 1,81,367 జవాబు పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. కోడింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తెలుగుమీడియం, ఇంగ్లీషు మీడియం, ఒరియా మీడియం జవాబుపత్రాల మూల్యాంకనం జరగనుంది. 1229 మంది సిబ్బంది.. టెన్త్ స్పాట్‌కు1229 మంది టీచర్లు భాగస్వామ్యం అవుతున్నారు. సబ్జెక్టు టీచర్లు పూటకు 20 పేపర్ల చొప్పున రోజుకు 40 పేపర్లను దిద్దనున్నారు. పేపర్‌కు రూ.10 చొప్పున 40 పేపర్లకు రూ.400 కేటాయిస్తారు. డీఏగా సుదూర ప్రాంతాల పాఠశాలల నుంచి హాజరయ్యే ఉపాధ్యాయులకు అవుట్‌స్టేషన్ అలవెన్స్‌గా రూ.400 చెల్లిస్తారు. స్పెషల్ అసిస్టెంట్లకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తారు. అరకొరగా ఉండే ఈ మొత్తాలని గత ఏడాదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. జిల్లాలో మొదలుకానున్న టెన్త్ మూల్యాంకన ప్రక్రియ శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కోడింగ్ ప్రక్రియ జిల్లాకు చేరిన 1.81 లక్షల జవాబుపత్రాలు మరో ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత స్పాట్ కేంద్రాలకు దూరంగా డీఈఓ శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం పాతబస్టాండ్: కుప్పిలి కాపీయింగ్ ఘటనలో టీచర్ల సస్పెన్షన్ నేపథ్యంలో స్పాట్ బహిష్కరిస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ విజ్ఞప్తి మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రంగంలోకి దిగారు. ద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మధ్యవర్తిత్వం ద్వారా బుధవారం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్లు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్‌మోహన్‌లతో కలెక్టర్ తన కార్యాల యంలో చర్చలు జరిపారు. ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సస్పెన్షన్‌కు గురై హోల్డ్‌లో ఉన్న నలుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురిపై బుధవారం రాత్రి సస్పెన్షన్ ఎత్తివేశారు. ఉపాధ్యాయులపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేసేందుకు నిర్ణయించారు. స్పాట్ కేంద్రాలకు డీఈఓను దూరంగా ఉంచేందుకు కూడా అంగీకరించారు. విచారణ కమిటీ నివేదిక ప్రకారం డీఈఓపై తగు చర్యలు చేపడతామని చెప్పారు. -
మెకానిక్ కుమారుడికి రెండు ఉద్యోగాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మహారాణిపేటకు చెందిన కోసూరు నవీన్‌కుమార్ ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. కాశీబుగ్గలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న కోసూరు భాస్కరరావు, నిర్మల దంపతుల కుమారుడైన నవీన్ 2021లో బీఎస్సీ పూర్తి చేసి విశాఖలో కోచింగ్ తీసుకున్నాడు. పలుమార్లు బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమై విఫలమైనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో సాధన చేశాడు. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పీఓగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించానని నవీన్ తెలిపారు. సైనికుడికి సలాం బూర్జ: మండలంలోని అన్నంపేట గ్రామానికి చెందిన మామిడి సింహాచలం 22 ఏళ్లు సైన్యంలో సర్వీసు పూర్తి చేసి ఉద్యోగ విరమణ పొంది గ్రామానికి వచ్చినందుకు బుధవారం స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం లవ్లీయూత్ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం, సునీత దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు అప్పలనాయుడు, మాణిక్యం, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ నెల 4న భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించి శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం ఎంపికలు నిర్వహించారు. 55 కేజీల విభాగంలో బి.అభి, వైకుంఠం, 60 కేజీల విభాగంలో విభాగంలో ఎస్.బన్నీ, సుమంత్, 65 కేజీల విభాగంలో ఎం.రాంబా బు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణ్, జిల్లా అధ్యక్షుడు తారకేశ్వరరావు, కార్యదర్శి కె.గౌరీశంకర్, సీనియర్ బాడీ బిల్డర్లు బి.విజయకుమార్ సందీప్, చరణ్ పాల్గొన్నారు. -
అదుర్స్
ఆలోచనలు శ్రీకాకుళం న్యూకాలనీ: ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందని, పాఠశాల స్థాయి నుంచే పరిశోధనా దృక్పథాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా బుధవారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈఎండీపీ) పేరిట ప్రాజెక్టుల ప్రదర్శన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి 40 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. పలాస మండలం బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన అన్వేషి ప్రాజెక్ట్, కోటబొమ్మాళి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన సేఫ్ వీల్స్ ప్రాజెక్ట్‌లు తొలి రెండుస్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు అర్హత సాధించాయి. ప్రాజెక్టుల్లో భాగస్వాములైన విద్యార్థులు, గైడ్ టీచర్లను ఆర్జేడీతోపాటు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య అభినందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, ఉద్యం స్టేట్ లీడ్ సుశాంత్, జిల్లా మేనేజర్ ఎ.అనూష, ఉపాధ్యాయలు, సైన్స్ అధికారులు పాల్గొన్నారు. పాఠశాల: ఎస్జీబీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, కోటబొమ్మాళి విద్యార్థులు: ఎస్.భావన, ఎ.జాహ్నవి, పి.కీర్తి గైడ్ టీచర్: సీహెచ్‌వీ రోజామణి అంశం: మద్యం తాగి వాహనం నడపడటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్ వీల్స్ వ్యవస్థను వాహనాల్లో అమర్చడం ద్వారా అందులో ఉండే ఆల్కహాల్ సెన్సార్లు.. డ్రైవర్ మత్తును గుర్తించడంతోపాటు మైక్రో కంట్రోలర్ ద్వారా విశ్లేషణ చేసి బజర్ మోగించి వాహనాన్ని నిలుపుదల చేస్తుంది. దీంతో కొంతమేర ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని విద్యార్థులు తెలియజేశారు. ప్రాజెక్ట్ సేఫ్ వీల్స్ ప్రాజెక్ట్ అన్వేషి పాఠశాల: బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలాస మండలం. విద్యార్థులు: పి.ప్రణీత్, ఎస్.కార్తీక్, కె.మోక్షజ్ఞ గైడ్ టీచర్: కొయ్యల శ్రీనివాసరావు అంశం: చాలా మంది చిన్నారులు, మూగవా రు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వృద్ధులు తప్పిపోయినప్పుడు వారి అడ్రస్, వివరాలు వంటివి చెప్పలేరు. అలాంటి వారికి ఉపయో గపడేలా అన్వేషి ప్రాజెక్ట్ రూపొందించారు. అల్జీమర్స్ సమస్యతో బాధపడేవారు నిత్యం ఉపయోగించే వస్తువులకు క్యూఆర్ కోడ్లను అమర్చితే.. తప్పిపోయినప్పుడు ఎవరైనా మొబైల్‌ఫోన్‌తో స్కాన్ చేసి కుటుంబ సభ్యుల కు వివరాలు చేరవేయవచ్చు. సర్టిఫికెట్లు, నగ లు, పెంపుడు జంతువులు ఇలా విలువైన వస్తువులు పోగొటుకున్న వారికి సైతం ఇలాగే అందజేయవచ్చని విద్యార్థులు తెలియజేశారు. ముగిసిన ఈఎండీపీ జిల్లా ఎక్స్పో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి రెండు ప్రాజెక్టుల ఎంపిక -
పాలిటెక్నిక్..!
భవితకు.. ● ఉమ్మడి జిల్లాలో 10 కళాశాలలు ● ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు ● ఐదు ప్రైవేట్ కళాశాలల్లో 1,801 సీట్లు ● ఈనెల 30న పాలీసెట్ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: పేద, మధ్య తరగతి విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణత తర్వాత ప్రాధాన్యతనిచ్చే కోర్సుల్లో పాలిటెక్నిక్ కోర్సు ఒకటి. ఈ కోర్సులో చేరడం వలన తక్కువ వయస్సులో ఉద్యోగం, ఆసక్తి ఉంటే ఇంజినీరింగ్ చదివేందుకు అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యాశాఖ సైతం పారిశ్రామిక రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కరిక్యులమ్ తీర్చిదిద్దుతోంది. మిగతా కోర్సులతో పోల్చిచూస్తే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్లేస్మెంట్లు ఎక్కువ. రైల్వే, డిఫెన్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఉచిత శిక్షణ ప్రభుత్వ కళాశాలల్లో పాలీసెట్ – 2025కు సాంకేతిక విద్యాశాఖ ఉచిత శిక్షణ ఇస్తోంది. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పురుషులకు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలికలకు, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో బాలురు, బాలికలకు గురువారం నుంచి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఈనెల 28వ తేదీ వరకు ఉంటుంది. నమూనా పరీక్ష సైతం శిక్షణ ముగింపు చివరిలో నిర్వహిస్తారు. ప్రారంభంలో స్టడీ మెటీరియల్ సైతం అందజేస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతం పాలీసెట్ – 2025 దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో కొనసాగుతోంది. మార్చి 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సౌలభ్యం కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు విద్యార్థులు http://apsbtet.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. పరీక్షను ఈనెల 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.400 లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.100లుగా నిర్ణయించారు. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం నుంచి 50 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి పరీక్షలు పూర్తవ్వడంతో ప్రభుత్వ పాలిటెక్నక్ కళాశాలల్లో పాలీసెట్ –2025 శిక్షణ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ శిక్షణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులతో శిక్షణ ఇవ్వడం, నమూనా పరీక్ష నిర్వహించడం, స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను సైతం తీర్చిదిద్దింది. – బి.జానకి రామయ్య, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జిమెరుగైన ప్లేస్‌మెంట్స్ మిగతా కోర్సులతో పోల్చితే పాలిటెక్నిక్ విద్యలో ప్లేస్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రారంభం నుంచి మూడేళ్ల పాటు పారిశ్రామక అవసరాలపై శిక్షణ ఉంటుంది. ప్రయోగ విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. కాలానుగుణంగా సిలబస్‌లో సైతం సాంకేతిక విద్యాశాఖ మార్పులు చేస్తోంది. – మురళీకృష్ణ, సీనియర్ అధ్యాపకులు జిల్లాలో ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 780, ఐదు ప్రైవేట్ కళాశాలల్లో 1,801 సీట్లు ఉన్నాయి. మొత్తం 2,581 సీట్లు ఉన్నాయి. సీసీపీ, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచ్‌లు ప్రధానంగా ఉన్నాయి. బాలికలకు ప్రత్యేక శిక్షణ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. పాలిటెక్నిక్ విద్య తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆసక్తి మేరకు ఉన్నత విద్య సైతం చదవవచ్చు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. – టి.విక్టర్ పాల్, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ప్రిన్సిపాల్ -
ఐటీడీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి
మందస/కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలోని మందస కేంద్రంగా గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందసలో శ్రీకాకుళం జిల్లా గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ ఎస్.హైమావతికి వినతిపత్రం అందజేశారు. పలాస నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు దశాబ్ధాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 1/70 చట్టాన్ని అమలు చేయాలని, గిరిజన గ్రామాల్లో సాగునీటి వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చాపర సుందర్‌లాల్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సవర హరికృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి, గిరిజన సంఘం నాయకులు సవర ఎంగిలాకు, సవర సోంబారమ్మ, సవర నీలకంఠం, సవర కిరణ్‌కుమార్, దండాసి రవి, సవర రమేష్, సవర జునాస్, సవర కురామణి, సవర భువనేశ్వర్ దులాయ్ తదితరులు పాల్గొన్నారు. -
మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు
శ్రీకాకుళం క్రైమ్ : మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని టౌన్ హాల్ రోడ్డులోని ఆర్సీఎం సెయింట్ థామస్, చినబజారు రోడ్డులో ఉన్న చర్చి రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గూనపాలెం మేదరవీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్ (25) అలియాస్ ప్రసాద్ ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్‌గా, అదే వీధికి చెందిన గ్రంధి సోమశేఖర్ (23) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 9:30 ప్రాంతంలో ఇద్దరూ స్కూటీపై వచ్చి సెయింట్ ఽథామస్ చర్చి రక్షణ గోడపై అన్యమత రాతలు రాశారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చి వద్దకు చేరుకున్నారు. సోమశేఖర్ ఎలక్ట్రీషియన్ కావడంతో అక్కడ విద్యుత్‌ను నిలుపుదల చేసి ఇద్దరూ రక్షణ గోడ, లోపల అన్యమత రాతలు రాసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి డీఎస్పీ వివేకానందకు ఆదేశాలు జారీ చేయడంతో ఒకటి, రెండో పట్టణ సీఐలను ఘటనాస్థలికి పంపించారు. అక్కడి స్థానికులను విచారించి సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం నిందితులిద్దరినీ గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అరసవల్లి మామిడి తోట వద్ద సీఐ పైడపునాయుడు బృందం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫేమస్ అవుదామనే.. జిల్లాలో ఇటీవల జలుమూరులో జరిగిన అన్యమత రాతల ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా ఫేమస్ అవుదామనే ఇద్దరు యువకులు ఇలా రాతలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందన్నారు. కేసును డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించిన సీఐ పైడపునాయుడు, ఎస్ఐలు హరికృష్ణ, జనార్ధన, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. కుల, మత, రాజకీయ వర్గాల మధ్య మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మందిరాల నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, స్థానికులతో యూత్ కమిటీ, శాంతి కమిటీలను ఏర్పాటుచేయాలని సూచించారు. రాత్రి పూట ఇద్దరేసి కమిటీ సభ్యులు ఉండాలన్నారు. హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. -
పండుటాకులపై ప్రతాపమా..?
● రెండు నెలలుగా 8 మంది వృద్ధులకు అందని పింఛన్లు ● ఇన్చార్జి ఎంపీడీవోను నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు టెక్కలి: కోటబొమ్మాళి మండలం కమలనాభపురం గ్రామంలో దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణలకు వృద్ధాప్య పింఛన్లు రెండు నెలలుగా అధికారులు అందజేయడం లేదు. దీంతో గ్రామ సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, నాయకులు అన్నెపు రామారావు, ఎస్.హేమసుందర్‌రాజు, కె.సంజీవరావు, దుక్క రామకృష్ణారెడ్డి, ఎస్.జనార్ధన్‌రెడ్డి, బి.వెంకటరమణ, జి.సోమేష్, శివారెడ్డి, ఎస్.నారాయణరాజు తదితరులు బాధిత పింఛనుదారులతో కలిసి బుధవారం కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇన్చార్జి ఎంపీడీవో జయంత్ప్రసాద్ను నిలదీశారు. నిన్నటివరకు విధుల్లో ఉన్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి రమేష్ గత నెలలో పింఛన్లు ఆపివేశారని తెలిపారు. దీనిపై అప్పుడు అడిగితే ఏప్రిల్ నెలలో పింఛన్లు ఇస్తామని చెప్పారని గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి గుర్తు చేశారు. అయితే ఈనెల 1వ తేదీన గ్రామంలో చేపట్టిన పింఛన్ల పంపిణీలో మరలా 8 మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటివరకు విధుల్లో ఉన్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ను ఈ విషయంపై సంప్రదిస్తే 2వ తేదీన పింఛన్లు ఇచ్చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు హేమసుందర్‌రాజు మండిపడ్డారు. ఏమని దర్యాప్తు చేస్తారు..? అయితే నిలిపివేసిన పింఛన్లపై దర్యాప్తు చేస్తామని ఇన్చార్జి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్ చెప్పగా, డీఆర్డీఏ నుంచి కాకుండా స్థానికంగా కక్ష సాధింపులో భాగంగా పింఛన్లు ఆపేస్తే ఏమని దర్యాప్తు చేస్తారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధుల పింఛన్లను రెండు నెలలుగా ఆపివేసి ఇప్పుడు కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు చెబితేనే పింఛన్లు ఆపివేశామని కాగితంపై రాసిచ్చేయండి అంటూ వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు దుయ్యబట్టారు. అయితే సాయంత్రంలోగా పింఛన్లు ఇచ్చేస్తామంటూ సెలవుపై వెళ్లిన ఎంపీడీవో ఫణీంద్రకుమార్ ఫోన్లో సమాధానం చెప్పాడు. తీరా సాయంత్రానికి అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా, పంచాయతీ కార్యదర్శి రమేష్ సైతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని నాయకులు వెల్లడించారు. బాధిత పింఛన్‌దారులకు పింఛన్ డబ్బులు ఇచ్చేవరకు న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
అవగాహన సదస్సు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌పై అవగాహన సదస్సు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు తిరుమల విద్యాసంస్థల అధినేత ఎన్.తిరుమలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని రాజులతాళ్లవలస తిరుమల క్యాంపస్‌లో ఉదయం 10 గంటల నుంచి సదస్సు జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 98489 86450, 98489 86451 నంబర్లను సంప్రదించాలని కోరారు.పచ్చ నేతల హల్చల్ ఇచ్ఛాపురం రూరల్: బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కూటమి నాయకులు హల్చల్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కె.రామారావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఇంటర్వ్యూలకు 402 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. అయితే ఈ సమయంలో కూటమి నాయకులు బ్యాంకు అధికారుల పక్కనే కూర్చొని తమ అనుచరులకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. దీంతో సబ్సిడీ రుణాల మంజూరుపై బ్యాంకు అధికారులను సైతం కూటమి నాయకులు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం సరికాదని పలువురు బహిరంగంగా విమర్శించారు. రైలుకింద పడి మహిళ మృతి కాశీబుగ్గ: పలాస జీఆర్పీ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సోంపేట రైల్వేస్టేషన్ యార్డ్ నందు గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి బుధవారం మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో లభించిందని తెలిపారు. మృతురాలు గులాబీ, పసుపు రంగు కలిగిన పంజాబీ డ్రెస్ ధరించి ఉందన్నారు. చామనచాయ రంగు కలిగి ఉండి, శరీరం రెండుగా విడిపోయి ఉందని కానిస్టేబుల్ డి.హరినాథ్ వివరించారు. వివరాలు తెలిసినవారు 99891 36143 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 8 మంది పేకాటరాయుళ్లు అరెస్టు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో ఉన్నటువంటి నర్సిపురం కాలనీలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు. నర్సిపురం కాలనీ లే అవుట్లో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆడుతున్న స్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్లు నుంచి రూ.60,400ల నగదు, పేక ముక్కలు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ ఎస్ఐ ఆర్.నరసింహామూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త పాసులు ఇవ్వకపోవడం సరికాదు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం నగరంలోని కాంప్లెక్స్ వద్ద కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కొత్తపాసులు ఇవ్వకపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అండ్ కాలేజీస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగు మన్మథరావు, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు మాధవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చందు, హరీష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి చివరిలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ, పారామెడికల్ కౌన్సిలింగ్లో విద్యార్థులు పలు కళాశాలల్లో నూతనంగా అడ్మిషన్లు పొందారన్నారు. వీరు తమ కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి బోనిఫైడ్ సర్టిఫికెట్తో ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్తే కొత్తపాసులు మంజూరు చేసేందుకు నిరాకరించడం దారుణమన్నారు. పేద విద్యార్థులు కావడంతో పాసులు మంజూరు చేయకపోతే రాకపోకలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. -
ఉపాధ్యాయా.. ఇదేందయ్యా..!
● టీడీపీ అవిర్భావ దినోత్సవంలో టీచర్ ● వెల్లువెత్తిన విమర్శలువజ్రపుకొత్తూరు: మండలంలోని పూండిగల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూల ఉపేంద్ర సందడి చేశారు. అమలపాడు ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇతను చురుకుగా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో ఇతని వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ నాయకుడు దువ్వాడ జయరాం చౌదరి, ఇతర కార్యకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతా తానై ముందుకు నడిపించి, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమావేశమై రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. పల్లె పండుగ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కోర్టు కేసుల పరిష్కారం, వక్ఫ్ ఆస్తుల సర్వే తదితర అంశాలపై సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీఓ భారతి సౌజన్య, వ్యవసాయాధికారి కోరాడ త్రినాథస్వామి, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ నగేష్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
● ఆర్టీసీ ఈయూ జోనల్ కార్యదర్శి మూర్తి శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఆర్టీసీ పరిధిలోని శ్రీకాకుళం–1, 2 డిపోలు, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల్లో పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బి.కె.మూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలోని ఈయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు రద్దు చేసి 1/2019 సర్క్యూలర్ అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో కొంతమంది ఉద్యోగులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగులను ఉద్యమాలవైపు నెడుతున్నారన్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాలోని నాలుగు డిపోల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విజయనగరం జోన్లో 19 డిపోల్లో ఉద్యమం చేస్తామన్నారు. ఆయనతో పాటు ఈయూ నాయకులు ఎ.దిలీప్‌కుమార్, జి.త్రినాథ్, కేజీరావు తదితరులు ఉన్నారు. -
హేతుబద్ధత లేని వర్గీకరణ ఆపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని జాతీయ రెల్లి ఎస్సీ గ్రూపు కులాల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి గ్రూపు కులాలకు జరగనున్న అన్యాయాన్ని నిరసిస్తూ నగరంలోని పెద్దరెల్లివీధి నుంచి ఏడురోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్ చేరుకొని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రాజ్యాంగ ఫలాలను అందజేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఆర్టికల్ 371 (డి) అనుసరించి జిల్లా, జోన్, రాష్ట్రంలో అవకాశాలు కల్పించాలని కోరారు. అలా కాని పక్షంలో రెల్లి గ్రూపు కులాల అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వర్గీకరణను వ్యతిరేకించడం లేదని, హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు వర్గీకరణ చేయాలని కోరుతున్నామన్నారు. దీనిలో భాగంగా రెల్లి గ్రూపు కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అర్జి కోటి, నగర అధ్యక్షుడు ఎ.ఈశ్వరరావు, రెల్లి ఉప కులాల నాయకులు కాశీ రథో, గోడలి మిన్ను, దండాసి దుర్యోధన, బైరి శివప్రసాద్, దేవర రాము, లోకొండ లక్ష్మణరావు, మజ్జి బాబ్జి, విశాఖపట్నం రవి, వీరగొట్టం ఆనంద్, రణస్థలం ఫణి కుమార్, జలగడుగుల శ్రీరామ, కె వెంకటరావు, జె గోవిందరావు, ఎ.గోవిందరావు, విజయ్, ఎం.రామారావు, జె.శ్రీను, ఇంటి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్ కుమార్‌లు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు మజ్జి మదన్మోహన్, ఎస్.కిషోర్ కుమార్, చౌదరి రవీంద్ర, లండ బాబురావు, టెంక చలపతిరావు, బి.రవి కుమార్, ఎస్వీ రమణమూర్తి, పూజారి హరి ప్రసన్న, కొమ్ము అప్పలరాజు, వాల్తేటి సత్యనారాయణ, జి.రమణ, సీర రమేష్ బాబు, జగన్మోహన్ ఆప్తా, బలివాడ ధనుంజయరావు, కొత్తకోట శ్రీహరి, గొంటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ఇచ్ఛాపురం రూరల్: తమ స్థలానికి ఎదురుగా ఉన్న రచ్చబండను తొలగించి, ఆ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కె.శాసనాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఇటీవల తన అనుచరులతో కలిసి రచ్చబండను తొలగించారు. దీనిపై సాక్షి దినపత్రికలో ‘పచ్చ తమ్ముడి బరితెగింపు’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు బుధవారం స్పందించారు. ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు’ అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డు తహసీల్దార్ కె.వెంకటరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు. 16 గొర్రె పిల్లల సజీవదహనం మెళియాపుట్టి: మండలంలోని కరజాడ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, దాసరి ఢిల్లేశ్వరరావు, సార రామయ్యలకు చెందిన 16 గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి. మార్చి 30వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు పెంపకందారులు చెబుతున్నారు. బుధవారం పలువురు పెంపకందారులతో మాట్లాడగా గిట్టని వాళ్లెవరో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుమారు రూ.50 వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
తప్పనిసరి
ట్రేడ్ లైసెన్స్..● 90 శాతం షాపులకు లైసెన్సులు లేనట్లు గుర్తించాం ● పీడీఎస్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవు ● మెడికల్ దుకాణాల్లో మరిన్ని తనిఖీలు ● ‘సాక్షి’తో విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు శ్రీకాకుళం క్రైమ్ : అక్రమంగా వ్యాపారం సాగించే షాపులపై నిరంతరం నిఘా ఉంటుందని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రతి షాప్‌కు జీఎస్టీ లైసెన్సుతో పాటు ట్రేడ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, అనుమతులు లేనివాటిని ఇప్పటికే గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే కేసులు బుక్ చేస్తామని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనరాదని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రామలక్ష్మణ కూడలి సమీపంలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశ్న: జిల్లాలో ట్రేడ్ లైసెన్సు లేకుండా షాపులు ఉన్నాయా..? జవాబు: జిల్లా కేంద్రంలో 3,109 షాపులు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్‌లైసెన్సు పొందిన్నట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జీటీరోడ్డు, కళింగ రోడ్డు, పాలకొండ రోడ్డు, పెద్దపాడు రోడ్డులో ఇటీవల సుమారు 1100 షాపులను తనిఖీ చేశాం. వీటిలో 1046 షాపులకు ట్రేడ్ లైసెన్సులు లేవు. అంటే 90 శాతం అనుమతులు లేవు. వీటికి రూ.23,15,570 జరిమానా విధిస్తూ మున్సిపాలిటీ వారికి అంచనా నివేదిక పంపించాం. దీనిని బట్టి జిల్లాలో అనుమతి లేకుండా ఎన్ని ఉంటాయన్నది అంచనా వేసుకోవచ్చు. ప్రశ్న: అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిపోతుంది. దీనిపై తీసుకుంటున్న చర్యలు? జవాబు: రెండు లారీలు, ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 1434.51 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశాం. గతేడాది చివర్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 6ఏ కేసులు 28, క్రిమినల్ కేసులు 21 నమోదు చేశాం. ప్రశ్న: మెడికల్ షాపులపై ఇటీవల దాడులు చేశారు. నిఘా కొనసాగుతుందా? జవాబు:ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఎకై ్స్పరీ అయిన మందులను కొన్ని షాపుల్లో అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపాం. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉండే మెడికల్ షాపులపై ఇప్పటికే నిఘా పెట్టాం. మరిన్ని దాడులుంటాయి. ప్రశ్న: ఐరన్ స్క్రాప్ జిల్లా నుంచి తరలిస్తున్నట్లు వినిపిస్తోంది? జవాబు:ఇటీవల గుంటూరు కేంద్రంగా చేసుకుని తప్పుడు జీఎస్టీ బిల్లులతో అక్రమంగా విజయనగరం, మన జిల్లాల నుంచి ఎనిమిది లారీల్లో తరలిస్తున్న 14 టన్నుల (12.5 క్యూబిక్ మీటర్లు) ఐరన్స్క్రాప్ను సీజ్ చేశాం. రూ.16 లక్షల వరకు జరిమానా విధించాం. ఒకరిపై ఎఫ్ఐఆర్ వేయించాం. ప్రశ్న: పర్మిట్లు లేకున్నా క్వారీలు తవ్వడంపై తీసుకుంటున్న చర్యలు? జవాబు: నందిగాం మండలం లట్టిగాం గ్రానైట్ స్టోన్ క్రషర్కు సంబంధించి క్వారీ తవ్వినదానికి, తీసుకున్న పర్మిట్స్‌కు వ్యత్యాసం ఉండటంతో రూ.16 కోట్ల వరకు పెనాల్టీ విధించాం. ఇదే తరహాలో రేగులపాడులో ఇచ్చిన లీజ్ ఏరియా కాకుండా బయట కూడా చేస్తున్నట్లు గుర్తించి రూ.19.65 కోట్లు జరిమానా విధించాం. జగనన్న హౌసింగ్ స్కీమ్‌లో ఇంజినీరింగ్ వెరిఫికేషన్‌లో కన్స్ట్రక్షన్ బిల్లు విస్తీర్ణం కంటే స్లాబ్ లెవెల్ పెంచినందుకు గాను రూ. 6.7 కోట్ల జరిమానా వేస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఇంకెక్కడైనా ఇలా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మీరు వచ్చాక ఖనిజ సంపద ఎంతమేర పట్టుబడింది? జవాబు: మన జిల్లాలో కాదు గానీ, విజయనగరం జిల్లా రాజాం మండలం జి.చీపురుపల్లిలో మాంగనీస్ 20 టన్నులు (18 క్యూబిక్ మీటర్లు), ఒక పొక్లెయినర్, లారీ సీజ్ చేసి ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేశాం. విజయనగరం జిల్లా బట్టిరాజేరు మండలంలో రూ. 9.75 కోట్లు, సారయ్యవలస మండలంలో రూ.12.45 కోట్ల విలువ చేసే క్వార్ట్జైట్ మినరల్స్ సీజ్ చేశాం. ప్రశ్న: ప్రభుత్వ టార్గెట్‌ను చేరుకున్నారా.? జవాబు: ప్రభుత్వం మాకిచ్చిన యాన్యువల్ టార్గెట్(జరిమానా) రూ.182 కోట్లు. లక్ష్యానికి ఇప్పటివరకు 196.59 కోట్లకు ప్రతిపాదనలు పంపగా సుమారు రూ.120 కోట్లకు ప్రభుత్వం ఆమోదించింది. -
పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞానభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని అమలు పరచడానికి గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో కరపత్రం విడుదల చేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకుండా అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర, వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. కాగా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా అంబటి దాలినాయుడు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా చాన్ బాషాను నియమించామని చెప్పారు. జిల్లా ఇన్చార్జి గాదం వెంకట త్రినాథరావు సమక్షంలో నియామకపత్రాలు అందజేశామని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, కొత్తపల్లి రాంప్రసాద్, సైదుల్లా ఖాన్, ఎస్.కె.బాషా, బాబు, చోడవరం చంద్రశేఖర్, చోడవరం లీలావతి, సూరియా బేగం పాల్గొన్నారు. -
జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలకు వేళాయె..
శ్రీకాకుళం న్యూకాలనీ: యువ, వర్ధమాన క్రికెటర్లకు జిల్లా క్రికెట్ సంఘం శుభవార్త చెప్పింది. కొత్త సీజన్లో ఏసీఏ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించనున్న పురుషుల వన్డే, టీ–20 జట్ల ఎంపికలకు సన్నద్ధమైంది. ఈ నెల 4న అండర్–23 ఎంపికలు, 5న అండర్–19 ఎంపికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారుచేసింది. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రికెట్ మైదానం వేదికగా ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో అండర్–19 విభాగానికి 2006 సెప్టెంబర్ ఒకటి తర్వాత, అండర్–23కి 2002 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించి ఉండాలని జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. గతంలో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో సెలక్షన్ కమిటీలను నియమించి అత్యంత పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపికచేసేందుకు సన్నద్ధమౌతున్నారు. క్రీడాకారులు విధిగా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ తెలిపారు. తెలపు యూనిఫాంతోపాటు ఎవరి క్రికెట్ కిట్లను వారే తీసుకురావాలని సూచించారు. -
గడ్డి కుప్ప దగ్ధం
టెక్కలి రూరల్: మండలంలోని నంబాలపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నంబాల ఉదయ్బాస్కర్కు చెందిన గడ్డి కుప్ప దగ్ధమైంది. పక్కన పొలంలో రైతు చెత్తకు అగ్గిపెట్టడంతో అది కాస్త అంటుకుని సమీపంలో ఉన్న గడ్డికుప్పకు అంటుకుని దగ్ధమైంది. దానితో పాటు అక్కడే ఉన్న సుమారు 50 సెంట్ల టెట్టంగి పంటకు సైతం మంట అంటుకోవడంతో రైతు అగ్నిమాక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.35వేలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. -
వ్యాన్ ఢీకొని బంక్ ఆపరేటర్ మృతి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర గ్రామంలో వినాయకుడి ఆలయం వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక రోడ్డు దాటుతుండగా రొయ్యల వ్యాన్ ఢీకొట్టడంతో కాపుగోదాయవలసకు చెందిన నందిగాం కాళీ దుర్గాప్రసాద్ (55) మృతి చెందాడు. ఇతను బోరుభద్ర పెట్రోల్ బంక్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి పోలీసులు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని కొర్లాం గ్రామంలో తారకేశ్వర శివాలయం వద్ద చెరువులో పడి వృద్ధుడు మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బారువ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బాలిగాం గ్రామానికి చెందిన గున్న గున్నయ్య(70) పరిసర ప్రాంతాల్లో యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మృతిచెందాడు. ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై కొండముచ్చుల దాడి కంచిలి: మండలంలోని డోలగోవిందపురంలో కొండముచ్చుల దాడిలో అదే గ్రామానికి చెందిన సింధు మూళి అనే బాలిక తీవ్ర గాయాలపాలయ్యింది. మంగళవారం తల్లి ఢిల్లీశ్వరితో కలిసి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళుతుండగా మూడు కొండముచ్చులు ఒక్కసారిగా వచ్చి గాయపరిచాయి. వెంటనే బాలికను మఠం సరియాపల్లి పీహెచ్సీలో చేర్పించి చికిత్స చేయించారు. గ్రామంలో చాలా రోజులుగా కోతులు, కొండముచ్చులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే కష్టం
● జాబ్‌మేళాలో మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కష్టమని.. ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ఉపాధి కలిగించేలా నైపుణ్యత శిక్షణ అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మంగళవారం కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమక్షంలో నిర్వహించిన జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 32 కంపెనీల ద్వారా 1200 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో తెలియడానికి ఆన్లైన్ చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 9 నెలల పాలనలో 7 లక్షల పెట్టుబడులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ విభాగానికి అధిక శాతం ఉద్యోగాలకు దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ వేతనాలు, ప్రదేశాలతో సంబంధం లేకుండా ముందుగా ఉద్యోగాల్లో చేరాలన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఏపీఎస్ఎస్డీసీ జిల్లా అధికారి యు.సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, సెట్‌శ్రీ సీఈఓ ప్రసాదరావు, నెహ్రూ యువకేంద్రం డీడీ ఉజ్వల, ఉపాధి కల్పన అధికారి వంశీ, నాయకులు కె.హరివరప్రసాద్, బి.రమేష్, బి.రమణమ్మ, టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జేడీతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో కుప్పిలి మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షల కాపీయింగ్ రగడలో మిగిలిన నలుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి మరో మూడు నాలుగు రోజులు సమ యం కావాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులను కోరారు. 3 నుంచి జరగనున్న టెన్త్‌క్లాస్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం జిల్లాకు వచ్చిన ఆర్జేడీ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్యను విధుల నుంచి తక్షణమే తప్పించాలని, మిగిలిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్లు ఎత్తివేయాలని, ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని సంఘాల ప్రతినిధులు కోరారు. వీటిపై మూడు నాలుగు రోజులు గడువు కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, దుప్పల శివరామ్‌ప్రసాద్, ఎంవీ రమణ, శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వరరావు, వసంతరావు, కిషోర్‌కుమార్ తదితరులు పేర్కొన్నారు. అనంతరం డీఈఓ కార్యాలయం ఎదుట అధికారుల వైఖరిని నిరసిస్తూ నిరసన చేపట్టారు. అంతకుముందు అదనపు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఉపాధ్యాయులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయమై తమకు స్పష్టతకావాలని ఉపాధ్యాయులు కోరగా.. ఎస్సైతో నేరుగా అదనపు ఎస్పీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం అర్బన్: బాలల సంక్షేమం, రక్షణ విషయంలో గ్రామ, వార్డు సంక్షేమ, రక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తల్లిపాలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం బాలల హక్కుల మిషన్ వాత్సల్య సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. తరచూ శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. బాల కార్మికుల భిక్షాటన, బాల్య వివాహాల నిర్మూలన, దివ్యాంగ పిల్లలకు చేయూత, బాలల హక్కుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి కె.వి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ
శ్రీకాకుళం అర్బన్: కూటమి నాయకులు జిల్లాలో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌తో సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని రాష్ట్ర సివిల్ రైట్స్ ఫోరం కార్యాలయంలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలన, సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. నదులను యంత్రాలతో తవ్వుకుంటూ పోతే రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడడం ఖాయమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు తక్షణమే అమలు చేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సివిల్ రైట్స్ కార్యదర్శి కె.కోటయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
బీసీలంటే చంద్రబాబుకు చులకన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని అందరినీ అక్కున చేర్చుకున్నారని.. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు మాత్రం ఎప్పుడూ బీసీలను, ఎస్సీలను చులకనగా చూడటం అలవాటైపోయిందని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ నాయకుడు, వైఎస్సార్ సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మనిషి గా పుట్టాలనుకునేవాడెవ్వడైనా ఎస్సీ కులంలో పుడతారా, నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, బీసీలు ఎంత చెప్పినా వినరు వంటి వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ పేరుతో మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు లెక్కలు చూపించి పథకాలు ఎగ్గొట్టే ప్రభుత్వం కూట మి సర్కారని దుయ్యబట్టారు. విజన్, పీ–4 పేర్లతో అరచేతిలో వైకుంఠం చూపించి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా బీసీలను చులకనగా చూడకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని కోరారు. హెడ్ కానిస్టేబుల్‌కు సత్కారం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ పొందడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి దుశ్శాలువ, జ్ఞాపికలతో మంగళవారం సత్కరించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేవీ లెఫ్టినెంట్‌గా గొండ్యాలపుట్టుగ యువకుడు కవిటి: కేరళలోని కొచ్చి యూనిట్లో సబ్ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కవిటి మండలం గొండ్యాలపుట్టుగకు చెందిన దుద్ది వేణు తాజాగా లెఫ్టినెంట్ హోదాతో పదోన్నతి పొందారు. 2012లో నేవీలో సైలర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వేణు 2023 ఏప్రిల్ 1న సబ్ లెఫ్టినెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. తాజాగా లెఫ్టినెంట్ హోదాను కల్పిస్తూ నేవీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. పేదింటి కుర్రోడు ఈస్థాయిలో విజయాన్ని సాధించడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో 25 సంవత్సరాల సర్వీసు మిగిలిన నేపథ్యంలో మరిన్ని పదోన్నతులు పొందే అవకాశం ఉందని రిటైర్డ్ నేవీ ఉద్యోగులు చెబుతున్నారు. ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు సారవకోట : మండలంలోని అలుదు గ్రామానికి చెందిన కత్తిరి జగదీష్‌కుమార్ ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కత్తిరి జనార్దనరావు, వాణిల పెద్ద కుమారుడైన జగదీష్ గత ఏడాది ఐబీపీఎస్ ద్వారా నిర్వహించిన పలు బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యాడు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఫలితాలలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు క్లర్క్‌గా ఎంపిక కాగా మంగళవారం విధుల్లో చేరాడు. తాజాగా మంగళవారం విడుదలైన బ్యాంకు పీఓ, స్పెషల్ ఆఫీసర్ పోస్టు ఫలితాల్లో బ్యాంకు ఆఫ్ బరోడాకు పీఓ, ఐటీ సెక్షన్ స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపియ్యాడు. ఈ సందర్భంగా జగదీష్‌ను గ్రామస్తులు అభినందించారు. బుర్రకథ కళాకారుడికి డాక్టరేట్ జలుమూరు: లింగాలవలస గ్రామానికి చెందిన గంగరాపు వెంకటరమణకు పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నం, డే సిప్రింగ్ థియోలాజికల్ యూనివర్సటీ టెక్సాస్(యూఎస్ఏ) ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 20 ఏళ్లుగా బుర్రకథ రంగంలో విశేష సేవలు, నటుడిగా, పలు సాంఘిక నాటకాల రచయితగా రాష్ట్రం నలుమూలలా వేలాది ప్రదర్శనలు ఇచ్చినందుకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుర్రకథ చరిత్రలో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి తానే కావడం ఆనందంగా ఉందన్నారు. -
మున్సిపల్ కార్మికుల ధర్నా
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్.ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని, తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంన్నారు. ఆప్కాస్ రద్దుచేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనుకోవడం అన్యాయమన్నారు. ఆప్కాస్ వల్ల ఇన్నాళ్లూ దళారీల దోపిడీ, వేధింపులు లేవని, జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వాటా నిధుల్లో కోతలు లేవని చెప్పారు. ప్రైవేటు ఏజెన్సీలైతే సకాలంలో వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. విలీన పంచాయతీ కార్మికులకు జీఓ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నగర విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది సంఖ్యను పెచంఆలని కోరారు. సెలవులు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. పనిముట్లు, వాహనాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో కె.రాజు, ఎ.రాము, ఎ.గురుస్వామి, ఎ.శేఖర్, జె.మాధవి, డి.యుగంధర్, శంకర్ గణేష్, ఎ.దేవసంతోష్, బాల, ఎ.జనార్దనరావు, డ్రైవర్లు హరి, నాని, ఇంజినీరింగ్ విభాగం నాయకులు పి.మణి, త్రినాథరావు, క్లాప్ డ్రైవర్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్న డూ లేని విధంగా జిల్లా ఈ సారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కుప్పిలి కాపీయింగ్ ఉదంతం మినహా టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 149 కేంద్రాల్లో మార్చి 17న మొదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. పోలీసుల సహకారంతో 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ సైతం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆఖరి రోజు సోషల్ స్టడీస్ పేపర్‌కు 28405 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28254 మంది హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. మొత్తం మీద ప్రధాన పరీక్షల న్నీ ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా ఏప్రిల్ మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ మొదలుకానుండగా.. అందుకు డీఈఓ తిరుమల చైతన్య, ఏసి లియాకత్ ఆలీఖాన్ నేతృత్వంలో అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా చరిత్రంలో.. మాయని మచ్చగా జిల్లాలోని ఎచ్చెర్ల మండల పరిధి కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాల్లో మార్చి 21వ తేదీన ఇంగ్లిష్ పేపర్ మాస్ కాపీయింగ్ ఉదంతం మాయని మచ్చలా మిగిలిపోయింది. డీఈఓ తిరుమల చైతన్య నేతృత్వంలో స్క్వాడ్ బృందాలు తనిఖీ చే యడం, ఐదుగురు విద్యార్థులను డీబార్ చేయ డం, ఏకంగా 15 మందిని సస్పెండ్ చేయడం, ఆపై టీచర్లు డీఈఓ వైఖరిపై ఆందోళనలు చేయడం వంటివి సంచలనం సృష్టించాయి. ‘నాడు–నేడు’తో సకల సౌకర్యాలు.. టెన్త్ పరీక్షలకు కేటాయించిన 149 కేంద్రాల్లో మెజారిటీ కేంద్రాలు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కావడంతో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాశారు. బడుల్లో మనబడి నా డు–నేడు కార్యక్రమం ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సౌకర్యాలతో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాశారు. అత్యాధునిక ఫర్నీచర్, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, ఆర్వో ప్లాంట్ల ద్వారా తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండటంతో అక్కడి అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. పరీక్ష కేంద్రాల వద్ద పలు ప్రైవేటు జూనియర్ కాలే జీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, డిఫెన్స్ అకాడమీల కరపత్రాలను విద్యార్థులకు పంచేందుకు ఆ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఎగబడ్డారు. పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, వసతి కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాలో మొదటిసారి సంచలనాలకు కేంద్రం బిందువుగా టెన్త్ పబ్లిక్ పరీక్షలు జిల్లా చరిత్రలో మాయని మచ్చలా కుప్పిలి కాపీయింగ్ ఉదంతం పరీక్షలు ముగియడంతో హాస్టళ్ల నుంచి ఇంటి బాట పట్టిన విద్యార్థులు -
నేటి నుంచి ఉచిత శిక్షణలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలువురు నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు శిక్షణ కేంద్రాల్లో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● సీడాప్–డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీలో స్వీవింగ్ మిషన్ ఆపరేటర్ పోస్టుకు మూడు నెలల పాటు 60 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, కనీస విద్యార్హత పదోతరగతి ఉండాలని తెలిపారు. ● శ్రీసాయివెంకటనారాయణ సొసైటీ వైటీసీ మందస (రెంటికోట) లో సోలార్ ఎల్ఈడీ టెక్నీ షియన్, స్మార్ట్‌ఫోన్ టెక్నీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు 140 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, దీనికి ఇంటర్లో సైన్సు గ్రూప్ పాస్ అయ్యి ఉండాలని తెలిపారు. ● శ్రీలక్ష్మీదీపా మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సింగనవలన సీతంపేట రోడ్లో రెస్టారెంట్ కెప్టెన్ కోర్సులకు 3 నెలలు శిక్షణ ఉంటుందని, 140 మందిని తీసుకుంటామన్నారు. ఇందుకు గాను ఇంటర్ లేదా ఐటీఐ చదివి ఉండాలని తెలిపారు. ● శ్రీకై ట్స్ స్కిల్స్ పీవీటీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని మహిళా ప్రాంగణం వద్ద గల ఐటీఐ ప్రాంగణం పక్కన ఫుడ్ అండ్ బెవరేజ్, గెస్టు సర్వీసులలో 3 నెలలు శిక్షణ ఉంటుందని, 90 మందిని తీసుకుంటారని, దీనికి పది, ఐటీఐ కోర్సులు చదివి ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జాబ్‌కార్డు రెండు ఫొటోలు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. -
కంచే చేను మేస్తే..
● మద్యం బాటిళ్లతో దొరికిన ఎక్సైజ్ కానిస్టేబుల్రణస్థలం: మండలంలోని బంటుపల్లి వద్ద ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పని చేస్తున్న ఎకై ్స జ్ కానిస్టేబుల్ బొడ్డేపల్లి జగదీష్ అక్రమంగా మద్యం తరలిస్తూ జేఆర్ పురం పోలీసులకు పట్టుబడ్డాడు. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సోమవారం రాత్రి పది గంటల సమయంలో జే.ఆర్ పురం పంచాయతీ పరిధిలో గల జాతీయ రహదారిపై ఒక పెట్రోల్ బంకు సమీపంలో ఎస్ఐ చిరంజీవితో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టగా జగదీష్ రెండు సంచుల్లో 52 కింగ్‌ఫిషర్ బీరు బాటిళ్లతో దొరికాడు. వీటి విలువ మార్కెట్లో రూ. 10,400లు ఉంటుంది. తన స్వగ్రామం పొందూరు మండలంలోని కనిమెట్ట వెళ్తుండగా ఆయన దొరికాడు. ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యూబీ పరిశ్రమలో లోడింగ్, ఇతర బ్యాచ్ నంబర్లు, బీరు సంబంధిత బ్రాండ్ ఇలా అన్నీ పత్రాలు సరిగా ఉన్నాయో లేవో చూసి ఉన్నతాధికారితో సంతకం పెట్టించి లోడింగ్ వెహి కల్ విడిచిపెట్టాలి. ఈ తనిఖీలన్నీ నామమాత్రంగా చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని పరిశ్రమ కార్మిక వర్గం ఆరోపిస్తోంది. -
మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
అసలే అమావాస్య రోజులు. సంద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే వేకువ సమయం. చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ లేని వేళలో వారు వేటకు పూనుకున్నారు. కానీ రాకాసి అలలు విరుచుకుపడడంతో తెప్పతో సహా నలుగురు చెల్లాచెదురైపోయారు. ఇద్దరు బతుకుజీవుడా అంటూ తీరానికి చేరుకున్నారు. మరో ఇద్దరు మాత్రం తిరిగి రాలేకపోయారు. మత్స్యకారులు, మైరెన్ పోలీసులు కలిపి వెతికినా ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. వజ్రపుకొత్తూరు: మండలంలోని నువ్వలరేవు కొత్త జెట్టీ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున సముద్రంలో ఫైబర్ తెప్ప బోల్తా పడిన సంఘటనలో మంచినీళ్లపేట గ్రామానికి చెందిన వంక కృష్ణ(44), బుంగ ధనరాజు( 45) గల్లంతయ్యారు. అదే తెప్పలో ఉన్న మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బుంగ కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వరరావు అతి కష్టం మీద ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో మంచినీళ్లపేటలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనలో ఫైబర్ తెప్ప, ఇంజిన్, వలలు పాడై దాదాపు రూ.2.50 లక్షలు మేర నష్టం వాటిల్లింది. స్థానిక మత్స్యకారులు, మైరెన్, స్థానిక పోలీసులు తీరంలో తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ గల్లంతైనవారి ఆచూకీ లభ్యం కాలేదు. స్థానిక మత్స్యకారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచినీళ్లపేటకు చెందిన వంక కృష్ణ, బుంగ ధనరాజు, కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వరరావు కలిసి మంగళవారం తెల్లవారుజామున నువ్వలరేవు జెట్టీ సమీపం నుంచి వేటకు బయల్దేరారు. ఫైబర్ తెప్పను సంద్రంలోకి తీసుకెళ్లే క్రమంలో ఎత్తైన రాకాసి అలలు ఒక్కసారిగా తెప్పపై విరుచుకుపడడంతో నలుగురూ చెల్లాచెదురైపోయారు. ఇందులో కెరటాలకు ఎదురొడ్డి నిలిచిన బుంగ కోటేశ్వరరావు, చింత వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన వంక కృష్ణ, బుంగ ధనరాజుల ఆచూకీ మాత్రం దొరకలేదు. వంక కృష్ణకు భార్య ఎల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు 13 ఏళ్ల సుమంత్, 8 ఏళ్ల సాయి ఉండగా.. బుంగ ధనరాజుకు భార్య కృష్ణవేణి ఎనిమిదేళ్ల ప్రణీత, నాలుగు నెలల పసికందు సోనియా ఉన్నా రు. వారి రోదనలు స్థానికులకు కంటతడి పెట్టించాయి. వైస్ ఎంపీపీ వంక రాజు, మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, జి.శంభూరావు, గ్రామ పెద్దలు ఇచ్చి సమాచారం మేరకు విషయం తెలుసుకున్న మత్స్యశాఖ ఎఫ్డీఓ ధర్మరాజు పాత్రో, మైరెన్ సీఐ డి.రాము, స్థానిక సీఐ, ఎస్ఐలు తిరుపతి, బి.నిహా ర్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించా రు. వివరాలు సేకరించి స్థానిక మత్స్యకారులతో కలిసి గల్లంతైన మత్స్యకారుల కోసం అటు గంగవరం నుంచి ఇటు ఒడిశా తీరం గోపాల్పూర్ వర కు తీరం వెంబడి విస్తృతంగా గాలించారు. ప్రత్యేక చాపర్ ద్వారా కూడా గాలించారు. బుధవారం నాటికి సమాచారం పూర్తిగా తెలుస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. వంక కృష్ణ భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నువ్వలరేవు జెట్టీ వద్ద ఫైబర్ తెప్ప బోల్తా క్షేమంగా ఒడ్డుకు చేరిన మరో ఇద్దరు జాలర్లు తీరం వెంబడి విస్తృతంగా గాలింపు -
ఉపాధిలో మూడో స్థానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఎన్ఐసీ పోర్టల్ గణాంకాలు ప్రకారం సిమ్మెంట్, మెటల్ రోడ్ల నిర్మాణం, సిమ్మెంట్ కాలువల నిర్మాణం, పాఠశాలల ప్రహరీల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్టు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరం 2025– 26లలో ‘పంచ ప్రాధాన్యాలు‘ అనే భావనతో పశువులకు నీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటలు, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువులు / కుంటలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, దినసరి వేతనం రూ.307కు పెంచడం చేస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళిక ప్రక్రియలో రూ.1499.03 కోట్ల అంచనా విలువతో 41523 పనులను గుర్తించామన్నారు. జిల్లా ఆస్పత్రి సందర్శన టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్రస్థాయి కాయకల్ప టీమ్ సందర్శించింది. ఇందులో భాగంగా ఆస్పత్రిలోని పలు వార్డులు, ల్యాబ్‌లు పరిశీలించారు. అలానే ఆస్పత్రి పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రత వంటిని పరిశీలించారు. అనంతరం వార్డుల్లో రోగులకు ఉండే పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి చుట్టుపక్కల వాతవరణం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాయకల్ప టీమ్ సభ్యులు డాక్టర్ సౌజన్య, పి.కమలాకర్‌లతో పాటు ఆస్పత్రి సూపరిండెంటెంట్ బి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. నీటి తొట్టెలు నిర్మించాలి: కలెక్టర్ నరసన్నపేట: వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో పశువులకు ఇతర జంతువులకు మంచి నీరు అందించాలని, ఈ మేరకు నీటి తొట్టెలు నిర్మించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని తామరాపల్లిలో నీటి తొట్టెల పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఒక్కో నీటి తొట్టెకు రూ. 30 వేలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా నరసన్నపేట మండలంలో 16 నీటి తొట్టెలు మంజూరు చేశారని, ఈ పనులు చురుగ్గా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే తామరాపల్లి గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ బి.మధుసూదనరావు, ఏపీఓ యుగంధర్లతో పాటు గ్రామస్తులు ముచ్చ గనేష్, గొద్దు జగన్మోనరావు తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఈ లైబ్రరీలో అగ్నిప్రమాదం శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని ఈ లైబ్రరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రంథాలయంలోని ఏసీలో షాట్ సర్క్యూట్ జరగడంతో పొగలు వచ్చా యి. దీంతో కళాశాల ఆవరణలో ఉన్న అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అప్పటికే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందడంతో వారు వచ్చి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ ప్రమాదంలో గ్రంథాలయంలో ఉన్న పలు కంప్యూటర్లు పనికి రాకుండా పోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆ సమయంలో గ్రంథాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. -
కుప్పిలి మోడల్ స్కూల్లో విచారణ
ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్లో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారు ల బృందం విచారణ నిర్వహించింది. రాష్ట్ర మానిటరింగ్ అధికారి కె.ధర్మకుమార్ ఆధ్వర్యంలోని బృందం ఈ విచారణ నిర్వహించింది. కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్షలో కాపీయింగ్ ఆరోపణలపై ఐదుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. కుప్పిలి మోడల్ స్కూల్ సెల్ఫ్ సెంటర్ కావటం, చూసిరాతలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువ కావడం వంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ విచారణ నిర్వహించారు. గత మూడేళ్లలో స్కూల్ టాప ర్లు, ట్రిపుల్ ఐటీకి ఎంపికై న విద్యార్థులు అకడమిక్ ప్రగతి నివేదిక వంటివి పరిశీలించారు. అంతర్గత పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు, ఇతర ప్రతిభ వంటివి పరిశీలించారు. చూసి రాత వల్ల ట్రిపుల్ ఐటీకి విద్యార్థులు ఎంపికవుతున్నారా? విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా ఎంపికవుతున్నారా? అన్న కోణంలో ఈ విచారణ నిర్వహించారు. టాపర్ విద్యార్థుల 8, 9, 10వ తరగతుల్లో వచ్చిన ప్రోగ్రెస్ కార్డులు సైతం పరిశీలించారు. ప్రిన్సిపాల్ కె.అప్పాజీరావు వారికి పాఠశాలో విద్యా ప్రమాణాలు వివరించారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సంపాదించిన విద్యార్థులు మెరిట్ విద్యార్థులని, మాస్ కాపీయింగ్ వల్ల సీట్లు వచ్చాయన్నది అవాస్తవమని చెప్పారు. అన్ని మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు ట్రిపుట్ ఐటీ సీట్లు వస్తున్నాయని తెలిపారు. -
రెవెన్యూ ఉద్యోగి బరితెగింపు
పొందూరు: మండలంలోని మజ్జిలిపేట గ్రామానికి చెందిన జి.జనకచక్రవర్తి సీనియర్ అసిస్టెంట్‌గా పొందూరులో పని చేస్తున్నారు. మజ్జిలిపేటలో రెండు రోజుల కిందట నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొనడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. కానీ ఆయన ఎలాంటి భయం లేకుండా టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందడిగా శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో అతి పెద్ద మత్య్సకార గ్రామమైన నువ్వలరేవులో సందడిగా శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఠక్కురాణి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దాసుడు మువ్వల డోమ్మ, ఘంటోమోనరి మువ్వల పురుషోత్తంలు ప్రత్యేక అలంకరణతో, సాంస్కృతిక కార్యక్రమాలతో జన సంద్రం నడుమ ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు పూజలు చేసి ముర్రాటలు, కానుకలు సమర్పించారు. కాగా సుమారు 10 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఉత్సవ వేడుకలలో మొదటి తంతును భక్తిశ్రద్ధలతో జరిపారు. దీంతో గ్రామ ప్రధాన వీధి జనంతో కిక్కిరిసింది. అలాగే యువతీ యువకులు నృత్యాలతో సందడి చేశారు. ఉచిత నాట్య శిక్షణ ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని బ్యాంకర్స్ కాలనీ సత్యసాయి బృందావనంలో ఉగాది సందర్భంగా ఉచిత నాట్య శిక్షణ ప్రారంభమైంది. సంప్రదాయం కూచిపూడి గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంజలి, యామిని, లోకేశ్వరి, సాయి మందిరం భక్తులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న రంజాన్ కవి సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ సందర్భంగా స్థానిక కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర ముస్లిం రచయితల వేదిక వ్యవస్థాపకులు కరీముల్లా ఆదేశాల మేరకు సోమవారం జరిగిన కవి సమ్మే ళనం ఆకట్టుకుంది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహ్మద్ రఫీ అధ్యక్షతన ‘హిందూ ముస్లిం భాయిభాయి’ పై జరిగిన ఈ కవి సమ్మేళనంలో పలువురు కవులు రంజాన్ విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేస్తూ చక్కనైన కవితలను చదివారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ మత సామరస్యానికి ప్రతీక ఈ కవి సమ్మేళనం అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సురంగి మోహనరావు చేతుల మీదుగా ఈవేమన కవితా నిలయం తరఫున విశేష వైద్య సేవలు అందిస్తున్న పి.బి.డేవిడ్‌ను ఆరోగ్యమిత్ర బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో కవులు గుడిమెట్ల గోపాలకృష్ణ, వాడా డ శ్రీనివాస్, పసుపురెడ్డి శ్రీను, బోగెల ఉమామహేశ్వరరావు, గుణస్వామి, తంగి ఎర్రమ్మ, బి.సంతోష్ కుమార్, విజయలక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. టైమ్ స్కేల్ అమలు చేయాలి ఎచ్చెర్ల క్యాంపస్: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లకు ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని యూనిటీ వెల్ఫేర్ టీం జిల్లా ఉపాధ్యక్షుడు చిగిలిపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిలకపాలెంలో సోమవారం సమగ్ర శిక్ష ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కనీసం వేతనం అందజేయటం లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. కనీ సం మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తే ఉద్యో గులకు న్యాయం జరగుతుందని చెప్పారు. పార్ట్ టైమ్ పేరుతో ఉద్యోగులను ఫుల్ టైమ్ వినియోగించుకుంటున్నారని, పార్ట్ టైమ్ పదం తొలగించాలని అన్నారు. ఒకేషనల్ టీచర్లుగా పరిగణించాలని విజ్ఙప్తి చేశారు. ఉద్యోగ భద్రత, కుటుంబ నిర్వహణకు తగ్గ వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ ప్రతినిధులు వై.సత్యనారాయణ, ఎల్.దిలీప్‌కుమార్, తారకేశ్వరరావు పాల్గొన్నారు. కొనసాగుతున్న దర్యాప్తు జలుమూరు: యలమంచిలి ఎండల మల్లికార్జున దేవాలయంతోపాటు అక్కురాడ, కొండపోలవలస ఆంజనేయ ఆలయాల గోడలపై అన్య మత సూక్తులు రాసిన వారిని పట్టుకునేందుకు ఆరు బృందాలతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. సోమవారం యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస ఆయా దేవాలయాలను మరోసారి పరిశీలించి అర్చకులు, గ్రామస్తులతో మాట్లాడారు. అదే సమయంలో ఎక్కువ మందికి వచ్చిన ఫోన్ కాల్స్ సీడీఆర్‌ను పరిశీలిస్తున్నారు. అనంతరం జలుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ బృందాల అధికారులతో మాట్లాడారు. దుండగులను త్వరలో పట్టుకుంటామన్నారు. -
ఆత్మీయ ఆలింగనాలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులతో రంజాన్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీదుల వద్ద ఈదుల్ ఫితర్ నమాజులు జరిగాయి. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, ప్రవక్త మాటలు ఆచరణీయం కావాలని మత పెద్దలు ఆకాంక్షించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్,
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడి డైరెక్షన్లో మైనింగ్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు చెందిన క్రషర్లు, క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా కనీసం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో కొంత మందిపై అడ్డగోలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ–పర్మిట్ వెబ్సైట్ ఆగిపోతే క్రషర్లు, గ్రానైట్ బ్లాకుల రవాణా ఎలా జరుగుతున్నాయి. మైనింగ్ అధికారుల అడ్డగోలు వ్యవహారంపై అన్ని రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆయా ఆధారాలతో కోర్టులను ఆశ్రయించి అధికారులు చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించుకునే విధంగా చేస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి -
ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
శ్రీకాకుళం క్రైమ్ : ఇటీవల జలుమూరు మండలం యలమంచిలి ఎండల కామేశ్వరస్వామి ఆలయ గోడలపై అన్యమత రాతలు వంటి ఘటనలతో పాటు ఆలయాల్లో చోరీలు జరగకుండా నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆలయాల కమిటీ సభ్యులతో ఎస్ఐ ఎం.హరికృష్ణ సమావేశం నిర్వహించారు. ఆలయాలకు నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఆలయానికి కమిటీలుండాలని, అందులో యువకులుంటే ఇద్దరు రాత్రిపూట ఆలయం వద్దే నిద్రపోయేలా చూడాలని, లేదంటే సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలని ఎస్ఐ సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఎచ్చెర్ల: లావేరు మండలం రావివలస సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పిన్నింటి రాము, మరో వ్యక్తి సుభద్రాపురం నుంచి విశాఖ వైపు కారులో వెళ్తుండగా హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికీ కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
అన్ని కులాలకు న్యాయం జరగాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాల, మాదిగ, రెల్లి, వాటి ఉప కులాలు అన్నింటికి న్యాయం జరగాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు పోతల దుర్గారావు కోరారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞానభవన్‌లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ విషయంలో అన్ని కులాలకు న్యాయం జరగాలని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగ, రెల్లి, రెల్లి ఉపకులాలు అన్ని కలిసి మెలిసి ఉన్నాయని, ఎస్సీలకు మొత్తం మీద రిజర్వేషన్ పెంచాల్సి ఉండగా, విభజించి పాలించు విధంగా చేయడం సరికాదని, సమగ్రంగా రిజర్వేషన్ ప్రక్రియ జరగాలని, రిటైర్డ్ న్యాయమూర్తులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకుల సమక్షంలో కులాల వారీగా రిజర్వేషన్ శాతం ప్రకటించాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు దండాసి రాంబాబు, అంపోలు ప్రతాప్, రామప్పడు, గంజి ఎజ్రా, రాము, అప్పన్న, రమేశ్‌బాబు, బోనేల రమేష్, రమణ, రవికుమార్, రామారావు, తవిటయ్య, పాపారావు, గౌరీ, తవిటిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కురిగాం పీహెచ్సీ వార్షికోత్సవం
కొత్తూరు : ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో పాటు పలువురి సహకారంతో కురిగాం పీహెచ్సీ పరిధిలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని పూర్వ వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి పి.ప్రకాశరావు, హనుమంతు రమేష్, జంపు కృష్ణమోహన్, తిరుపతిరావు రెడ్డి, నరేష్కుమార్, సందీప్, దిలీప్, శ్రీలత చెప్పారు. కురిగాం పీహెచ్సీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి కావడంతో వైద్యాధికారి పి.ప్రసన్నకుమార్ అధ్యక్షతన వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో వార్షికోత్సవం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పారు. భౌగోళికంగా ఒడిశాకు ఆనుకుని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కురిగాం పీహెచ్సీలో వైద్యం అందించడం కష్టసాధ్యమైనప్పటికీ జాతీయ స్థాయి ప్రమాణాలకు అణుగుణంగా సేవలు అందుతున్నాయని, ఈ విషయంలో కురిగాం పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. వైస్ ఎంపీపీ తులసీ వరప్రసాదరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్యం అందివ్వడం హర్షనీయమన్నారు. వైద్యాధికారులకు ఎల్లప్పుడూ మావంతు సహకారం ఉంటుందని చెప్పారు. అనంతరం పూర్వ వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సేపాన అశోక్‌కుమార్, ఈవో బుజ్జిబాబు, సూపర్వైజర్ తిరుపతిరావు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుదాం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ద్వారా సమాజంలో అందరికీ విద్య అందుతుందని, నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యారంగ సంస్కరణలు సక్రమంగా లేవన్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాల పేరుతో మిగిలిన ప్రాథమిక పాఠశాలలో ఉన్న ముడు, నాలుగు, ఐదు తరగతి విద్యార్థులను మ్యాపింగ్ చేయడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియంగా ప్లస్–2 పాఠశాలలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించకపోతే తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి సామాజిక ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కోశాధికారి ఆర్.మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.లక్ష్మీ, ఉత్తరాంధ్రల జిల్లా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.విజయగౌరి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల విజేత సింగుపురం
పలాస: మండలంలోని చిన్నగురుదాసుపురంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం సమీపంలోని సింగుపురం జట్టు విజేతగా నిలిచింది. చినగురుదాసుపురం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 21 జట్లు పాల్గొన్నాయి. లింబుగాం జట్టు ద్వితీయ, గొల్లమాకన్నపల్లి తృతీయ స్థానాలు సాధించాయి. శ్రీకాకుళం కె.ఆర్.స్టేడియం జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పాలిన కృష్ణారావు, కార్యదర్శి జినగ తాతారావు, సాలిన రమేష్, జినగ ధర్మారావు, కొండే తేజేశ్వరరావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం: జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌గా బి.శ్రీరామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని రాష్ట్ర ఫ్యాప్టో పరిశీలకులు(యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) ఎస్.కిషోర్ తెలిపారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫ్యాప్టో వైస్ చైర్మన్లుగా పి.హరిప్రసన్న, వి.సత్యనారాయణ, సెక్రటరీ జనరల్‌గా పి.ప్రతాప్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎస్.వి.రమణమూర్తి, ఎం.మదన్మోహన్రావు, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కె.జగన్మోహన్రావు, కార్యవర్గ సభ్యులుగా బాబూరావు, ఎస్.రమేష్‌బాబు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్.వి.అనిల్‌కుమార్, బి.రవి, ఎస్.ఎస్.ఎల్.వి.పూర్ణిమలను ఎన్నుకున్నట్లు తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ–2003 ఏపీ ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఫోరం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆలస్యం వల్లే డీఎస్సీ – 2003 నియామకాలు 2005 నవంబరులో చేపట్టారని చెప్పారు. దీంతో పాత పెన్షన్ విధానం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 మేరకు అర్హత వ్యక్తులందరికీ పాతపెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. తూర్పుగోదావరికి చెందిన రూపరాజు మాట్లాడుతూ కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జిల్లా కో–కన్వీనర్లు కె.ప్రకాష్, పి.శ్రీకర్, వి.శ్రీను, ఎ.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చూచిరాతలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం అవసరమేనని.. అయితే డీఈఓ తిరుమల చైతన్య ఎంచుకున్న మార్గం సరైనదికాదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ అన్నారు. కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రంలో అన్యాయంగా డీబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతిభవన్ వేదికగా సోమవారం ఎస్టీయూ జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పిలి కేంద్రంపై కాపీయింగ్ ఆరోపణలు ఉన్నప్పుడు పరీక్ష కేంద్రంగా ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. పరీక్ష కేంద్రం నిర్వహణకు పకడ్బందీ చర్యలు ఎందుకు చేపట్టలేదో డీఈఓ తెలియజేయాలని, హోల్డ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, కోర్టు కేసులను రద్దు చేయాలని కోరారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ డీఈఓను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 400 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రంలో విద్యార్థులను భయాందోళనలకు గురిచేసి, పిల్లల విలువైన కాలాన్ని వృథా చేసిన డీఈఓపై కచ్చితంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శి గురుగుబెల్లి రమణ, ప్రతినిధులు పి.రామకృష్ణ, ఎస్.రాధాకృష్ణ, కె.శ్రీనివాసరావు, లక్ష్మణరావు, పి.రమణ, డీవీఎన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రబీలో ధాన్యం కొనుగోలు జరిగేనా?
సారవకోట: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యం పూర్తయిందనే నెపంతో చాలాచోట్ల ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో రబీలోనైనా ధాన్యం కొనుగోలు జరిగేనా అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు. సారవకోట మండలంలోని కొత్తూరు, గోపాలపురం, అగదల, బురుజువాడ, అక్కివలస, బద్రి, లక్ష్మిపురం, సారవకోట, జగ్గయ్యపేట తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలలో వరి సాగు చేశారు. ప్రస్తుతం యంత్రాలతో నూర్పులు చేపట్టి ధాన్యం ఆరబెడుతున్నారు. కనీసం రబీలోనైనా తాము పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే చాలామంది రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై నమ్మకం లేక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ గ్రామాల నుంచి ప్రతిరోజు లారీలతో ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. -
తెలుగు తమ్ముళ్ల పిక్కాట!
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఏది తోస్తే అదే న్యాయమని భావిస్తూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ బెట్టింగ్ కారణంగా యువత బలి అవుతుండగా తాజాగా నరసన్నపేటలో నడిరోడ్డుపై పిక్కాట(లాటరీ) ఆడిస్తున్నారు. స్థానిక జట్టు కళాశీ సంఘం శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా తెలుగు తమ్ముళ్లే దగ్గరుండి లాటరీ ఆడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవమి ఉత్సవాలకు లాటరీ నిర్వాహకులు పెద్ద మొత్తంలో తెలుగు తమ్ముళ్లకు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని జనాల నుంచి రాబట్టడానికి మోసపూరితమైన లాటరీ ఆట నిర్వహిస్తున్నారు. ఆరు నెలలుగా మండలంలో ఎక్కడా లాటరీలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా తెలుగు తమ్ముళ్లు పోలీసులపై ఒత్తిడి చేసి వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది యువత వ్యసనాల బారిన పడుతున్నారని, ఇప్పుడు బహిరంగంగా లాటరీలు పెడితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జట్టు కళాశీ సంఘం భవనం పక్కనే పబ్లిక్‌గా లాటరీ నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై సీఐ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రేపటి నుంచే ఇంటర్ తరగతులు
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం.. ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠాలు బోధించడంతోపాటు అన్ని వసతులు, సౌకర్యాలతో విద్య అందుతోంది. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. – శివ్వాల తవిటినాయుడు, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి(డీఐఈవో), శ్రీకాకుళం ● ఇంటర్మీడియెట్ విద్యలో కీలక పరిణామాలు ● ఏప్రిల్ ఒకటి నుంచి సర్కారీ జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం ● 7 నుంచి అడ్మిషన్లు చేయాలని ఇప్పటికే నిర్ణయం ● ప్రైవేటు కళాశాలలకు పోటీగా అడ్మిషన్ల కోసం ఇంటర్ విద్య డైరెక్టర్ నిర్ణయాలు ● కొత్త ఏడాదిలో 235 రోజుల పాటు పనిచేయనున్న జూనియర్ కళాశాలలు శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సెకెండియర్ విద్యార్థులకు తరగతులు మొదలు కానున్నాయి. వాస్తవానికి ఏటా జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతుండగా.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచే తరగతులను నిర్వహించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ నిర్ణయించారు. అలాగే ప్రైవేటు కాలేజీలకు పోటీగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ ప్రవేశాలకు అడ్మిషన్లు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రిన్సిపాళ్లకు వెబెక్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహణ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్‌లు) నిర్వహించారు. ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న సర్కారీ పాఠశాలల్లో, గ్రామాల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. 235 రోజులు పనిదినాలు.. 2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలలు 235 రోజులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 1న కాలేజీలు మొదలుకానుండగా, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీగా ప్రకటించారు. మళ్లీ జూన్ 2వ తేదీన పూర్తిస్థాయిలో కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆఖరి పనిదినంగా 2026 మార్చి 18ను నిర్ణయించారు. -
● ఆదిత్యుని ఆదాయం 11.. వ్యయం 5
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ అనివెట్టి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో ఉగాది ఆస్థానాన్ని ఆలయ ఈఓ వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముందుగా పంచాంగ పూజ, ఆలయ కొత్త రికార్డు పుస్తకాలు, అకౌంట్స్ పుస్తకాల పూజా కార్యక్రమాలను చేయించారు. అనంతరం ఆదిత్యుని రాశిఫలాలుగా విశాఖ నక్షత్రం, తులా రాశి ఫలాలను శంకరశర్మ వివరించారు. ఈమేరకు ఆదాయం 11, వ్యయం 5 గాను ఉందని, గత ఏడాది కంటే మిన్నగా ఆలయంలో ప్రగతి కనిపించే అవకాశాలున్నాయని వివరించారు. అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల ప్రకారం ఆలయంలో విశిష్ట సేవలకు గాను ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ రాజేశ్వర కాశ్యప శర్మ, వేదపండితులు ధర్బముళ్ల శ్రీనివాసశర్మ, రంప వికాష్ శర్మలకు ఉగాది పురస్కారాలను ఆలయ ఈఓ వై.భద్రా జీ అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయం పేరిట ముద్రించిన కొత్త పంచాంగం పుస్తకాలను భక్తులకు దాతలకు అందజేశారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. -
ఊరిలోన.. చైత్ర వీణ
● జిల్లావ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు ● ఊరూరా పంచాంగ పఠనాలు విశ్వావసుకు స్వాగతం పలుకుతూ కోయిలమ్మలు కొత్త పాటలు కట్టాయి.. వేకువన కువకువలన్నీ ఆ పాటలతోనే గడిచాయి. ఊరూవాడా కోవెల వాకిటే కూర్చున్నాయి.. ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను ఆరారా విన్నాయి. అన్నదాతలంతా నాగళ్లు చేతబట్టారు.. ఏరువాక సాగారో అంటూ హుషారైన పాటందుకున్నారు. కొత్త చిగుర్లతో ప్రకృతి చైత్రవీణ మోగించింది. తెలుగు వారి కొత్త ఏడాది నాడు ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో మెరిసిపోయారు. జనమంతా వసుదైక కుటుంబంలా కలిసిమెలిసి విశ్వావసుకు స్వాగతం పలికారు. అష్ట ఫలాలతో విజయదుర్గమ్మ -
దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం
జలుమూరు: ఉగాది రోజున మండలంలోని యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. ఆదివారం వేకువజామున అర్చకులు వసనాబి వెంకటరమణ ఆలయానికి వచ్చి గోడలపై రాతలు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఆలయంతో పాటు పక్క పంచాయతీలైన అక్కురాడ, కొండపోలవలసలోని ఆంజనేయ ఆలయాల్లో కూడా ఇలాంటి రాతలే రాశారు. దీంతో మూడు గ్రామస్తులతో పాటు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, బీజేపి నాయకులు, ఆనంద ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీనివాసనంద సరస్వతి తదితరులు యలమంచిలి శివాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అంతకుముందు అక్కురాడ, కొండపోలవలసలో రాతలను చెరిపేశారు. యలమంచిలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస డీఎస్పీలు డీఎస్ఆర్ఎస్ఎన్ మూర్తి, వివేకానంద, అప్పారావు పలువురు సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాసిన వారిని రెండు రోజుల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ రాతలు రాసిన వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పా టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. దీనికి ముందు ఆయన మూడు ఆలయాలను పరిశీలించారు. అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ బి.అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస గ్రామాల్లో ఆలయాల గోడలపై రాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు యలమంచిలిలో ఉద్రిక్త పరిస్థితులు -
● అందరికీ మంచి జరగాలి: కలెక్టర్
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకాంక్షించారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ ఉగాది పచ్చడిలోని అన్ని రుచులు ఉన్నట్లే మంచి, చెడులు ఉంటాయని వాటన్నింటిని గెలుచుకొని ముందుకు సాగాలని కోరారు. ముందుగా ధర్మపురి గౌరీశంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. అర్చకులకు సత్కారాలు దేవాదాయశాఖ ఎంపిక చేసిన ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా గుడివీధిలోని ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తిని, కవిటి మండలం బెజ్జిపుట్టుగ శ్రీచక్రపెరుమాళ్లు అర్చకులు బాలక సత్యనారాయణ, కంచిలి మండలం కొల్లూరు శ్రీజగన్నాథ స్వామి ఆలయ అర్చకులు పద్మనాభ పాడిలను సత్కరించి వారికి నగదు పారితోషికాలను అందించారు. అలాగే పంచాంగకర్త గౌరీశంకరశాస్త్రిని కూడా సత్కరించారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం ఈ సందర్భంగా గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కవులు కె.వి.రాజారావు, బొంతు సూర్యనారాయణ, పొట్నూరు సుబ్రహ్మణ్యం, ఈ వేమన, ఉపకలెక్టర్ సవరమ్మ, శ్రీనివాసరావు, ఆరవెల్లి అనంతరామం, దామోదరాచారి, రమణమూర్తి, నాగేశ్వరరావు, భోగిల ఉమామహేశ్వరరావు, పూడి జనార్దనరావులు కవి సమ్మేళనంలో పాల్గొని ఉగాది కవితలను వినిపించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఉపకలెక్టర్ లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. -
వలంటీర్లను నమ్మించి మోసం చేశారు
నరసన్నపేట: ఎన్నికల ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి మరింతగా గౌరవ వేతనం పెంచుతామని కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారని అధికారం చేతికొచ్చాక వలంటీర్లను తొలగించి వారికి తీరని అన్యాయం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉగాది సందర్భంగా కార్యకర్తలు, నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూప ర్ సిక్స్ అమలు చేయకపోగా వలంటీర్లనూ నట్టేట ముంచారన్నారు. రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఇలా హామీలు బుట్ట దాఖలు చేయడంలో ప్రపంచ రికార్డు సాధిస్తారన్నారు. ఉగాది రోజున గత ఐదేళ్లూ బంగారం షాపులు కళకళలాడాయని ఇప్పుడు వెలవెలబోయాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకూ మేలు జరిగిందని, ఇప్పుడు కేవలం కూటమి నాయకులకే మేలు జరుగుతుందన్నారు. ధర్మాన కృష్ణదాస్‌ను ఎంపీపీ ఆరంగి మురళి, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కేసీహెచ్‌బీ గుప్త, రాజాపు అప్ప న్న, సురంగి నర్శింగరావు, కనపల శేఖర్, బొబ్బాది ఈశ్వరరావు, బుద్దల రాజశేఖర్ తదితర నాయకులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వణికించిన ఇసుక లారీ ఆమదాలవలస రూరల్: రైల్వే సిబ్బందికి ఓ ఇసుక లారీ భయం పుట్టించింది. ఆమదాలవలస మండలం ముద్దాడపేట ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ ఆదివారం దూసి రైల్వేగేటు వద్ద రెండు ట్రాక్‌ల నడుమ మొరాయించటంతో గేట్మెన్లు గేటు వేయలేక, తీయలేక నానా ఇబ్బందులు పడ్డారు. బండి సరిగ్గా రైల్వే ట్రాక్‌లు దాటాక గేటు ముందు ఆగిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలగలేదు. కానీ చాలాసేపటి వరకు లారీని తీయడం కుదరకపోవడంతో రైల్వే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఆ దారిలో వెళ్లిన వాహనాలకు కూడా ఇక్కట్లు తప్పలేదు. నిబంధనలకు మించి ఇసుక లోడింగ్ చేయటం వల్ల లారీ మొరాయించిందని పలువురు అంటున్నారు. విషయం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసులు అక్కడకు చేరుకొని వేరే వాహనాలతో లారీని రైల్వేట్రాక్ నుంచి బయటకు తరలించారు. హోరా హోరీగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు పలాస: పలాస మండలం చినగురుదాసుపురం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు హోరాహరీగా జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా ఆదివారం నాడు చినగురుదాసుపురం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆహ్వానిత పోటీలు జరిగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 21జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఇప్పటికే జి.ఎం.పల్లి, సింగుపురం, శ్రీకాకుళం కె.ఆర్ స్టేడియం జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.శ్రీనివాసరావు, ఎన్.రమేష్, ఎ.ఢిల్లీరావు, ఎన్.రమేష్‌లు రిపరీలుగా వ్యవహరిస్తున్నారు. నేడు రంజాన్ ప్రార్థనలు శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ సందర్భంగా ఇమామ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30కు ప్రార్థనలు జరుగుతాయని అందరు ముస్లింలు పాల్గొనాలని జామియా మసీదు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మహిబుల్లాఖాన్, అక్బర్ భాషాలు తెలిపారు. అందరూ మసీదుకు 9గంటలకు హాజరుకావాలని కోరారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
పారదర్శకంగా విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం కల్చరల్: డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు నగరంలోని బాలికల హైస్కూల్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుంచి కొన్నావీధిలో ఉన్న కీస్టోన్ చర్చి వరకు శాంతియుత ర్యాలీ ఆదివారం చేపట్టారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రగడాలది ప్రమాదం కాదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డీఎస్‌వీఎస్ కుమార్, ఎస్ఎంయూపీఎఫ్ ప్రెసిడెంట్ రెవ.జాన్ జీవన్, సెక్రటరీ సీహెచ్ ప్రేమన్న, బిషప్ సామ్యూల్ మొజెస్, రెవ.పి.ఎస్.స్వామి, బిషప్ బి.బర్నబస్ తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరి రైతు కుదేలు..!
● వర్షాభావం, తెగుళ్ల తాకిడితో ఇబ్బందులు ● పడిపోయిన దిగుబడులు ● వలసబాట పడుతున్న రైతులు, కూలీలు అవగాహన అవసరం ఉద్దానం ప్రాంతంలో కొబ్బరికి ఆశించిన తెగుళ్ల ను నివారించడానికి రైతు లంతా ఉద్యానశాఖ సల హాలు తీసుకొని మూకుమ్మడిగా నివారణ చర్యలు చేపట్టాలి. పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో బదనకలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వీటిని మూకుమ్మడిగా వినియోగించి నివారణ చర్యలు చేపట్టాలి. రసాయన ఎరువుల జోలికి వెళ్లకూడదు. వేపనూనె పిచికారీ చేయడం వంటి చర్యలతో కొంతమేర ఉపశమనం కలుగుతుంది. – పి.మాధవీలత, ఉద్యానశాఖ అధికారి, కవిటి -
అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి
రణస్థలం: మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యూనైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి(47) అనుమానాస్పదంగా మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు, పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం జనరల్ డ్యూటీకి వెళ్లిన మృతుడు అప్పలసూరి సాయంత్రం 4.30 గంటల సమయంలో పరిశ్రమలోని వాష్ రూమ్‌లో ప్లాస్టిక్ పైపునకు ప్యాకింగ్ రోప్‌తో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. కొంత సమయం తర్వాత గుర్తించిన తోటి ఉద్యోగులు జేఆర్‌పురం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయన పరిశ్రమలోని కేస్ ఫ్యాకర్ మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బంటుపల్లి పంచాయతీ ప్రజలకు ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఉరివేసుకుని చనిపోయి ఉండడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు స్వగ్రామం నరసన్నపేట దగ్గర లుకలాం కాగా, గత 30 ఏళ్లుగా ఉద్యోగరీత్యా జేఆర్‌పురం పంచాయతీలోని జీఎంఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా, కంపెనీ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
ఉగాది పురస్కారాలు ..
శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది పురస్కారోత్సవాల్లో భాగంగా 2025 సంవత్సరానికి గాను, శ్రీకూర్మం గ్రామానికి చెందిన శ్రీభాష్యం సుందరరామ కౌండిన్య సీఎం నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డు ఆదివారం అందుకున్నారు. కూచిపూడి నాట్యంలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గత 25 ఏళ్లుగా కౌండిన్య రఘుపాత్రుని శ్రీకాంత్ వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందుతున్నారు. డా.బీఎస్వీ ప్రసాద్‌కు పురస్కారం కవిటి: రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది ప్రకటించిన ఉగాది పురస్కారాలకు గానూ కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన డాక్టర్ బొంతలకోటి సత్యవరప్రసాద్‌కు కళా విభాగంలో అవార్డు వరించింది. ఆదివారం విజయవాడలో జరిగిన వేడుకల్లో సీఎం చేతులమీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం సత్యవరప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
మిలటరీ క్యాంటీన్లో సెల్ఫ్ సర్వీసు
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక మిలటరీ క్యాంటీన్లో లిక్కర్ సెల్ఫ్ సర్వీసును జిల్లా ఎక్స్ సర్వీసు మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. మాజీ సైనికులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు సూచించారు. క్యాంటిన్ మేనేజర్ సుబేదార్ మేజర్ పి.గోవిందరావు అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హానరరీ ప్రెసిడెంట్ బి.సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు, కోశాధికారి ఎం.సింహాచలం, స్పోక్స్ పర్సన్ కె.కన్నారావు, చింతు రామారావు, ఏవీ జగన్మోహనరావు, వీరనాటి పి.భారతమ్మ, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బాతుపురం–చినవంక ఆర్అండ్బీ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఒక భారీ మర్రిచెట్టు కొమ్మ రోడ్డుపై విరిగిపడింది. అయితే ఆ సమయంలో వాహన రాకపోకలు, ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చెట్టుకొమ్మ రోడ్డుకి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులంతా కలిసి చెట్టుకొమ్మను తొలగించారు. -
సాహిత్యానికి సేవ..!
ఆచార్య దేవ.. పొందూరు: ఆయన ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు. కానీ తెలుగు భాషంటే ఆరోప్రాణం. ఎంఏ(తెలుగు), ఎంఏ(హిస్టరీ), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎంఏ(ఇంగ్లిష్) పూర్తిచేసి, తెలుగు సాహిత్య రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 400 కవితలు, 92 వ్యాసాలు, 53 కథలు రచించారు. అలాగే యువతను చైతన్యం చేయడంతో పాటు ఉద్యోగాలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ద్వారా జిల్లాలో సుమారు 42 గ్రామాల్లో గ్రంథాలయాలను ప్రారంభించారు. అతనే పొందూరు మండలంలోని వావిలపల్లిపేటకు చెందిన వావిలపల్లి రాజారావు. ప్రస్తుతం జి.సిగడాం మండలంలోని ఆనందపురం అగ్రహారం ఎంపీయూపీ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన సేవలకు మెచ్చిన రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది పురస్కారం అందజేసింది. ఎనలేని కృషి వావిలపల్లి రాజారావు ఎందరో మహానుభావులు (వ్యాస సంపుటి), మహోన్నత శిఖరాలు (శతాధిక కవితా మాలిక), నా దేశం (శతాదిక కవితా మాలిక), వికసిత విశ్వంబర (శతాదిక కవితా మాలిక) తదితర పుస్తకాలు రాశారు. అలాగే బాలభారతం, తెలుగు వెలుగు, తెలుగు విద్యార్థి, సాహితీ కిరణం, భక్తి సమాచారం, విశాఖ సంస్కృతి మొదలైన మాస పత్రికల్లో ఆయన రాసిన అనేక కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. భగవద్గీతలో అర్జున విషాదయోగాన్ని తెలుగులో విశ్లేషణాత్మకంగా రాశారు. శ్రీకాకుళం జిల్లా శాఖ శ్రీశ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవితకాల సభ్యుడిగా, ఉత్తరాంధ్ర రచయితల వేదిక క్రియాశీల సభ్యుడిగా, జిల్లా తెలుగు రచయితల వేదిక క్రియాశీల సభ్యుడిగా, ఏపీ గ్రంథాలయ సంఘం శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాహితీ రంగానికి ఎనలేని సేవలందిస్తున్నారు. యువతను చైతన్యం చేసేలా... ప్రజలను, యువతను చైతన్యం చేసేందుకు, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు స్థాపించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచాన్ని యువత తట్టుకుని నిలబడేందుకు, ఉన్నతంగా స్థిరపడేందుకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయన్న విశ్వాసంతో ముందుకు నడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ద్వారా జిల్లాలోని పొందూరు, రణస్థలం తదితర మండలాల్లో సుమారు 42 గ్రంథాలయాలు స్థాపించారు. గ్రంథాలయాలను యువత వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకున్న పురస్కారాలు విద్యా రంగానికి రాజారావు చేసిన సేవలకు గానూ 2017లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2018లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. చేయూత సామాజిక సేవా సంస్థ 2024లో ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డును అందించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్‌ుడ్స గోల్డ్ మెడల్ పురస్కారం 2024లో అందుకున్నారు. అనంతపురంలో జాతీయ తెలుగు రక్షణ వేదిక నిర్వహించిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనంలో పురస్కారం అందుకున్నారు. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ, 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్నారు. 5వ, 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పురస్కారాలు, ప్రశంసాపత్రాలు పొందారు. అవనిగడ్డలో నిర్వహించిన సహస్ర కవి సమ్మేళనంలో తెలుగు లోగిలి పురస్కారం(2018), ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఉత్తరాంధ్ర తెలుగు రచయితల వేదిక సంయుక్త సదస్సు(విశాఖపట్నం–2018)లో పురస్కారాన్ని, 2022లో తెలుగు భాషా పరిరక్షణ సమితి(2022) పురస్కారం అందుకున్నారు. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉగాది పురస్కారాన్ని ఆదివారం అందుకున్నారు. తెలుగు వెలుగులకు కృషి చేస్తున్న రాజారావు ఈ ఏడాది ఉగాది పురస్కారానికి ఎంపిక అనేక రచనలతో తెలుగు భాషాభివృద్ధికి కృషి -
పచ్చ తమ్ముడి బరితెగింపు
● అధికారుల మాట బేఖాతర్ ● రచ్చబండను నేలమట్టం చేసిన వైనంఇచ్ఛాపురం రూరల్: అధికారంలో ఉన్నామన్న అహంకారంతో టీడీపీ నాయకుడు బరితెగించాడు. తన స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి 30 ఏళ్ల నాటి రచ్చబండను నేలమట్టం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కె.శాసనాం గ్రామంలో 30 ఏళ్ల క్రితం స్థానిక గ్రామ పెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రచ్చబండను నిర్మించాడు. అందులో రావి చెట్టును నాటి త్రినాథస్వాముల వారి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు తన సొంత భూమికి రచ్చబండ అడ్డుగా ఉందంటూ, ఈనెల 19న రచ్చబండను పెకిలించేందుకు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు పోలీసు, రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు ఈనెల 21, 23 తేదీల్లో మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లి కొలతలు తీశారు. రచ్చబండ ప్రభుత్వ స్థలంలో ఉందని, రచ్చబండకు పది అడుగుల దూరంలో ఫకీరు స్థలం ఉందని తేల్చి చెప్పారు. రచ్చబండపై ఫకీరుకు ఎటువంటి అధికారం లేదని, తొలగించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ, ఇసురు ఫకీరు తన అనుచరులతో ఆదివారం రచ్చబండను కూల్చడంతో పాటు 30 ఏళ్లనాటి చెట్టును తొలగించేశాడు. దీంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అంగన్వాడీల వేతనాల్లో కోత తగదు
శ్రీకాకుళం అర్బన్: ఫేస్‌యాప్ పేరుతో అంగన్వాడీల వేతనాలలో కోత విధించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతినెలా ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అధికారులు ఒత్తిడి, వేతనాలలో కోత మానుకోవాలన్నారు. ఇప్పటికే యాప్ మొరాయిస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఎన్నో అవస్థలు పడి పని పూర్తి చేస్తుంటే మరింతగా పనిభారం పెంచడం తగదన్నారు. వేతనాల కోత, మెమోల జారీతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, వి.హేమలత, జె.కాంచన, డి.మోహిని, పి.బాలేశ్వరి, ఎల్.దుర్గ పాల్గొన్నారు. -
7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించనున్నట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్చార్జి డీన్ డాక్టర్ పి.పద్మారావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కేంద్రంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 21 వరకు పరీక్షలు జరుగుతాయని 53 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఫిబ్రవరిలో జరగాల్సిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు మే చివరి వారంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ రెండో సెమిస్టర్ ఫీజులు స్వీకరిస్తున్నామని, ఏప్రిల్ 5లోపు అదనపు రుసం లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. యువకుడు అరెస్టు సోంపేట: మండలంలోని బేసిరామచంద్రాపురంలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసినట్లు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు శుక్రవారం తెలిపారు. దివ్యాంగురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శృంగారపు ప్రసాద్ ఆచారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 30, 31న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు యథాతథం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఈ నెల 30, 31 సెలవు దినాలైనప్పటికీ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని డీఐజీ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, అమ్మకందారులు రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. ఫిషరీస్ డీడీకి పదోన్నతి అరసవల్లి: జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాలోనే వివిధ హోదాల్లో శ్రీనివాసరావు విధులు నిర్వర్తించారు. తాజా పదోన్నతుల్లో ఈయనకు క్యాడర్ పెరగడంతో పాటు బదిలీ చేశారు. పలాసలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు జిల్లా ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. సమగ్ర విచారణకు డిమాండ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: పాస్టర్ ప్రవీణ్‌కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిషప్ బర్నబాస్ బింకం, ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఒంపూరు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 24న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ మృతిచెందారని, దీనిపై పలు అనుమానాలు ఉన్నందున విచారణ జరిపి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని, క్రైస్తవుల రక్షణకు భద్రత కల్పించాలని కోరారు. జేసీని కలిసిన వారిలో సీఎస్ఎస్ నాయకులు, పాస్టర్లు ఎం.షడ్రక్‌బాబు, జి.శామ్యూల్ అరుణ్‌కుమార్, టి.పేతురు, ఇ.శామ్యూల్ జాన్, ప్రత్తిపాటి ప్రసాద్, ఎ.ఎ.పాల్, అల్లు ఇమ్మానుయేల్, ఆశిర్కుమార్, అహరోన్ తదితరులు పాల్గొన్నారు. జేసీకి వినతిపత్రం అందిస్తున్న సీసీఎస్ ప్రతినిధులు -
గంజాయితో వ్యక్తి అరెస్టు
మెళియాపుట్టి: మండలంలోని గొప్పిలి గ్రామానికి చెందిన బి.యువరాజు అనే వ్యక్తి కిలో 250 గ్రాముల గంజాయితో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి పాతపట్నం సీఐ రామారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. యువరాజు కొంతకాలంగా త్రినాథ మేళాల కోసం చిన్నమొత్తంలో గంజాయి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం గండాహతి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచాడు. గురువారం సాయంత్రం ఒడిశాలోని రంప గ్రామంలో పెద్ద మొత్తంలో గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. -
అంగన్వాడీల వేతనాల్లో కోత తగదు
శ్రీకాకుళం అర్బన్: ఫేస్‌యాప్ పేరుతో అంగన్వాడీల వేతనాలలో కోత విధించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతినెలా ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అధికారులు ఒత్తిడి, వేతనాలలో కోత మానుకోవాలన్నారు. ఇప్పటికే యాప్ మొరాయిస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఎన్నో అవస్థలు పడి పని పూర్తి చేస్తుంటే మరింతగా పనిభారం పెంచడం తగదన్నారు. వేతనాల కోత, మెమోల జారీతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, వి.హేమలత, జె.కాంచన, డి.మోహిని, పి.బాలేశ్వరి, ఎల్.దుర్గ పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జి, సహాయ కార్యదర్శి నాగభూషణం డిమాండ్ చేశారు. శ్రీకాకుళం క్రాంతిభవన్‌లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఆ వర్సిటీయే నిర్వహించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యవిద్యను పేదలకు దూరం చేసేలా జీవో 107, 108లను రద్దు చేయాలని కోరారు. సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్ మాట్లాడుతూ వర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి జి.హరిప్రసాద్, నాయకులు కూర్మా, ఈశ్వరరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
యూడీఐడీ.. సేవలు రెడీ
నరసన్నపేట: దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, ఇతర ప్రయోజనాలు, సదరం శిబిరాల సమాచారం తదితర సేవలను సులభంగా పొందేందుకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ) అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ దివ్యాంగులకు వరంలా మారనుంది. ఈ పోర్టల్ ద్వారా పొందిన ఐడీ నంబర్ ఆధారంగా దివ్యాంగులు రైల్వేపాస్‌లను కూడా పొందవచ్చు. గతంలో సదరం సర్టిఫికెట్లు పొందాలంటే స్లాట్ బుకింగ్ కోసం మీ–సేవ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై యూడీఐడీ నంబర్ ద్వారా దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే శ్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.యూడీఐడీ పొందాలంటే..హెచ్‌టీటీపీ://ఎస్డబ్ల్యూఏవీఎల్ఏఎంబీఏఎన్సీఏఆర్డీ.జీఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా దివ్యాంగులు నేరుగా ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ–సేవా కేంద్రాల నుంచే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.సులభతరంగా సేవలు..●కొత్తగా అందుబాటులోని తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ ద్వారా సేవలు సులభతరం కానున్నా యి. సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యపరీక్షలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో వస్తుంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.●ఇప్పటి వరకూ ఐదు రకాల సేవల వైకల్యం ఉన్న వారికే ఈ–సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖా స్తు చేసుకొనే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల సేవల వైకల్యాలను చేర్చారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.●శిబిరంలో వైకల్య నిర్థారణ పూర్తయ్యాక స్మార్ట్‌కార్డును పోస్టల్ శాఖ ద్వారా ఇంటికే పంపిస్తారు. ఈ కార్డు పింఛన్‌తో పాటు రైల్వేపాస్‌లు, ఇతర సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది.●యూడీఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి.దరఖాస్తు ఇలా..ఆన్లైన్లో స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్లయ్ బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అంగీకరిస్తూ సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అడిగిన సమాచారం నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వైద్య పరీక్షలు అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు.దివ్యాంగులకు వరం..దివ్యాంగులకు ఆధార్ కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీని ప్రవేశపెట్టింది. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని ఐడీ నంబర్ పొందవచ్చు. ప్రత్యేక కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది.– కె.కవిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ, శ్రీకాకుళం -
చంద్రబాబువన్నీ బూటకపు హామీలే
● వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం: ఎన్నికల్లో చంద్రబాబు బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా రెడ్డి శాంతిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలన ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా ఉండేదన్నారు. చంద్రబాబు మాత్రం హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళ లు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పాతపట్నం, ఎల్.ఎన్.పేట ఎంపీపీలు దొర సావిత్రమ్మ, రెడ్డి జ్యోతి లక్ష్మి, బైపోతు ఉదయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్, పోలా కి జయమునిరావు, మీసాల వెంకటరామకృష్ణ, గండివలస ఆనంద్, పెనుమజ్జి విష్ణుమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, అంధవరపు సురేష్, కొల్ల కృష్ణ, ఆర్టీఐ వింగ్ ఎనుగుతల సూర్యం, ఎం.తాతయ్య, శిమ్మ శాంబ, లోలుగు లక్ష్మణ, యెరుకొల వెంకటరమణ, బి.నారాయణమూర్తి, మాదవ పుల్లయ్య, ఎం.గణపతిరావు, సవర సుబాష్, అలికాన మాదవరావు, గంగధర్, సరస్వతి, రాజ్యలక్ష్మి, జానకమ్మ, ఎం.రామారావు, తులుగు ప్రవీణ్, నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
పోక్సో చట్టంతో చిన్నారులకు రక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల రక్షణకు పోక్సో చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫస్ట్ అడిషనల్ జడ్జి కె.ఎం.జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తలే లక్ష్మణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడతారని, బాధితులకు న్యాయ సహాయం అందించడం, వారి గుర్తింపును రహస్యంగా ఉంచడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు. తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో మరణశిక్ష సైతం విధించే అవకాశం ఉందని చెప్పారు. పిల్లలకు మంచి చెడులను వివరించడం, వారికి అవగాహన కల్పించడం సమాజం బాధ్యతని పేర్కొన్నారు. -
తరలిపోతున్న పశుగ్రాసం
గార: ఖరీఫ్‌లో పండిన వరి గడ్డి దూర ప్రాంతాలకు తరలిపోతోంది. విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వర్తకులు వచ్చి ఎండు గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్ల, లారీల ద్వారా తరలించుకుపోతున్నారు. ఈ ఏడాది ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ ధర తగ్గించడంతో పశువుల పెంపకం కూడా తగ్గుముఖం పడుతోంది. వచ్చే ఖరీఫ్‌కు ఉగాది తర్వాత భూములు సిద్ధం చేసుకోవాలని రైతాంగం సమాయత్తవుతున్న పరిస్థితుల్లో పొలాల్లో ఉన్న వరి గడ్డిని అమ్మివేస్తున్నారు. దీంతో స్థానిక పశువుల పెంపకందారుకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సర్కారు వారి పాట.. సిండికేటుదే మాట!
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో వివిధ రకాల ఆశీలు హక్కుల కోసం శుక్రవారం నిర్వహించిన ఆశీల వేలం పాట సిండికేట్‌గా మారింది. అధికార పార్టీకు చెందిన కొందరు కార్యకర్తల కన్నుసన్నల్లో వేలంపాటదారులు సిండికేట్‌గా మారడంతో వేలం నామమాత్రంగా సాగింది. పంచాయతీ ఆశీల హక్కు కోసం ఆరంభంలో సర్కారు వారి పాటను రూ.13.92 లక్షలుగా ప్రకటించారు. అంతా సిండికేట్‌గా ఏర్పడి పాటను తగ్గించాలని అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో రూ. 12.70 లక్షలకు కుదించేశారు. చివరగా అధికార పార్టీ కార్యకర్తల డైరెక్షన్లో పట్టణానికి చెందిన పుచ్చకాయల రామిరెడ్డి అనే వ్యక్తి రూ.14 లక్షలకు రోజు వారీ మార్కెట్ ఆశీల వసూళ్ల హక్కును కై వసం చేసుకున్నారు. ఇదే వ్యక్తి రూ.77 వేలకు వారపు సంత, రూ.51 వేలకు బస్ అండ్ కారు స్టాండ్‌లో ఆశీల హక్కు దక్కించుకున్నారు. కమేళా హక్కును రూ.1,60,200కు జోగి ధర్మారావు కై వసం చేసుకున్నారు. కాగా, 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆశీల హక్కును దక్కించుకున్న జీరు వెంకటరెడ్డి పంచాయతీకి సుమారు రూ.7 లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ జి.సుజాత, ఈఓపీఆర్డీ సింహాద్రి, ఇన్చార్జి ఈఓ శశిధర్ పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1కి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 31వ తేదీన జరగాల్సిన సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. సో మవారం రంజాన్ పండగ కావడం, ప్రభుత్వ సెలవు దినంగా భావిస్తుండటంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్ష వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య విజ్ఞప్తి చేశారు. ఉగాది, శ్రీరామనవమిలకు ఆప్కో వస్త్రాలపై భారీగా డిస్కౌంట్లు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలైన ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 35 నుంచి 50శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమ దాస్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి ఆన్లైన్ స్టోర్స్‌లో కూడా ఆప్కో వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆప్కోహ్యాండ్లూమ్.కామ్ వెబ్సైట్లోనూ కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించా రు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనలతో ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు వారి సంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు, అరటి చెట్లతో అలంకరణలు చేయాలని సూచించా రు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం ఏర్పాట్లను దేవదాయశాఖ నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు శాఖ శాంతిభద్రత బాధ్యతలు పరిశీలించాలని, ఉగాది పచ్చడి, పులిహోర, చక్రపొంగలి సీ్త్రశిశు సంక్షేమశాఖ, డీఎస్ఓ పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానశాఖకు వేదిక అలంకరణ బాధ్యతలను అప్పగించారు. అలాగే పలు ఏర్పాట్లను ఆయా శాఖలకు అప్పగించారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి ప్రసాదరావు, డీఎస్ఓ సూర్యప్రకాష్, దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయ క్, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ్ స్వామి, అరసవిల్లి ఈఓ భద్రాజి, సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
●ఆర్టీసీ సిబ్బందికి టీచర్ల సత్కారం
ఇచ్ఛాపురం రూరల్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి, తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఆర్టీసీ ఉద్యోగుల్ని ఉపాధ్యాయులు సత్కరించారు. మండలం కొళిగాం ఉన్నత పాఠశాలకు చెందిన 102 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మండపల్లి ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా విద్యాశాఖ కేటాయించింది. సుమారు పది కిలో మీటర్లు దూ రం కావడంతో ఆర్టీసీ బస్సును విద్యార్థులకు కేటాంచారు. ఆరు రోజుల పాటు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సర్వీసు చేసిన పలాస ఆర్టీసీ డిపో డ్రైవర్ పి.పోలారావు, కండక్టర్లు కై లాష్,శ్రీనివాస్‌లను శుక్రవారం కొళిగాం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేంద్రనాద్ పట్నాయక్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ మహంతీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
●కేజీబీవీని సందర్శించిన ఎస్పీ
కాశీబుగ్గ, మందస: మందస మండలం, గుడారి రాజమణిపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించారు. విద్యా ర్థులు అస్వస్థతకు గురి కావడంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం విద్యాల యంలోని వంటగది, తరగతి గదులు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని వసతిగృహ అధికారిని అదేశించారు. విద్యార్థులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు వాటి పరిస్థితిని పరిశీలించి విద్యాలయం ఆవరణలో అదనంగా మరి కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత, రక్షణ పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు ముఖ్యమైన అంశాలపై మందస ఎస్ఐకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్శనలో ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయడు, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, స్థానిక ఎస్ఐ కృష్ణ ప్రసాద్, విద్యాలయం అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పేదల కడుపుపై
పేదోడి బియ్యంపై కనిపించని కత్తి వేలాడుతోంది. ఈకేవైసీ చేయించుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం, లక్షన్నర మందికిపైగా ఈకేవైసీ ఇంకా పూర్తి కావాల్సి ఉండడంతో బియ్యంలో కోత తప్పదనే సంకేతాలు బలపడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారు, చదువుల కోసం ఉన్న ఊరు విడిచి వెళ్లిన విద్యార్థుల ఇప్పటికప్పుడు సొంతూళ్లకు రాలేక, ఈకేవైసీ చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఈ హడావుడి పనులన్నీ బియ్యంలో కోత పెట్టేందుకేనని సామాన్యులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ● ఈకేవైసీకి మరో రెండు రోజులే గడువు ● 1,70,598 మందికి పూర్తికాని ఈకేవైసీ ● వలసదారులు, విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ● కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు శ్రీకాకుళం పాతబస్టాండ్: పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. సంక్షేమ పథకాల పేర్లు కూడా జనం మర్చిపోయా రు. ఖాతాల్లో డబ్బు జమ కావడం అన్నది గతంలా మారిపోయింది. ఇప్పుడు పేదోడి బియ్యంపై సర్కారు కన్ను పడింది. ఈకేవైసీ పేరిట ప్రతి రేషన్ కార్డుపైనా ప్రభుత్వం కనిపించని కత్తి వేలాడదీసింది. జిల్లాలో మొత్తం ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీటిలో 19,39,082 మంది సభ్యులు న్నారు. వీరిలో ఇప్పటి వరకు 17,68,484 మందికి ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా 1,70,598 మందికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈకేవైసీ పూర్తి కాకపోతే ఆ సభ్యుడికి ఏప్రిల్‌లో రేషన్ నిలిచిపోతుందని క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగు తోంది. బియ్యంలో కోత పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తెర పైకి తెచ్చిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్నీ ఒక్కో యూనిట్‌గా పరిగణించి ఈకేవైసీ ప్రక్రియ జరుగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈకేవైసీ అవసరం లేదు. మిగిలిన వారు రేషన్ డీలర్లు, వీఆర్ఓలు, ఎండీ యూ ఆపరేటర్ల వద్ద తక్షణమే ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పేదల పొట్ట కొడతారా.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల హామీలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు కత్తెర వేస్తోందని లబ్ధిదారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య చాలా పెద్దది. వీరంతా రేషన్ కార్డుల్లో సభ్యులే. రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. మన జిల్లాలో ఎక్కువ మంది వలస కూలీలు ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఇప్పటికిప్పుడు సొంత గ్రామాలకు రావడం కాని పని. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇది పరీక్షల సమయం. ఇంజినీరింగ్, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. వీరు వచ్చే నెలలో గానీ ఇంటికి చేరలేని పరిస్థితి. దీంతో వీరి బియ్యానికి కూడా కోత పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీకి మరింత గడు వు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలంటూ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి మండలం మొత్తం ఈకేవైసీ ఇంకా యూనిట్లు అయినవి ఉన్నవి వజ్రపుకొత్తూరు 71439 63922 7517 సంతబొమ్మాళి 66247 59336 6911 రణస్థలం 83512 74877 8635 ఇచ్ఛాపురం 86492 77845 8647 కొత్తూరు 64752 58430 6322 కంచిలి 62793 56688 6105 టెక్కలి 63662 57610 6052 కోటబొమ్మాళి 65339 59401 5938 బూర్జ 36144 32861 3283 లావేరు 60735 55261 5474 పొందూరు 61664 56145 5519 శ్రీకాకుళం 167636 152698 14938 హిరమండలం 34293 31247 3046 జి సిగడాం 49628 45223 4405 గార 73764 67289 6475 మందస 74858 68309 6549 పలాస 83402 76172 7230 పాతపట్నం 58860 53882 4978 నందిగాం 52071 47717 4354 కవిటి 72177 66272 5905 సోంపేట 71646 65889 5757 పొలాకి 59327 54564 4763 ఆమదాలవలస 68794 63297 5497 ఎచ్చెర్ల 78845 72629 6216 సరుబుజ్జిలి 25872 23836 2036 జలుమూరు 53532 49462 4070 నరసన్నపేట 65507 60620 4887 ఎల్ఎన్ పేట 30192 27962 2230 మెళియాపుట్టి 49771 46098 3673 సారవకోట 46128 42942 3186 మొత్తం 19,39,082 17,68,484 1,70,598 ● గడువు పెంచే అవకాశం ఉంది.. ముందుగా ఈ నెల 31వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పాం. అయితే గడువు పెంచే అవకాశం ఉంది. జిల్లాలో వలసలు, ఇతర పరిస్థితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ గడువు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈకేవైసీ వేయకపోయినా రేషన్ సరకులు నిలిపివేయం. ఈకేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనా చెందనవసరం లేదు. – గుంట సూర్యప్రకాశరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
‘విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి’
అరసవల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ బిల్లుల బాదుడు దారుణంగా ఉందని, 2022 నుంచి 2024 వరకు చెల్లించిన విద్యుత్ బిల్లులపై అదనంగా సర్దుబాటు చార్జీలను రుద్దుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని మోపారని, దీన్ని రద్దు చేయాలని సీపీఎం శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద సీపీఎం శ్రేణులంతా కలిసి ధర్నా నిర్వహించాయి. పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి.కృష్ణమూర్తిలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి.. ఇప్పుడు దారుణంగా పెంచుకుపోతున్నార ని విమర్శించారు. అదానీ కంపెనీ ఒప్పందం ప్రకా రం స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారని, ఒక్కో స్మార్ట్ మీటర్ నుంచి రూ.13 వేల వరకు ఆయా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని గుర్తుచేశా రు. దీనికి తోడు టైమ్ ఆఫ్ ది డే పేరుతో కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీంతో కరెంట్‌ను అధికంగా వాడే సమయంలో యూని ట్‌కు అధిక రేటు వసూలు చేసేలా ఉంటుందన్నా రు. సెకీ ఒప్పందాలను, స్మార్ట్ మీటర్లు వ్యవస్థను రద్దు చేసి, అలాగే అదనపు విద్యుత్ భారాలను తగ్గించేలా ప్రభుత్వం నిర్ణయాలను ప్రకటించాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు కె.నాగమణి, కె.అమ్మన్నాయుడు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
10 మంది టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సంచలనం సృష్టించిన కుప్పిలి మోడల్ స్కూల్ మాస్ కాపీయింగ్ ఘటనలో పది మందిపై సస్పెన్షన్లు ఎత్తివేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారి సస్పెన్షన్లు తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచారు. వారిపై ఆధారాలు బలంగా ఉండటం, క్రిమినల్ కేసులు నమోదు కావడంతో కొద్దిరోజులు జాప్యం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం రోజులుగా టీచర్ల సస్పెన్షన్లను రద్దుచేయాలని, వి ద్యార్థులకు న్యాయం చేయాలని, డీఈఓపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక తరఫున పోరాటాలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి జరిగే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ప్రభుత్వ పెద్దల వరకు ఈ పంచాయితీ చేరడంతో.. విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చొరవ తీసుకున్నారు. తనను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ నాయకులతో మాట్లాడారు. ఆర్జేడీ బి.విజయభాస్కర్, డీఈఓ తిరుమల చైతన్యలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టారు. శుక్రవారం ఆర్జేడీ విజయబాబు జిల్లా డీఈఓ కార్యాలయానికి వచ్చి వాస్తవ ఘటనపై వివరాలు రాబట్టారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ముఖ్య ప్రతినిధులతో మాట్లాడారు. సస్పెండైన 15 మందిలో ముగ్గురు హెచ్ఎంలు, ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్ల్లు ఎత్తివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ఉత్తర్వులు వెలువరించారు. వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుని విధుల్లోకి తీసుకుంటున్నట్టు మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటనలో ‘యూ టర్న్’ ముగ్గురు హెచ్ఎంలు, ఏడుగురు టీచర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు మరో ఐదుగురి సస్పెన్షన్లను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచిన అధికారులు ఆర్జేడీతో చర్చలు విఫలం శ్రీకాకుళం న్యూకాలనీ: ‘కుప్పిలి పంచాయితీ’కి ఫుల్స్టాప్ పడుతుందని ఆశించిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది. పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు డీఈఓ కార్యాలయంలో చర్చలకు హాజరు కాగా.. వీరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. మిగిలిన ఉపాధ్యాయులపై స స్పెన్షన్లు ఎత్తివేయాలని, డీఈఓను తొలగించాలని, కోర్టు కేసులు వెనక్కి తీసుకోవాలని, డీబారైన విద్యార్థులకు రీ ఎగ్జామ్నిర్వహించాలని కోరగా.. ఆర్జేడీ ఒప్పుకోలేదు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించతలపెట్టిన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముట్టడి యథాతథంగా జరుగుతుందని తెలిపారు. ‘డీఈఓపై చర్యలు చేపట్టండి’ కుప్పిలి కాపీయింగ్ ఉదంతంలో అన్యాయంగా సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులకు, డీబారైన విద్యార్థులకు న్యాయం చేసి, డీఈఓపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ కార్యచరణ ఉద్యమ షెడ్యూల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యేలకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు వినతిపత్రాలను అందజేశారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తిలకు వినతిపత్రాలు అందజేశారు. ‘విద్యార్థులకు న్యాయం చేయాలి’ కుప్పిలిలో డీబార్‌కు గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరైన ఆర్జేడీ బి.విజయ్‌భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
●భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడ పనుందని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు తెలిపారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి–శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్న ట్లు తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ 5వ తేదీ సా యంత్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటాయన్నారు. తిరిగి 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయానికి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటాయని తెలిపారు. ఈ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాములవారి కల్యాణం చూసేందుకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611, 08942 223188 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
రామలింగస్వామికి ‘ముంగిట సన్మానం’
శ్రీకాకుళం కల్చరల్: నాటక రంగం కోసమే లోకనాథం రామలింగస్వామి తన జీవితం అంకితం చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో రామలింగస్వామి ఇంటికి వెళ్లి ‘ముంగిట సన్మానం’ చేశారు. ఈ సందర్భంగా శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డి.పి.దేవ్ మాట్లాడుతూ శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతి ఏడాది కళకారుడి ఇంటికే వచ్చి సన్మానం చేయడం గొప్ప విషయమన్నారు. కళాకారుల సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పన్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ 16ఏళ్లుగా ఎందరో కళాకారుల ఇళ్లకు వెళ్లి ముంగిట సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు, సమాఖ్య కార్యదర్శి బి.రామచంద్రదేవ్, బి.ఏ.మోహనరావు, కంచరాన అప్పారావు, పైడి సత్యవతి, బీఎంఎస్ పట్నాయక్, శివప్రసాద్, పొట్నూరు వెంకటరావు, నక్క శంకరరావు, బెహరా నాగేశ్వరరావు, కేశిరెడ్డి రాజేశ్వరి, జగన్నాథనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల లే ఆఫ్ ప్రతిపాదన రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్యామ్‌క్రగ్ పిస్టన్ కార్మికుల లేఆఫ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని కోరుతూ మార్చి 29న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రణస్థలం మండలంలో గల శ్యాంక్రగ్ పిస్టన్స్(రింగ్స్) ప్లాంట్–2 పరిశ్రమలో 200 మంది కార్మికులను లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికులు ఏప్రిల్ 1 నుంచి పనిలో నుంచి తీసివేస్తారని భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీ నర్ కె.నాగమణి, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు, వైఎస్సార్ ట్రేడ్ యూనియ న్ జిల్లా నాయకులు ఎస్.వెంకటరావు, ఏఐటీయూ సీ జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, శ్యాంపిస్టన్స్ ప్లాంట్–3 వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
అప్రోచ్ రోడ్డుకు స్థల పరిశీలన
ఆమదాలవలస రూరల్: మండలంలోని ఇసక లపేట, తొగరాం, కొత్తవలస తదితర గ్రామా ల మీదుగా బలసలరేవు బ్రిడ్జికి నిర్మించనున్న అప్రోచ్ రోడ్డుకు గురువారం జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ స్థల పరిశీలన చేశారు. పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్ రాంబాబు, సర్వేయర్ బి.గోపి, ఆర్ఐ పి.గోవిందరావు పాల్గొన్నారు. గంజాయితో మహిళ అరెస్టు ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి తరలిస్తున్న మహిళను గురువా రం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ మొబైల్ సీఐ జి.వి.రమణ తెలిపారు. శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రంజువాలిక్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ చేయగా 10.3 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీల్లో సిబ్బంది విఠలేశ్వరరా వు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరు ప్రైవేటు బస్సులు సీజ్ శ్రీకాకుళం అర్బన్: జిల్లా ప్రజారవాణా శాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువా రం బుడుమూరు, సీపన్నాయుడుపేట తదితర చోట్ల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అనుమతులు లేకుండా తిరుగుతున్న ఆరు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. కాంట్రాక్ట్ క్యారేజ్‌గా అనుమతులు తీసుకుని స్టేజ్ క్యారేజీలుగా నడుపుతున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో సీట్లు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడాన్ని గమనించి సీజ్ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐలు గంగాధర్, అనిల్, శిరీష, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజ ర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్. ఎస్.శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం టెక్కలి రూరల్: టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సివిల్ సప్లయ్ గోదాము నుంచి బియ్యం తీసుకెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. తొట్టెకు ఉన్న లింకు తెగిపోవడంతో కూలీలు ఒక్కసారిగా గెంతేశారు. అనంతరం అడ్డుగా రాళ్లు పెట్టి తొట్టె వెనుక జారకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బియ్యం బస్తాలను మరో ట్రాక్టర్లోకి లోడ్ చేసుకుని వెళ్లారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు టెక్కలి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆర్మీ హవల్దార్ పైల ప్రతాప్ రెడ్డి మృతదేహం గురువారం ఢిల్లీ నుంచి స్వగ్రామమైన టెక్కలి చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్మీ అధికారులు మృతుని కుటుంబసభ్యుల సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
● హైవే, సర్వీసు రోడ్లపై అనుమతి లేనిచోట ఆపుతున్న భారీ లారీలు ● వీటిని ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్న ఇతర వాహనాలు ● చోద్యం చూస్తున్న అధికారులు
శ్రీకాకుళం క్రైమ్ : ఇటీవల లావేరు మండలం బుడుమూరు హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో అదుపు తప్పిన కారు.. రోడ్డుపక్కనే ఆగివున్న స్కూటీ, లారీలను ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. అధిక శాతం ఆగి ఉన్న వాహనాలు ముఖ్యంగా భారీ లారీలను ఢీకొట్టడం వల్లే చోటుచేసుకుంటున్నాయి. నిర్దేశిత పార్కింగ్ ప్రాంతం తప్ప మిగతా చోట్ల భారీ వాహనాలను ఆపవద్దనే నిబంధనలు ఉన్నా వాటిని డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ అనుమతి లేనిచోట.. హైవే రహదారులు, సర్వీసు రోడ్లు, గ్రామీణ రహదారులపై ఎక్కడపడితే అక్కడ భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాలు అదుపుతప్పి నేరుగా ఆగివున్న లారీలను, ఇతర భారీ వాహనాలను ఢీకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అనధికారికంగా ర్యాంపుల్లోని ఇసుకను తరలిస్తున్న లారీలైతే ఒకేసారి గుంపుగా రావడం.. జిల్లాలోని రోడ్లపై వారి కంపెనీ తాలుకా మోటార్ రిపేర్ పాయింట్ల వద్ద గంటలు సేపు ఆపేయడం, ఇసుకను తరలించేందుకు అనుకూల సమయంలో ఒకేసారి వెళ్లడం వల్ల మిగతా వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాక ట్రాఫిక్ అంతరాయమవుతోంది. లోపల ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉన్నా బయట సర్వీసు రోడ్లపైనే ఆపేస్తున్నారు. ఇది జిల్లాలోని నదీ పరివాహక ఇసుక ర్యాంపులున్న అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది.. కలెక్టర్, ఎస్పీ మాటలు బేఖాతరు.. ఇటీవల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీలు రోడ్డు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఆంక్షలను కఠినతరం చేయాలన్న ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమో దు చేయాలని, ప్రమాదాలపై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ శాఖల వారీగా ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారిపై బ్లాక్స్పాట్లలో చోటుచేసుకుంటున్నాయని, జాగ్రత్తలు తీసుకోవడంలో హైవే అధికారులు విఫలమవుతున్నారని ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తాం కలెక్టర్ ఉత్తర్వులు ఇప్పటికే అందాయి. హైవేపై అనుమ తి లేనిచోట్ల పెద్ద పెద్ద వాహనాలు ఆపితే కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తాం. – ఎ.పార్థసారధి, డీటీసీ, శ్రీకాకుళం -
దళిత సంఘాల జేఏసీ నిరసన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దళిత పాస్టర్, సామాజికవేత్త ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలిలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మాన వ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. జగన్నాథం,సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి రామ్ గోపాల్ మాట్లాడుతూ నిందితులను శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు బోసు మన్మధరావు, డేనియల్, అనంతరావు, సుధాకర్, రాంబాబు, రమణ, జాన్, కోటి, గోవింద్, శ్యామ్, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
4న రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ : రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ ఫిజిక్ మోడలింగ్ కాంపిటేషన్ పోటీలను ఏప్రిల్ 4న భీమవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రిన్ డాక్టర్ బాడాన దేవభూషణరావు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 55, 60, 65, 70, 75, 80, 85 కేజీల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు, స్టార్ బాడీబిల్డింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.విజయ్‌కుమార్, బాడీబిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.గౌరీశంకర్, కోశాధికారి బట్న నవీణ్, యువత పాల్గొన్నారు. -
ఊపిరి తీసుకున్న అన్న
కొనఊపిరితో తమ్ముడు.. ● వ్యాపారంలో నష్టాలు రావడంతో యాసిడ్ తాగేసిన తమ్ముడు ● బతకడం కష్టమన్న వైద్యులు ● మనస్థాపంతో ఉరి వేసుకున్న అన్నయ్య ● అలుదులో విషాదఛాయలు శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి బయట గదిలో ఓ వ్యక్తి గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన శెట్టిసూరి, ఉమామహేశ్వరావులు అన్నదమ్ములు. వీరిద్దరూ కలిసి గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం.. నష్టాలు రావడంతో కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల కిందట తమ్ముడు ఉమామహేశ్వరరావు తీవ్ర ఒత్తిడికి గురై యాసిడ్ తాగేశాడు. వెంటనే బాధితుడిని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. బతకడం కష్టమేనని వైద్యులు చెప్పడంతో మనస్థాపానికి గురై అన్నయ్య శెట్టి సూరి(40) ఆసుపత్రి బయట ఓ రూమును అద్దెకు తీసుకొని గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్‌కు వెళ్లిన సూరి ఎంత కూ తిరిగి రాకపోవడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బంధువులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించా డు. విషయాన్ని రూరల్ పోలీసులకు తెలియజేశారు. సూరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. -
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివప్రసాద్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం(2025–26) ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అనంతరం లెక్కింపు చేపట్టారు. 604 మందికి గాను 529 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ చేయగా తంగి శివప్రసాద్ 272 ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఇప్పిలి సీతరాజు, ప్రధాన కార్యదర్శిగా పిట్టా దామోదరరావు, మహిళా ప్రతినిధిగా గురుగుబెల్లి వనజాక్షి విజయం సాధించారు. ఇప్పటికే కార్యదర్శిగా మాటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, గ్రంథాలయ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికై న సంగతి తెలిసిందే. సీనియర్ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, ఎన్.విజయ్‌కుమార్‌లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు అగూరు ఉమామహేశ్వరరావు, మామిడి క్రాంతి, బి.వి.రమణ తదితరులు అభినందించారు. -
రూ.1.63 లక్షలు దోచేసి..
ఏటీఎం కార్డు మార్చేసి.. శ్రీకాకుళం క్రైమ్ : ఓ రిటైర్డ్ అధికారి వద్ద ఏటీఎం కార్డు మార్చేసి రూ. 1,63,900 కొట్టేసిన వైనం జిల్లా కేంద్రంలోని అరసవల్లి మిల్లు కూడలి సమీప ఎస్బీఐ ఏటీఎంలో చోటు చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం. హరికృష్ణ, బాధితుడు తెలిపిన వివరా ల ప్రకారం.. అరసవల్లి మిల్లు జంక్షన్ సమీపంలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు ఓ రిటైర్డ్ అధికారి వెళ్లి రూ.9 వేలు విత్‌డ్రా చేశారు. కార్డును మిషన్ నుంచి తీయకుండానే పక్కనే ఆ డబ్బులు లెక్కపెడుతుండగా వెనుకగా నిల్చొన్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. క్షణాల్లో అధికారి కార్డు తీసేసి తన కార్డును మిషన్‌లో పెట్టేశాడు. సార్ మీ కార్డు మిషన్‌లో ఉంచేశారు.. తీయండి అంటూ సాయం చేసినట్లు నటించి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడికి రెండు రోజుల తర్వాత ఎస్బీఐ యోనోయాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.1,63,900 ఎవరో ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసినట్లు అధికారి గ్రహించారు. వెంటనే తన వద్దనున్న ఏటీఎం కార్డు తీసుకెళ్లి తనిఖీ చేయ గా బ్యాలెన్స్ తక్కువగా కనిపించడంతో వెంటనే సంబంధిత మెయిన్ బ్రాంచి (ఎస్బీఐ) అధికారులను కలవగా కార్డును బ్లాక్ చేసి స్టేట్మెంట్ తీసి చూపించి పోలీసులను ఆశ్రయించాలన్నారు. పలుచోట్ల తీసి.. చివరికి ఒడిశాలో.. స్టేట్మెంట్లో మోసం చేసిన వ్యక్తి ముందుగా విశాఖపట్నం శ్రీ సంఘవి జ్యూయలర్ మాల్ ఏటీఎం వద్ద రూ.75 వేలు, అశీల్‌మెట్ట ఏటీఎం వద్ద రూ.10 వేలు, అదే చోట రెండుసార్లు రూ.10 వేలు, మరోసారి రూ.వెయ్యి తీశాడు. అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్లి బరంపురం సిటీ హాస్పిటల్ రోడ్డులో రూ.10 వేలు, అదేచోట మూడుసార్లు రూ. 10 వేలు చొప్పున, చివరికి గజపతి జిల్లా సూర్యా హాల్‌మార్క్ వద్ద రూ.17,900 తీశాడు. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
టీచర్ల అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి
● క్రిమినల్ కేసులు ఎత్తివేయాలి ● డీఈఓను తొలగించాలి ● కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆందోళనశ్రీకాకుళం పాతబస్టాండ్: కుప్పిలిలో పదో తరగతి పరీక్షల కాపీయింగ్ ఘటన నేపథ్యంలో ఉపాధ్యాయులపై అక్రమ సస్పెన్షన్లు, క్రిమినల్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం రూ.30 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేశారన్న నెపంతో ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం, సస్పెండ్ చేయడం దారుణమన్నారు. దీనికి పూర్తి బాధ్యులైన డీఈఓను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక, స్టీరింగ్ కమిటీ సభ్యులు డీఆర్ఓ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణలతో సమావేశమయ్యారు. వాస్తవ పరిస్థితి, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులపై చర్చించారు. డీఈఓను తొలగించి విచారణ చేయించాలని కోరారు. ఈ ఘట నలో సస్పెన్షన్లు ఎత్తివేయాలని, క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, బాధిత విద్యార్థులకు వెంటనే పరీక్ష నిర్వహించాలని, లేనిపక్షంలో సప్లిమెంటరీ పరీక్షకైనా అనుమతించాలని విన్నవించారు. కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు ఎస్.కిషోర్, చౌదరి రవీంద్ర, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.నేడు ఎమ్మెల్యేలకు వినతిపత్రాల అందజేత శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయులు, సిబ్బందిపై అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని, డిబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని, డీఈఓ తిరుమలచైతన్యను విధుల నుంచి తప్పించాలని కోరుతూ శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టి ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేయనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ముఖ్య నాయకులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్మోహన్, దుప్పల శివరామ్‌ప్రసాద్, పిసిని వసంతరావు, ఎస్వీ రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు డీఈఓ కార్యాలయాన్ని మరోసారి ముట్టడిస్తామని, ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే 101కాల్ చేయండి● 14 శకటాలు, 184 మంది సిబ్బందితో సన్నద్ధం ● ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి ● ‘సాక్షి’తో జిల్లా అగ్నిమాపక అధికారి జడ్డు మోహనరావు శ్రీకాకుళం క్రైమ్ : వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని.. సిబ్బంది సైతం ఫైర్ ఎమెర్జెన్సీ కాల్స్ పట్ల అలర్ట్‌గా ఉండాలని జిల్లా అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ అధికారి జడ్డు మోహనరావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రమాదాల అప్రమత్తత, సిబ్బంది విధివిధానాలు, శకటాలు, పరికరాల పనితీరును వివరించారు. మరో 68 మంది అవసరం.. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలంలోని అగ్నిమాపక కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉన్నాయి. సోంపేట, నరసన్నపేటలో సెమీ పర్మినెంట్ భవనాలున్నాయి. మందస, పొందూరుల్లో ఔట్‌పోస్టు ఫైర్స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో 45 మంది ఫైర్మ్యాన్లు, 23 మంది డ్రైవింగ్ ఆపరేటర్లు, 33 మంది లీడింగ్ ఫైర్మ్యాన్లు, ఎనిమిది మంది స్టేషన్ అధికారులున్నారు. జిల్లా సహాయక అగ్ని మాపక అధికారిగా వరప్రసాద్ కొనసాగుతున్నారు. ఔట్‌పోస్టు స్టేషన్లలో 25 మంది ఫైర్మ్యాన్లు, ముగ్గురు డ్రైవింగ్ ఆపరేటర్లున్నారు. వీరే కాక జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఒక్కరేసి చొప్పున, హోంగార్డులు 44 మంది వరకు ఉన్నారు. తనతో పాటు మొత్తం 184 మంది ఉన్నారని చెప్పారు. మరో 56 మంది ఫైర్మ్యాన్లు, పది మంది డ్రైవింగ్ ఆపరేటర్లు, సోంపేట, కోటబొమ్మాళి కేంద్రాల్లో ఫైర్‌స్టేషన్ అధికారులు భర్తీ కావాల్సి ఉంది. ఇవి పాటించాల్సిందే.. ● అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు 101కు గానీ, సంబంధిత స్టేషన్ ఫోన్ నంబర్‌కు గానీ, స్టేషన్ అధికారికి గానీ ఫోన్ చేయాలి. ● ప్రజల నుంచి వచ్చే ఫైర్ కాల్స్ పట్ల క్షణాల్లో స్పందిచకపోయినా, మరమ్మతులకు గురైన వాహనాలు తీసుకెళ్లి ప్రమాదాన్ని నియంత్రించలేకపోయినా సిబ్బందిపై చర్యలుంటాయి. కచ్చితంగా కండిషన్లో ఉన్న వాహనాలు, పరికరాలే తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ● మండలాలు, గ్రామాల పరిధిలో గుడిసెలు ఉన్న కాలనీలను సంబంధిత ఫైర్‌మ్యాన్, లీడింగ్ ఫైర్మ్యాన్లు దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు ప్రమాద అవకాశాలున్న వీకర్ లొకేషన్లపై సమాచారం తెలుసుకోవాలి. అక్కడి ప్రజలకు ప్రమాదాలపై అవగాహన పర్చాలి. ● సర్పంచ్, వార్డుమెంబర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఎఫ్పీషాప్ డీలర్లు, విలేజ్ సర్వెంట్లు, పోస్ట్మాస్టర్లే కాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ● తక్షణ చర్యల్లో భాగంగా పరికరాలతో కూడిన మిస్ట్ బుల్లెట్ అందుబాటులో ఉంచుకోవాలి. ● 101 ఎమెర్జెన్సీ నెంబర్, స్టేషన్ ఎస్టీడీ నంబర్‌తో పాటు ప్రజలు ఫోన్ చేస్తే వెంటనే స్పందించేలా స్టేషన్ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ ఫోన్ నెంబర్లు ఉన్న సిమ్‌లు యాక్టివేట్ చేసుకోవాలి. ● గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలు పరిధి ముఖ్య కూడళ్లు, హోటళ్లు, సచివాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, కమ్యూని టీ హాళ్లు, దేవాలయాలు, హెల్త్ సెంటర్లు, ఎఫ్‌పీఎస్ డీలర్ షాపులు, రైతుబజారు, మార్కెట్లలో స్కూళ్లు, పోస్టాఫీస్‌లు, బ్యాంకులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సంబంధిత ఫైర్‌స్టేషన్ అధికారి మొబైల్ నెంబర్, స్టేషన్ నెంబర్, ఎమెర్జెన్సీ కాల్ 101 నెంబర్లు కనిపించేలా ప్రదర్శించాలి. ● జిల్లాలో గడ్డి ఇళ్లు, గుడిసెలు బాగా తగ్గాయి. పరిశ్రమలు, మాల్స్‌లో నిబంధనలు పాటించకపోవడం, సంబంధిత అగ్ని ప్రమాద పరికరాలు ఉండకపోవడం, అనుమతులు తెచ్చుకో కపోవడం వల్లే ఇటీవల ప్రమాదాలు సంభవించాయి. భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం ఎక్కడ సంభవిస్తుందోనని పలువురు ప్రమాదమని తెలిసినా చొరబడేందుకు చూస్తారు. అది మంచిది కాదు. అత్యవసర నంబర్లు.. స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ మొబైల్ ఆఫీస్ నంబర్ శ్రీకాకుళం ఎం.వరప్రసాద్ 9963726782 08942222099 ఇచ్ఛాపురం కె.ప్రశాంత్‌కుమార్ 8317587461 08947231101 సోంపేట ఎస్ మోహన్ 9963744295 08947234101 పలాస బి.సోమేశ్వరరావు 9963730662 08945241101 టెక్కలి బి.సూర్యారావు 9000505945 08945244277 కోటబొమ్మాళి పి.ఆర్.రెడి 9963730845 08942238659 నరసన్నపేట ఎస్.వరహాలు 7680089447 08942276777 ఆమదాలవలస కె.అప్పారావు 9963730658 08942286401 కొత్తూరు ఎన్.బుచ్చోడు 9000873349 08946258444 రణస్థలం పి.అశోక్ 9963731326 08942234499 మందస పి.కృష్ణారావు 9440939909 08947237101 పొందూరు జి.ఇందుమతి 9491325930 08941242101 -
కేజీబీవీలో ఫుడ్ పాయిజన్
కాశీబుగ్గ / మందస : మందస మండలం గుడారిరాజపురం(జి.ఆర్.పురం) గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అన్నం తిని నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా వాంతులు, విరేచనలు కావడంతో వెంటనే సిబ్బంది స్పందించారు. సచివాలయ ఏఎన్ఎం సాయంతో ప్రథమ చికిత్స చేయించారు. అందులో 13 మంది విద్యార్థినులు గురువారం ఉదయానికి కూడా కోలుకోకపోవడంతో 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు డాక్టర్ మద్దిల సంపతిరావు, డాక్టర్ స్వరాజ్యలక్ష్మిలు వైద్యసేవలు అందించారు. ప్రమాదమేమీ లేనప్పటికీ ఎనిమిదో తరగతి విద్యార్థులైన భారతి, యమున, మోహిని, నవ్య, జాహ్నవి, గోపిక, సాహితి, శృతి, జ్ఞానశ్రీలను ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై ఆస్పత్రికి చేరుకున్నారు. మందస పోలీసులు, మండల విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రవికుమార్ పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ లేకే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. అనంతరం పాఠశాలను సందర్శించి వసతుల లేమి, భోజనం సరిగ్గా లేకపోవడంపై మండిపడ్డారు. 20 మందికి అస్వస్థత.. 13 మందికి ఆస్పత్రిలో చికిత్స ఆందోళనకు గురైన తల్లిదండ్రులు -
థర్మల్ ప్లాంట్‌తో ముప్పు
సరుబుజ్జిలి: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కలిసికట్టుగా ఉద్యమం చేయాలని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.దానేష్ పిలుపునిచ్చారు. గురువారం థర్మల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాలైన వెన్నెలవలస, మసానుపుట్టి, జంగాలపాడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో థర్మల్‌ప్లాంట్ నిర్మించడం వల్ల భూములు బీడుగా మారే ప్రమాదముందని చెప్పారు. కూటమి నేతలు స్వప్రయోజనాల కోసమే థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో థర్మల్ పోరాట కమిటీ నేత సవర సింహాచలం, పీడీఎం రాష్ట్ర నేత పాలిన వీరాస్వామి, ఉద్యమనేతలు, సురేష్‌దొర, ధర్మారావు, దుర్యోధన, వంకల మాధవరావు, గణేష్, గంగయ్య, వైకుంఠరావు, రామానాయుడు, నాగమణి, కోటి పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై ఎస్పీ ఆరా నరసన్నపేట: ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి నరసన్నపేట పోలీసు స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటలు స్టేషన్లో ఉండి పోలీసులు పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నరసన్నపేటలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాములను త్రైమాసిక తనిఖీలలో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈవీఎంలను ట్రిపుల్ లాక్ సిస్టమ్ ద్వారా భద్రపరిచామని, 24 గంటల సీసీటీవీ నిఘా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతు శంకరరావు, పీఎంజే బాబు, సురేష్బాబుసింగ్, ఎం.గోవింద్, బి.అర్జున్‌కుమార్, సీహెచ్ భాస్కరరావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
మాట తప్పడం బాబు నైజంశుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025గిరిజనులకు చెందిన జీవో నంబర్ 3 పునరుద్ధరిస్తాను. గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే. జిల్లాలో ఐటీడీఎ ఏర్పాటు చేస్తాను. 1/70 చట్టం సమర్ధంగా అమలు చేస్తాను.. – పాతపట్నం, పలాసలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ●● ఓవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం ● మరోవైపు ఐటీడీఏ కోసం ఆందోళన ● ఇంకోవైపు గిరిజన భూముల ఆక్రమణలపై నిరసన ● భవిష్యత్ కోసం ఎందాకై నా వెళ్తామని ప్రభుత్వానికి హెచ్చరిక న్యూస్‌రీల్ -
● వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్
నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఇరుక్కున్నా, నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీయాలన్నా దీనిని ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ రిమోట్ సాయంతో ఆపరేటర్ చేస్తారు. ఆయిల్ ప్రమాదాలు (పెట్రోల్, డీజిల్, ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి) ఫోమ్ మేకింగ్ బ్రాంచిని ఉపయోగించి ఫోమ్‌ను స్ప్రే చేస్తారు. 360 డిగ్రీల కోణంలోనూ వాటర్ స్ప్రే చేయొచ్చు. సింగిల్ యూనిట్ అయితే 16 మంది, డబుల్ యూనిట్‌కు 32 మంది సిబ్బంది ఉంటారు. ● అడ్వాన్స్ (మల్టీపర్పస్)వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సాధారణంగా వాటర్ ట్రెండింగ్ ఇంజిన్‌లో కింద నుంచి వాటర్ ప్రెజర్ కొడతారు. దీనికై తే పైన హ్యాండిల్ పట్టుకుని వాటర్ కొట్టవచ్చు. ఫోమ్, కార్బన్ డయాకై ్సడ్ ఉంటుంది. -
పెద్దపేట కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
నరసన్నపేట: నరసన్నపేటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. పెద్దపేటకు చెందిన ఇద్దరు యువకులు ఈ బెట్టింగ్ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. బజారు వీధితో పాటు ఆదివరపుపేట కూడలి, తమ్మయ్యపేట జంక్షన్ తదితర చోట్ల గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలవుతున్న బెట్టింగులు రాత్రి 10 వరకూ నిర్వహిస్తున్నా రు. ఓవర్‌కు ఎంత స్కోర్ చేస్తారు.. ఏ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తారు.. ఏ ప్లేయర్ ఎన్ని సిక్స్‌లు కొడతారు, ఎన్ని ఫోర్లు కొడతారు.. అనే వాటితో పాటు అనేక రకాల బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు భోగట్టా. స్థానిక పెద్దపేటకు చెందిన చైన్నెలో బీటెక్ మొదటి సంవ త్సరం విద్యార్థి ఒకరు ఈ బెట్టింగ్‌ల్లో రూ. 30 లక్షలు వరకూ పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం తె లుసుకున్న తండ్రి లబోదిబోమంటూ స్థానిక మాజీ ఎంపీటీసీ జామి వెంకటరావు వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై ఎస్పీ కార్యాలయం కూడా ఆరా తీస్తోంది. బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యువత బెట్టింగ్‌ల వైపు వెళ్లవద్దని నరసన్నపేట సీఐ జే. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్‌లో పాల్గొనడం నేరమ ని అన్నారు. -
పెళ్లయిన 48 రోజులకే..
కాశీబుగ్గ: తాళి కట్టి రెండు నెలలైనా అవ్వలేదు.. నూతన వధువు కాళ్ల పారాణి కూడా పూర్తిగా ఆరలేదు.. కొత్త దంపతుల ముచ్చట్లే తీరలేదు.. అంతలోనే విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూ పంలో ముంచుకొచ్చిన మృత్యువు వరుడిని తనతో తీసుకెళ్లిపోయి వధువుకు తీరని శోకం మిగిల్చింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కోసంగిపురం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన కోరాడ మధుసూదన్ యాదవ్ (28) మృతి చెందారు. ఆయన వివాహం జరిగి కేవలం 48 రోజులైంది. గొల్లమాకన్నపల్లికి చెందిన మధుసూదన్ మంగళవారం పలాసలో మార్కెట్‌కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి తన బుల్లెట్‌పై బయల్దేరారు. అక్కడ పనిచూసుకుని తిరిగి వస్తుండగా కోసంగిపురం జాతీ య రహదారిపై అతడి బండి ప్రమాదానికి గురై 50 మీటర్ల దూరం అవతల పడిపోయాడు. రాత్రి పూట ప్రమాదం జరగడంతో వెనుక నుంచి వాహనం ఢీకొట్టిందా, లేదా బండి స్కిడ్ అయ్యిందా అన్నది రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి -
లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి
పోలాకి: జిల్లాలో రేషన్‌కార్డు లబ్ధిదారులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని డీఎస్ఓ జి.సూర్యప్రకాశరావు అన్నారు. బుధవారం మబగాం, ఈదులవలస రేషన్‌డిపోల్లో ఈకేవైసీ నమోదుకాని వారి వివరాలు, అందులో ఎంతవరకు ఈనెలలో అప్డేట్ అవుతున్నాయో అని పరిశీలించారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారికి సమాచారం ఎంతవరకు వచ్చిందో అన్న విషయాలపై ఆరాతీశారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, డిపో డీలర్ సమన్వయంతో ఈనెల 31నాటికి శతశాతం ఈకేవైసీ అప్డేట్ జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట సీఎస్ డీటీ రామకృష్ణ, స్థానిక రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. యోగా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి యోగా అవార్డులు–2025 కోసం అర్హులైన వ్యక్తులు/సంస్థల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్ కె.శ్రీధర్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో యోగా అభివృద్ధి, యోగా ప్రచారం కోసం అత్యుత్తమ సహకారాన్ని అందించిన వారు, యోగా అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేసి, అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తులు/ సంస్థలు ఈనెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని శ్రీధర్‌రావు పేర్కొన్నారు. కిడ్నీ ఆస్పత్రిలో తాగునీరు కరువు కాశీబుగ్గ: ఉద్దాన కిడ్నీ రోగుల కోసం నిర్మించిన పలాస కిడ్నీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్లో తాగడానికి మంచినీరు కరువైంది. ఆస్పత్రికి వచ్చిన వారంతా బయటే వాటర్ బాటిళ్లు కొనాల్సి వస్తోంది. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసి ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు. దీంతో రోగులతో పాటు వందమందికిపైగా సిబ్బందికి సైతం సమస్యగా మారింది. రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ శ్రీకాకుళం న్యూకాలనీ: మండే ఎండల నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తప్పనిసరిగా నీళ్లు తాగేలా రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ మోగించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, 11 గంటలకు, మళ్లీ మద్యాహ్నం 12 గంటలకు విధిగా వాటర్‌బెల్ పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. గురుకులాల్లో బ్యాక్లాగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మెళియాపుట్టి : 2025–26 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు(బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం సీతంపేట ఐటీడీఏ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9లోగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. -
కోచింగ్ సెంటర్ ఎంపికకు గడువు పెంపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లో కోచింగ్ సెంటర్ ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు పొడిగించినట్లు డీడీ విశ్వమోహన రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్ విద్యార్థికి గాయం నరసన్నపేట: స్థానిక సెంట్క్లారెట్ స్కూల్లో పరీక్ష రాస్తున్న టెన్త్ విద్యార్థి బి.వెంకటరమణ గాయపడ్డాడు. స్కూల్లో గోడకు ఉన్న మేకు తలకు తగలడంతో రక్త స్రావమైంది. వెంటనే పీహెచ్సీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. బీపీ చెక్ చేసిన అనంతరం పరీక్షకు హజరయ్యాడు. జలుమూరు మండలం బసివాడకు చెందిన వెంకటరమణ నరసన్నపేట మండలం కంబకాయ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గుండెపోటుతో వీఆర్ఓ మృతి ● ఒత్తిడే కారణమంటున్న ఉద్యోగ సంఘాలు ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని బడివానిపేట వీఆర్వో పుట్ట రాజారావు (50) బుధవారం గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది సీపీఆర్ చేసి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. రాజారావు స్వస్థలం చిలకపాలెం. ఇతనికి భార్య, కుమా రుడు ఉన్నారు. కాగా, రాజారావు పనిఒత్తిడి కారణంగానే మృతిచెందారని ఉద్యోగ సంఘాల నాయకులు, వీఆర్వోలు చెబుతున్నారు. రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ ఇలా అన్ని సర్వేలు, పనులు తమతోనే చేయిస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఎవరి పనిచేస్తున్నామో తమకే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కాగా, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్ గోపాలరావు బుధవారం రాత్రి రాజారావు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.మృతిపై ఆరా తీశారు. రాజారావు(ఫైల్) -
భాషా శాస్త్రవేత్తల సదస్సుకు గౌరీశంకర్
శ్రీకాకుళం కల్చరల్: తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 25, 26 తేదీల్లో కేంద్రీయ భాషా ప్రాధికార సంస్థ, తెలుగు భాషా వేదిక, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సంయుక్తంగా నిర్వహించిన 13వ అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తల సదస్సులో మునసబుపేటలోని గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో తెలుగు విభాగాధిపతి భమిడిపాటి గౌరీశంకర్ పాల్గొన్నారు. నూతన విద్యావిధానం–భారతీయ భాషలు అనే అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్‌ను గాయత్రీ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యనారాయణ, డాక్టర్ మార్తాండ కృష్ణ, సీతారాంనాయుడు, మేజర్ వి.మహేష్ అభినందించారు. -
కుక్కల దాడిలో జింక మృతి
ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలోని రత్తకన్న గ్రామంలో వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. సమీప కొండల నుంచి దారితప్పి గ్రామంలోనికి ప్రవేశించిన సమయంలో వీధికుక్కలు వెంటపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే గ్రామస్తులకు అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.మురళీకృష్ణనాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ అధికారి ఐ.రాము, ఫారెస్టు బీట్ అధికారులు సిబ్బంది మృతిచెందిన జింకను పరిశీలించారు. గ్రామస్తుల సమక్షంలో బెల్లుపడ వెటర్నరీ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని దహనం చేశారు. ఇదిలా ఉండగా రత్తకన్న సమీపంలోని ఎర్రమట్టి కొండల నుంచి గ్రావెల్‌ను కొందరు అక్రమంగా తవ్వేయడంతో కొండలు కరిగిపోతున్నాయని, అక్కడి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
డీఈఓను విధుల నుంచి తప్పించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కుప్పిలి కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఘటనలో సస్పెండైన 14 మంది ఉపాధ్యాయులను వెంటనే విదుల్లోకి తీసుకోవాలని, ముందస్తు ప్రణాళికతో దాడిచేసి వ్యక్తిగత మైలేజ్ కోసం జిల్లా పరువు, ప్రతిష్టతలను మంటగలిపి ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేసిన డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే విధుల నుంచి తప్పించాలనికి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సస్పెండైన టీచర్లతోపాటు డిబారైన ఐదుగురు విద్యార్థులకు న్యాయం చేయాలని నినదించారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడివేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట రెండో రోజు బుధవారం కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉమ్మడి వేదిక ముఖ్య ప్రతినిధులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్మోహన్, డి.శివరాంప్రసాద్, పిసిని వసంతరావు తదితరులు మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2023 సాధారణ బదిలీల నుంచి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కుప్పిలి కేంద్రంలో జరిగిన సంఘటన అతిగా చిత్రీకరించి విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి ప్రశాంతంగా పరీక్షలు రాయటంలో తీవ్ర ఆటంకం కలుగజేసిన డీఈఓపై, దాడిలో పాల్గొన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది ఉపాధ్యాయులతో చేపట్టనున్న ఉపాధ్యాయుల పోరాట ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు కొప్పల భానుమూర్తి, బమ్మిడి శ్రీరామ్మూర్తి, గొంటి గిరిధర్, సంపతిరావు కిషోర్‌కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, బల్లెడ రవి, శీర రమేష్‌బాబు, ఎంవీ రమణ, ఎస్.సత్యనారాయణ, బలివాడ ధనుంజయ్, బోనెల రమేష్, కె.పద్మావతి, బి.మోహనరావు, పప్పల రాజశేఖర్, దామోదరావు, వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ రెండోరోజూ కొనసాగిన నిరసన -
అరసవల్లిలో విజిలెన్స్
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళ,బుధవారాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. మంగళవారం ఓ వైపు హుండీ కానుకల లెక్కింపు జరుగుతున్న క్రమంలో మరోవైపు కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టడం గమనార్హం. అయితే ఇప్పుడు విధుల్లో ఉన్న ఈవో కొత్తగా రావడంతో ఆయనకు గత నిధుల దుర్వినియోగంతో సంబంధం లేకున్నప్పటికీ సిబ్బందిలో మాత్రం ఆందోళన నెలకొంది. ప్పట్లో ఈవోలుగా పనిచేసిన రమేష్‌బాబు, చంద్రశేఖర్‌ల హయాంలో నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లుగా తెలిసింది. నిధుల దుర్వినియోగంలో గత ఈవో చంద్రశేఖర్‌కు ఆలయంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఈవో జగన్మోహనరావుతో పాటు మరో రెగ్యులర్ ఉద్యోగి, ముగ్గురు దినసరి వేతనదారులు చాలా వరకు సహకరించారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. డిప్యుటేషన్ విధుల్లో ఉన్న అటెండర్ శ్రీనివాస్‌కు ఎరియర్స్‌తో కూడిన పీఆర్సీని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టడాన్ని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గతంలో ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కృష్ణమాచార్యులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగానే తాజాగా ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను చేస్తున్నట్లు సమాచారం. ప్రశ్నలకు సమాధానమేదీ.! గత ఈవో చంద్రశేఖర్ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న నిధుల దుర్వినియోగాలపై విజిలెన్స్ అధికారులు స్థానిక ఆలయ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికీ సరైన రికార్డు లేకపోగా.. సమాధానం కూడా కరువైపోయి నీళ్లు నమలడమే తరువాయిగా మారింది. వారినే అడగండి..ముందుగా ఆలయ ఈవో అధికారిక వాహనం కొనుగోలు, వాహన ఇఽంధనం వినియోగ బాకీలు, కంప్యూటర్లు కొనుగోళ్లు, ఇతర సామగ్రి కొనుగోళ్లు, రూ.లక్షల బిల్లులతో పట్టుచీరలు, వస్త్రాల కొనుగోళ్లు, భక్తులకు ఇచ్చినట్లుగా చూపుతున్న మజ్జిగ, పాలు బిల్లులతో పాటు ఆలయానికి రంగులకు రూ.26 లక్షల వినియోగం.. ఇలా చాలావరకు ఆలయానికి చెందిన నిధులు దుర్వినియోగం అయినట్లు దాదాపుగా నిర్ధారణకు వచ్చిన విజిలెన్స్ అధికారులు.. ఈమేరకు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తే గత ఈవోలకు అడగండని సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నేరుగా ఫిర్యాదుదారుడు కృష్ణమాచార్యులతో ఫోన్లో సంప్రదించి.. అవసరమైతే ప్రత్యక్షంగా ఆధారాలు ఇస్తూ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా...విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు రికార్డులను, బిల్లులను తనిఖీలు చేస్తుంటే.. అప్పట్లో క్యాష్బుక్ బాధ్యుడిగా ఉన్న రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు మాత్రం విజిలెన్స్ అఽధికారులకు కనిపించకుండా రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే వెళ్లాలంటూ తాను మాత్రం తప్పించుకుని వెళ్లిపోయారు. దీన్ని విజిలెన్స్ సిబ్బంది ఒకరు గమనించి పెద్దాయన ఎందుకు వెళ్లిపోయారంటూ ప్రశ్నించడంతో పరిస్థితి మారిపోయింది. కంప్యూటర్ల కొనుగోళ్లు, సామగ్రి, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో భారీగా నిధులు స్వాహా జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించి విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావుకు నివేదించనున్నట్లు తెలిసింది. దీనిపై ఆలయ అధికారులు గానీ సిబ్బంది గానీ ఎవ్వరూ నోరుమెదపడం లేదు. ఏదిఏమైనా ఆదిత్యుని ఆలయ నిధుల స్వాహా జరిగిందనే అభియోగాలు, ఆరోపణలపై త్వరలో తుది నివేదిక సిద్ధమై కారకులపై చర్యలు తీసుకోవచ్చనే చర్చ జోరందుకుంది. వాస్తవమే..ఈ విషయమై ఈఓ వై.భద్రాజీ వద్ద ప్రస్తావించగా మంగళ, బుధవారాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఆలయ రికార్డులు పరిశీలించగా, వారికి సహకరించామని చెప్పారు. -
ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టు ట్యాంకుకు స్థల పరిశీలన
పాతపట్నం: మండలంలోని కొరసవాడ–బోరుబద్ర గ్రామాల మధ్య కొండ సమీపంలో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు వాటర్ ట్యాంకు నిర్మించేందుకు నాలుగు ఎకరాల స్థలాన్ని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్ ఎస్.కిరణ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. రూ.260 కోట్లతో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలంలోని వివిధ గ్రామాలలకు తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకు నిర్మాణం, పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఉద్దానం ప్రాజెక్టు పనులు త్వరితగతిని చేయాలని ఆర్డీఓ ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.చంద్రకుమారి, ప్రాజెక్టు డీఈఈ ఆశలత, మండల సర్వేయర్ రామగణపతి, ప్రాజెక్టు ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా యంత్రాంగం అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో, అటెండర్లుగా పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 5న విజయవాడ ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న వీఆర్ఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. సంఘం జిల్లా నాయకులు ఎన్.సీతప్పడు, డి.అప్పారావు, కె.పురుషోత్తం, బి.రాములమ్మ, మీనాక్షి, రాజారావు, లోకనాథం, శంకర్, బొమ్మాలి, వెంకటరమణ, రామ్మూర్తి, లక్ష్మణరావు, ముకుంద తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంఘ ప్రతినిధులు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రణస్థలం: మండలంలోని బంటుపల్లి రాధాగోవింద మందిరం సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఎస్పీ రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనంతో వచ్చిన రమణ బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన రమణను 108 అంబులెన్సులో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. కొవ్వాడ గ్రామానికి చెందిన రమణ పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈదురుగాలుల బీభత్సం పాతపట్నం: మండలంలోని కొదూరు పంచాయతీ ప్రహరాజపాలెం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా భారీ గాలులు వీయడంతో రైతులు రావాడ వెంకటరావు, ప్రసాద్ మహంతి, జాడ సవరయ్య, చిప్పాడ నారాయణ, మంత్రి సోమేష్, మంత్రి లచ్చయ్య, రావాడ రవికిరణ్, కుంటుమహంతి వేణుగోపాల్‌కు చెందిన ఐదు ఎకరాల స్వీట్‌కార్న్ పంట నేలకొరిగింది. మరో పది రోజుల్లో పంట చేతికి వచ్చేదని, ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల (బాలికలు/బాలురు) 2025–2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షలు ఏప్రిల్ 13 నాటికి వాయిదా పడినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి ఎన్.బాలాజీ తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో మార్పులు గమనించాలని. సందేహాలు ఉంటే 9701736862 – 8331005217 – 08942– 279926 నంబర్లను సంప్రదించాలన్నారు.నాటుసారాతో దొరికిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కంచిలి: కుంబరినౌగాం టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు సింహాద్రి జన్ని నాటుసారాతో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. సింహాద్రి జన్ని ఇంట్లో 5 లీటర్ల నాటుసారా నిల్వ ఉందని సమాచారం రావడంతో సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.బేబీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ విషయమై సిఐ బేబీ మాట్లాడుతూ.. నాటుసారా అమ్ముతున్నారని సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని తెలిపారు. తొలిరోజు ఏపీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద భద్రత, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులను మంగళవారం పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, విశ్లేషకుడు గ్రేడ్–ఐఐ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 25 నుంచి 27 వరకు పరీక్షలు జరుగనున్నాయి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎచ్చెర్లలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్లో 100 మంది విద్యార్థులకు గాను 50 మంది గైర్హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో 68 మంది విద్యార్థులకు గాను 41 మంది గైర్హాజరయ్యారు. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిలకపాలెంలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్ లో 124 మంది విద్యార్థులకు గాను 56 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 69 మంది విద్యార్థులకు గాను 31 మంది గైర్హాజరయ్యారు. కోర్ టెక్నాలజీ నరసన్నపేటలో జరిగిన పరీక్షకు 319 మంది విద్యార్థులకు గాను 171 మంది గైర్హాజరయ్యారు. జాబ్‌మేళా నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఆధ్యర్యంలో ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పలాసలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉదయం 9.30నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఫ్యూషన్ ఫైనాన్స్ కంపెనీలో రిలేషన్షిప్ ఆఫీసర్, శ్రీసిటీలోని బ్లూస్టార్ కంపెనీలో ఆపరేటర్, శ్రీసిటీలోని యూనికార్న్ కంపెనీలో ఆపరేటర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 81065 08318 నంబరును సంప్రదించాలని కోరారు. 27న పరిశ్రమల అవగాహన సదస్సు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం మేధో సంపత్తి హక్కులపై ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో రాంప్ పథకం కింద ఏపీఎంఎస్ఎంఈ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ జిల్లా పరిశ్రమల కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ యజమానులు, ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు హాజరుకావచ్చని, ముందుగా డాక్టర్ గడ్డం సుదర్శన్ (9494959108)ని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. -
దాహం తీరే దారేదీ..?
చర్యలు తప్పవు ఈ విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతాం. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు కూడా తెలియజేస్తాం. –డి.హరి, డిప్యూటీ తహసీల్దార్, సంతబొమ్మాళి ●సంతబొమ్మాళి: నౌపడ, మర్రిపాడు, సీతానగరం తదితర గ్రామాల్లో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. ఈ మండలాల్లో చెరువులు, సాగునీటి కాలువలు, గుంటల్లో ఉన్న నీటిని పోర్టు కోసం తీసుకెళ్లిపోతుండడంతో పశువులకు గుక్కెడు కరువైపోతోంది. మూలపేట పోర్టు పనులకు సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ట్యాంకర్ల ద్వారా నీరు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్యాంక్ (2వేల లీటర్లు) రూ.700లకు, లారీ ట్యాంక్ (5వేల లీటర్లు) రూ.1500లు చొప్పున రోజుకు సుమారు 100 లోడులు వరకు పోర్టుకు నీటిని తరలించుకుని వెళ్లిపోతున్నారు. చెరువులు, కాలువల వద్ద ఇంజిన్ సాయంతో ట్యాంకర్లకు నీటిని లోడింగ్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. కాలువలు తవ్వి మరీ ఉన్న నీరు తోడేస్తున్నారు. దీంతో మేత కోసం తిరుగాడే మూగజీవాలకు వేసవిలో తాగేందుకు నీరు లేకుండా పోతోంది. కాపర్లు పశువులను బయటకు తీసుకువెళ్లడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి పశువులను కాపాడి చెరువులు, కాలువల్లో నీరు తోడి అమ్ముకుంటున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు. -
అండగా ఉంటాం.. అధైర్యపడవద్దు
ఇచ్ఛాపురం రూరల్/ఇచ్ఛాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కక్షపూరిత దాడులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తరచూ కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలుపుదల, అధికారులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రామారావు, విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, కూటమి ప్రభుత్వం మాత్రం సొంత కార్యకర్తలకు పెద్దపీట వేయడం దారుణమన్నారు. ఈ విధానాలపై ప్రతిఒక్క కార్యకర్త గళమెత్తాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల మశాఖపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కె.భీమారావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో మంగళవారం బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, వివక్షలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ ఎం.చిన్నంనాయుడికి వినతిపత్రం అందించారు. రౌడీషీట్లు ఓపెన్‌చేస్తామని బెదిరిస్తున్నారని, మహిళలతో అగౌరవంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల పార్టీ కన్వీనర్ పాతిర్ల రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ బోర పుష్ప, సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సల్ల దేవరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సిఫార్సు లేఖ లేకుంటే..?
బదిలీ కోసం ఎమ్మెల్యే సిఫార్సు లేఖ లేకుంటే ఉద్యోగి పరిస్థితి ఏమిటా..? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ఎమ్మెల్యేల వద్ద నుంచి ిసిఫార్సు లేఖలు తీసుకుని వారి వారి ప్రయత్నాలు ప్రారంభించి డ్వామా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీన్నే కొందరు ఎమ్మెల్యేలు క్యాష్ చేసుకుంటున్నారు. బదిలీల సిఫార్సు లేఖల ముసుగులో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైరవీలకు తావిచ్చేలా అధికారులు సూచించడంతో ఉపాధి హామీ పథకం ఉద్యోగుల పరిస్థితి దయానీయంగా తయారైంది. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారంటే భవిష్యత్‌లో వారు చెప్పినట్లు తప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంతర్మథనం చెందుతున్నారు. -
ఉగాది పురస్కారాలకు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి ఆదిత్యానగర్ కాలనీలోని మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ (ఎంసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 30న విశ్వావసు నామ ఉగాది పురస్కారాలను వివిధ రంగాలలో ప్రముఖులకు అందజేస్తున్నట్లు నిర్వాహకులు భాగ్యలక్ష్మి, నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలరంజని సంస్థ ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాలలో ప్రతిభ సాధించిన బాలలకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.వాండ్రంగి కొండలరావు (సాహిత్యరత్న), బద్రి కూర్మారావు (సేవా రత్న), కంటు మురళీగోవింద్ (నాట్యరత్న), ఎర్రపాటి అప్పారావు (నటరత్న), నేరెళ్ల సత్యనారాయణ (గానరత్న), ఆచింటు లక్ష్మణరావు (వాయిద్యరత్న), వడగ సుబ్రహ్మణ్యం (హరికథారత్న), ఇంజరాపు మోహన్‌రావు (వైద్యరత్న), యాపార శ్రీనివాస్ (యువ సేవారత్న), ఎలినాటి ధరణి (బాలరత్న–కోలాటం), బి.సన్నిహిత్ (బాలరత్న–చిత్రలేఖనం), ఎం.లిప్సి శ్రీవల్లి జయదేవ్‌కుమార్ (కూచిపూడి, సంగీతం), శ్రీకాకుళం చిట్టి (బాలరత్న– ఇన్‌స్ట్రాగామ్), బిన్నాడ దీక్షిత్ (శ్లోకపఠనం)లకు పురస్కారాలు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, నగరంలోని సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షుడు ఉమాకవికి నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు విశిష్ట ధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారానికి ఎంపికై నట్లు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ ఒక ప్రకనటలో తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు రేపు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న ఉదయం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కార్యదర్శి, కోశాధికారి, క్రీడా, లైబ్రరీ కార్యదర్శుల పోస్టులకు ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవమయ్యాయి. కార్యదర్శిగా మోటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, లైబ్రరీ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నిక జరగనుంది. ఉప సర్పంచ్‌పై చర్యలకు వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచి మరో పార్టీలో చేరి ఇప్పుడు మేజర్ పంచాయతీ పరిపాలనకు ఆటంకంగా మారిన నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి సాయి ప్రత్యూషకు ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్‌పై పాలకవర్గంలోని 16 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ కోరాడ చంద్రభూషణ గుప్తా, మెంబర్లు వార్డు రఘుపాత్రుని శ్రీధర్, బంకుపల్లి శర్మ, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, ఎంపీటీసీ బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, మాజీ డైరెక్టర్ బబ్బోది ఈశ్వరరావు, సతివాడ రామినాయుడు, తోట భార్గవ్ తదితరులు ఉన్నారు. 27న వర్సిటీలో క్యాంపస్ డ్రైవ్ ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 27న ముత్తూట్ గ్రూఫ్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్లేస్మెంట్ అధికారి విద్యాసాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంద పీవోలు, ఇతర ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంబీఏ 60 శాతం, ఎం.కాంలో 70 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 8247630064 నంబరును సంప్రదించాలని కోరారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రటించిన ఉచిత ఇసుక విధానం కొంతమందికి కాసులు కురిపిస్తోంది. పగటి పూట అధికారులు దాడులు చేస్తారని భావించి రాత్రివేళల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు దర్జాగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల నుంచి ఇసుకను పాతపట్నం మీదుగా ఆల్ ఆంధ్రా రహదారిలో మెళియాపుట్టి గ్రామ వీధుల్లో నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు రూ.2000 చొప్పున అపరాధ రుసుం విధించారు. తర్వాత వారిని వదిలేయడంతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ సాయంత్రమైతే పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఒడిశాకు రాత్రివేళల్లో తరలించుకుపోతున్న వైనం ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు అడ్డుకుంటాం.. గతంలో ఇదేవిధంగా చేస్తే ఒడిశా బోర్డర్ వద్ద మా సిబ్బందితో కలిసి పరిశీలన చేయించాం. ఇసుక తరలిస్తున్న వారిని వీఆర్వోలు అడ్డుకున్నా ఆపకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు రాత్రివేళల్లో, సెలవురోజుల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సాయంతో అడ్డుకుంటాం.. – పాపారావు, మెళియాపుట్టి తహశీల్దార్ కట్టడి చేస్తాం.. ఇదివరకే మహేంద్రతనయ నదీ తీరంలో నిఘా పెట్టాం. మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మావంతు చర్యలు తీసుకుంటున్నాం. – రమేష్ బాబు, మెళియాపుట్టి ఎస్సై -
విద్యుత్ షాక్‌తో అటెండర్ మృతి
అరసవల్లి: ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఎస్ఈ కార్యాలయం నీటి కోసం మోటార్ స్విచ్ వేయడానికి వెళ్లిన కార్యాలయ అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు(47) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో అందరూ విధుల్లో ఉండగా ఈదుర్ఘటన జరగడంతో ఇటు ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అటు జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం మోటార్ వేయడానికి వెళ్లి ఇంకా రాలేదని మరో అటెండర్ శార్వాణి వెళ్లినప్పటికే అచేతనంగా ఆనందరావు పడి ఉండటంతో మిగిలిన సిబ్బందికి సమాచారాన్ని అందించింది. 108 వాహనం సిబ్బంది వచ్చేసరికే మృతి చెందినట్లు వారు ధృవీకరించారు.వన్‌టౌన్ ఎస్సై హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. స్థానిక దేశెల్ల వీధిలో నివాసముంటున్న ఆనందరావు స్వస్థలం నందిగాం మండలం కల్లాడ గ్రామం. భార్య దుర్గ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆనందరావు మృతి పట్ల జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, జెడ్పీ చైర్పర్సన్ కార్యాలయ సీసీ అప్పన్న, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రంగప్రసాద్, డీఈ లలితకుమారి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మరో ఘటనలో.. బూర్జ: మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన బూరి మణికుమార్ (18) విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందాడు. మామయ్య నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇంటి గోడలను నీటితో తడుపుతూ ఇనుప నిచ్చెన తీస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేసరికే మృతిచెందాడు. మణికుమార్‌కు తల్లిదండ్రులు దుర్గారావు, కేసరి, సోదరి ఉన్నారు. చేతికందిన కుమారుడు విద్యుత్ షాక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీకాకుళం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఘటన కల్లాడలో విషాదఛాయలు -
డ్వామా.. సిఫార్సుల చిరునామా
ఆ లేఖ ఉంటేనే బదిలీ, ఆ లేఖ ఉంటేనే పోస్టింగు, ఆ లేఖ ఉంటేనే అన్ని పనులు. కూటమి ప్రభుత్వం తన రూటే సెప‘రేటు’ అనిపించుకుంటోంది. ఉద్యోగుల బదిలీకి ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను తప్పనిసరి చేసింది. దీంతో అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడుతున్నారు. కోరుకున్న చోటుకు వెళ్లడానికి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఆమదాలవలస అంటే మాత్రం హడలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల్లో సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతోంది. ఉద్యోగుల బదిలీల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా సిఫార్సు లేఖల సంస్కృతిని తెరపైకి తెచ్చింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈనెల 20వ తేదీన జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్న ఎపీఓ, ఇంజినీరింగ్ కన్సల్టింగ్ (ఈసీ), టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), కంప్యూటర్ ఆపరేటర్లు (సీఓ) తదితర ఉద్యోగుల బదిలీలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ ఈ బదిలీల్లో ఎమ్మెల్యేలు కలుగజేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే మీరు కోరుకున్న చోటు లభిస్తుందని డ్వామా అధికారులు చేతులేత్తేయటంతో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు గత ఐదు రోజులుగా జిల్లాలోని ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు చేయాల్సిన బదిలీలను ఎమ్మెల్యేలు చేతుల్లోకి తీసుకున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఒక ఉద్యోగి.. మూడు మండలాలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీఓలు ఇప్పుడు పనిచేస్తున్న క్లస్టర్లో ఉండకూడదని పక్క క్లస్టర్‌కు వెళ్లాలని, ఈసీ, టీఏ, సీఓ వంటి మిగిలిన ఉద్యోగులు వారి సొంత మండలాల్లో ఉండకుండా పక్క మండలాలకు వెళ్లాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి వారికి నచ్చిన మూడు మండలాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. దీంతో ఉద్యోగులు వారికి నచ్చిన మూడు మండలాలను ఎంపిక చేసుకుని డ్వామా అధికారులకు వారి అంగీకారాన్ని తెలియజేశారు. బదిలీలు సజావుగా జరిగిపోతాయనుకున్న సమయంలో ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అంటూ సరికొత్త సంస్కృతి తెరమీదకు రావటంతో రాజకీయ నాయకులతో పాటు ఎమ్మెల్యేల కార్యాలయాలు చుట్టూ ఉద్యోగులు తిరుగుతున్నారు. ఆమదాలవలస అంటే హడల్.. జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం ఉద్యోగుల్లో ఒక భయం వెంటాడుతోంది. ఆమదాలవలస నియోజకవర్గం అంటే హడలిపోతారు. అక్కడ పనిచేయాలంటే భయమని చెబుతారు. ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఎక్కడ పనిచేసినా చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తారని, ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తమను దోషులుగా నిలబెడతారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్ డ్వామా బదిలీల్లో సరికొత్త సంస్కృతి ఎమ్మెల్యే లేఖ తప్పనిసరి అంటున్న అధికారులు అధికారుల తీరుతో ఉపాధి హామీ ఉద్యోగుల్లో ఆందోళన ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఉపాధి ఉద్యోగులు -
28న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
కాశీబుగ్గ: దివ్యాంగులకు ఉచితంగా ఈనెల 28న ఉపకరణాలను పంపిణీ చేయనున్నట్టు మదర్ చారిటబుల్ ట్రస్ట్ (దివ్యాంగుల సేవా కేంద్రం)సొండిపూడి వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లారెడ్డి భాస్కరరావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న దివ్యాంగులకు వివిధ రకాలైన ఉచిత ఉపకరణాలు ఇస్తామని అన్నారు. చంక కర్రలు, బ్లైండ్ స్టిక్, వినికిడి యంత్రాలు, చక్రాల కుర్చీ, వాకింగ్ వాకర్స్, సింగల్ వాకింగ్ స్టిక్స్, కృత్రిమ కాళ్లు, చేతులు, పోలియో వారికి కాలిపర్స్ వంటి ఉపకరణాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈనెల 27 తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థి పూర్తి వివరాలు 9989371952 ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో గాని ఫోన్ చేసి గానీ తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకున్న వారికి మరుసటిరోజు 28 తేదీన ఉపకరణాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. -
డీఈఓ తీరుపై టీచర్ల మండిపాటు
భారీ సంఖ్యలో ర్యాలీగా వస్తున్న ఉపాధ్యాయులు శ్రీకాకుళం న్యూకాలనీ: కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటనలో డీఈఓ తీరును టీచర్లు నిరసిస్తూ మంగళవారం భారీ ఎత్తున జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో వైఎస్సార్ స ర్కిల్ వద్ద మొదలైన ఈ ర్యాలీ జీటీరోడ్, సూర్యమహల్ మీదుగా డీఈఓ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ నిరసన చేపట్టారు. ముందుస్తుగా పోలీసులు మోహరించడంతో డీఈఓ కార్యాల యం లోపలకు అనుమతించలేదు. జిల్లా పరు వును, ప్రతిష్టను జిల్లా విద్యాశాఖాధికారిగా తిరుమల చైతన్య మంటగలిపారని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు కొప్పల భానుమూర్తి, గొంటి గిరిధర్, తంగి మురళీమోహన్, చౌదరి రవీంద్ర, పిసిని వసంతరావు, మజ్జి మదన్మోహన్, దుంపల శివరామ్‌ప్రసాద్, ఎస్వీ రమణమూర్తి, బలివాడ ధనుంజయరావు, ఎంవీ రమ ణ, గురుబెల్లి దామోదరరావు, సూర పాపారావు, తదితరులు ఆరోపించారు. కుప్పిలిలో డీబారైన విద్యార్థులు, తల్లిదండ్రులు, సస్పెండైన టీచర్లు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల డీబార్లను రద్దు చేసి, వారికి న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లను కలిసి విషయాన్ని తెలియజేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నేతలు బొడ్డేపల్లి గోపీచంద్, రమణ, బి.భాస్కరరావు, సూర స్వర్ణకుమారి, బి.వెంకటేశ్వరరావు, శ్రీరామ్మూర్తి, దామోదరరావు, ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, తంగి రాజారావు, శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మార్చి 26 సాయంత్రం 4 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో భారీ ధర్నా నిర్వహించనున్నారు. 27 సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు, అలాగే మార్చి 29న సాయంత్రం 4 గంటలకు డీఈఓ కార్యాలయం ముట్టడి, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటన జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ టీచర్ల సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్ -
పోక్సో చట్టంపై అవగాహన
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ 4వ లైన్లో ట్రైబల్ హాస్టల్ల్లో పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–పోక్సోపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. అశ్లీల చిత్రాలు చూపించడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ.రాజారావు, ఆర్.అప్పలస్వామి, జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ అందని అధనం
ఫిర్యాదు చేసినా.. అదనపు పరిహారం అందలేదని కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేశాం. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అదనపు పరిహారం అందలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించిన అదనపు పరిహారం అందించి న్యాయం చేయాలి. – చింతాడ దమయంతి, శ్రీహరిపురం, ఆమదాలవలస మండలం రాజకీయ కారణాలతోనే.. కొందరు అధికారులు, సిబ్బంది తీరు కారణంగా ఇంతవరకు పరిహారం అందలేదు. రాజకీయ కారణాలతోనే జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పరిహారం అందలేదు. – పొలం శ్రీనివాసరావు, గాజులకొల్లివలస, ఆమదాలవలస మండలం అన్యాయం.. నిర్వాసిత కాలనీకి భూములు అందజేసిన బాధితులకు అదనపు పరిహారం ప్రకటించినా రెవెన్యూ సిబ్బంది వివరాలు తప్పుగా నమోదు చేయటం వల్ల ఇంతవకు పరిహారం అందలేదు. భూములు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులను ఇప్పటికై నా ఆదుకోవాలి. – లంక అప్పలరాజు, గాజులకొల్లివలస, ఆమదాలవలస మండలం ఆమదాలవలస రూరల్: కొంతమంది అధికారుల నిర్లక్ష్యం.. భూములు అందజేసిన రైతుల పాలిట శాపంగా మారింది. తమ తోటి రైతులు అదనపు పరిహారం అందుకున్నా తమకు మాత్రం అందకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై కార్యాలయాలు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తున్నా కాలయాపన చేస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదని వాపోతున్నారు. తరతరాలుగా పచ్చని పంటలు పండించే భూములు ఎంతో ఉదారతమైన ఆశయంతో ప్రభుత్వానికి అప్పగిస్తే తమకు ఇలా చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వంశధార రెండో దశ నిర్వాశితుల కాలనీ కోసం భూములు అందించిన పలువురు రైతులకు అదనపు పరిహారం అందక కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదీ పరిస్థితి.. హిరమండలం రిజర్వాయర్ కోసం తులగాం గ్రామంలో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామంలో సంగమేశ్వర ఆలయం వద్ద సుమారు 115 ఏకరాలు భూమిని గుర్తించారు. ఇందులో రైతుల వద్ద నుంచి సుమారు 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కాలనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు రూ.5,25,000 పరిహారం కింద 2009లో అప్పటి ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ పరిహారం ఏ మాత్రం చాలకపోవటంతో 2022లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎకరాకి రూ.1,00,000 చొప్పున అదనపు పరిహారం అందించాలని నిర్ణయించారు.దీ మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అధికారుల నిర్వాకం.. అధికారులు చేసిన తప్పులు కారణంగా సుమారు 30 మంది బాధిత రైతులు అదనపు పరిహారానికి నోచుకోలేకపోయారు. రెవెన్యూ శాఖ నుంచి భూసేకరణ శాఖకు పంపాల్సిన బాధితుల జాబితాలో బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐ.ఎఫ్.ఎస్సి.కోడ్, ఆధార్ నంబర్ వంటివి తప్పుగా నమోదు చేయటంతో బాధితులకు ఇంతవరకు అదనపు పరిహారం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేస్తాం.. ఈ విషయమై ఆమదాలవలస తహశీల్దార్ ఎం.రాంబాబు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అదనపు పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. వంశధార నిర్వాసిత కాలనీకి భూములు ఇచ్చిన రైతులకు తప్పని ఎదురుచూపులు అధికారుల నిర్వాకం కారణంగా అదనపు పరిహారానికి నోచుకోని వైనం న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత రైతులు -
వేలం పాడుకో.. నచ్చినంత దోచుకో
ఇచ్ఛాపురం టౌన్: మున్సిపాలిటీలో ఆశీలు వ్యాపారం మూడుపువ్వులు ముప్పై కాయలుగా సాగుతోంది. మున్సిపాలిటీలో 23 వార్డుల్లోని ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన ప్రదేశాల్లో పంటలు అమ్మినా, చిన్న బడ్డీ కొట్లు పెట్టినా మున్సిపాలిటీకి ఆశీలు చెల్లించాలి. ఈ పన్నుల వసూలుకు ఏడాదికి ఓ సారి వేలం నిర్వహిస్తారు. ఈ పన్నులకు సంబంధించి ధరల బోర్డు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలి. కానీ ప్రదర్శించడం లేదు. రశీదులు కూడా ఏదో కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల తనిఖీలు కూడా కానరావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇదే అదనుగా దోచుకుంటున్నారు. ధరల బోర్డు పెడతాం ఆశీలుకు సంబంధించి ధరల బోర్డు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు. ఆశీలు వసూళ్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. -
తూర్పు కాపుల ఐక్యతను చాటిచెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో తూర్పుకాపుల ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఉందని జిల్లా తూర్పుకాపు సామాజికవర్గం ప్రతినిధులు సురంగి మోహనరావు, డోల జగన్మోహన్, లంక గాంధీ, శాసపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావులు అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో తూర్పుకాపుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో ముందుగా తూర్పు కాపు జాతి ఐక్యత చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పుకాపులు నేడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 38 మండలాల్లో జాతి ఐక్యత చైతన్య సదస్సులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ డవలప్మెంట్ అథారిటీ సారథ్యంలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. త్వరలో దీనికి సంబంధించిన టూర్ ప్రోగ్రాం విడుదల చేస్తామన్నారు. పరిహారం ఇవ్వకపోవడం దారుణం వంశధార ప్రాజెక్టు రెండో దశ నిర్మాణం వలన దెబ్బతిన్న నిర్వాసితులకు ఇంతవరకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికై నా అర్హులైన నిర్వాసితులకు గత ప్రభుత్వం పెంచిన పరిహారాన్ని సత్వరమే అందించి ఆదుకోవాలని కోరారు. నిర్వాసితులకు కేటాయించిన కొత్తూరు మండలం గూనభద్ర కాలనీ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని తీర్మానించారు. హిరమండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. తూర్పు కాపు సామాజికవర్గం భవన నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతలు వెంటనే కమిటీ ప్రతినిధులకు అందజేయాలని, చిరకాల స్వప్నం కాపు భవన్ నిర్మాణం త్వరలో సాకారం కాబోతుందన్నారు. లావేరు మండలం నుంచి తూర్పు కాపు చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా భవనం నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణ కూడా పునః ప్రారంభమవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులు డోల తిరుమలరావు, పొగిరి సుగుణాకరరావు, కిళ్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, పడాల తమ్మునాయుడు, వాళ్ల శ్రీరాములునాయుడు, రౌతు గోపి, సురవరం పార్వతీ, గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్, ఎస్.సత్యనారాయణ, పిసిని వసంతరావు, కురిటి దుర్గారావు, డాక్టర్ చందక రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పల్లి సురేష్, పాండ్రంకి రమేష్ నాయుడు, డోల బాలమురళీకృష్ణ, ఎం.శంకర్‌నారాయణ, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నడుమ టెన్త్ పరీక్షలు
ఓటీపీ.. వెతలు కాశీబుగ్గ: పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ఓపీ కోసం రోగులకు వెతలు తప్పడం లేదు. రోగి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెబితేనే ఓపీ చీటి ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువు రాని, మారుమూల పల్లెలు నుంచి సెల్‌ఫోన్ లేకుండా వస్తున్న రోగులను పక్కకు జరిగి ఉండాలని చెబుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 200–300 వరకు నమోదయ్యే ఓపీలు, ఒక్కసారిగా 90–100 లోపునకు మాత్రమే నమోదు అవుతుండడంతో అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అనారోగ్యంతో ఆస్పత్రి వస్తున్నవారికి ఓపీ చీటీ కోసం క్యూలైన్ లేకుండా సులభతరం చేయాలని, సెల్‌ఫోన్ లేకపోయినా వైద్య సేవలు సక్రమంగా అందేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అధికారుల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో జరిగిన మ్యాథ్స్ పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 28,584మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 28,384 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 199 మంది గైర్హాజరయ్యారు. సోమవారం మ్యాథ్స్ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈఓ స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు మస్తానయ్య కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలతో పాటు పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. డీఈవో డాక్టర్ తిరుమలచైతన్య జలుమూరు, సారవకోట మండల పరిధిలో ని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పిలిలో ప్రశాంతం ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గణితం పరీక్షను రాష్ట్ర పరిశీలకులు, మస్తానయ్య, మండల విద్యా శాఖ అధికారి కె.పున్నయ్య పరీక్ష పరిశీలించారు. ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 9 గదుల్లో 425 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు 21 మందిని మార్పు చేశారు. ిసట్టింగ్ స్క్వాడ్‌గా వ్యవహరించిన డీఈఓ సారవకోట: మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి లెక్కలు పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్‌గా డీఈఓ తిరుమల చైతన్య వ్యవహరించారు. ఇక్కడ పరీక్షలు జరుగుతున్న విధానంపై అనుమానం రావడంతో పాటు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పరీక్ష కేంద్రాన్ని తొలుత పరిశీలించి అనంతరం పరీక్ష ముగిసే వరకు అక్కడే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బెట్టింగ్‌లకు పాల్పడవద్దు
గుర్తుంచుకోండి ● తెలియని లింక్‌లపై క్లిక్ చేస్తే చిక్కులు ● డేటా కాజేసి దోచేస్తారు ● అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు శ్రీకాకుళం క్రైమ్: ● జిల్లా కేంద్ర సమీపంలోని అపార్ట్మెంట్లో ఒక వివాహిత నివాసముంటోంది. ఆమెకు ఫ్యాషన్స్‌పై మోజు ఉండడంతో ఎఫ్బీలో తక్కువ ధరకే సిల్క్ శారీస్ అంటూ ఆఫర్‌తో కూడిన ఒక లింక్ వస్తే క్లిక్ చేసింది. దీనికోసం ఆమె రూ.1,200 లు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. అయితే కొద్దిరోజులకే వచ్చిన పార్సిల్లో కనీసం రూ.200 లు విలువైనా చేయని చీర రావడంతో లబోదిబోమంది. ● నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. విజిల్ అప్డేట్స్ పేరుతో లోన్ అప్రూవ్డ్ అంటూ ఒక మెసేజ్ అతడి సెల్‌ఫోన్‌కు వచ్చింది. డియర్.. యువర్ 25,000 లోన్ హేజ్ బీన్ అప్రూవ్డ్ సక్సెస్‌ఫుల్లీ, చెక్ యువర్ డీటైల్స్ హియర్ అంటూ ఓ లింక్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే అతని అకౌంట్, ఆధార్, యూపీఐ డీటైల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అకౌంట్లో ఉన్న రూ.60 వేలు మాయమయ్యాయి. ఇలా మెసేజులు, ఈ–మెయిల్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో తక్కువ అక్షరాలతోనే షార్ట్ వెబ్ లింక్‌లు పంపించి సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి మోసాలు కోకొల్లలు. చిన్నవిగా వచ్చే ఈ లింక్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా చోరీ వాస్తవానికి పెద్దవిగా, గజిబిజి అక్షరాలతో ఉండే వెబ్‌లింక్‌లను చిన్నవిగా షార్ట్ లింక్‌ల మాదిరిగా చేసి ఎవరికై నా పంపే ఆప్షన్లు ఇప్పుడొచ్చేసాయి. దీంతో దీనినే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఏమార్చుతున్నారు. షార్ట్లింక్స్లో మాల్వేర్లను పంపి వైరస్‌లను వ్యాప్తి చేస్తున్నారు. దీనిద్వారా మన ఫోన్ లేదంటే కంప్యూటర్లో ఉన్న పర్సనల్ డేటా హ్యాక్ చేస్తారు. ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్ క్లిక్ చేస్తే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి తెలియక మన వివరాలన్నీ ఎంటర్ చేసేస్తాం. హ్యాకర్లు ఈ లింక్‌లతో మన సిస్టమ్‌ను వారి కంట్రోల్లోకి తీసు కుని క్రిప్టో మైనింగ్ ద్వారా డబ్బులు దోచేస్తారు. హలో అంటూ అందినకాడికి.. వేసవి సమీపిస్తుండడంతో మన ఇంట్లో ఉపయోగించే ఏసీ, ఫ్రిజ్, టీవీల వంటివి రిపేర్ అవుతుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్ కేర్ నంబర్ కోసం నెట్లో వెదికితే అవే కంపెనీల పేరిట ఫేక్ కాల్ సెంటర్ల నుంచి సైబర్ ఫ్రాడ్స్ ఎరవేస్తారు. టెలీ కాలర్స్లా మాట్లాడి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ, యూపీఐ పిన్ అడుగుతారు. ఎన్నో ప్రముఖ కంపెనీల పేరిట పుట్ట గొడుగుల్లా ఫేక్ కస్టమర్ కేర్ సెంటర్లు నడుస్తుండడం, ఇంటర్నెట్లో దర్శనమిస్తుండడంతో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యువత కాల్ సెంటర్లలో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశించి, టెలీ కాలర్స్‌గా చేరితే తీరా అవి మోసపూరితమైనవని తెలిశాక అవాక్కవుతున్నారు. సైబర్ అలెర్ట్ సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, వాట్సాప్, ఈ–మెయిల్‌కు వచ్చే లింకుల్లో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలి. తెలియని లింక్‌లు క్లిక్ చేయకూడదు. ఒక వేళ తెలియక క్లిక్ చేసినా డబ్బులు పంపించకూడదు. ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పిన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే సైట్స్‌లో ఎంటర్ చేయరాదు. తెలియని క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయరాదు. క్రెడిట్ కార్డులో నగదు పెంచేందుకు గడువు ఒక్కరోజే ఉంది. ఓటీపీ చెబితే వెంటనే అప్డేట్ చేస్తామంటారు. ఇలాంటివి నమ్మవద్దు. మీరు ఆన్లైన్లో కొన్న వస్తువుకు గిఫ్ట్ వచ్చింది. అడ్రస్ చెబితే ఇంటికి పంపిస్తామని ఫేక్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. చిరునామా గానీ, బ్యాంకు ఖాతా వివరాలు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. ఎవరైనా పైన పేర్కొన్న సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదంటే https://www.cybercrime. gov.inలో ఫిర్యాదు చేయాలి. మీ పరిధిలో ఉండే పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సంబంధిత బ్యాంకువారిని మోసపోయిన గంటలోనే సంప్రదించాలి. శ్రీకాకుళం క్రైమ్: ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో యువత బెట్టింగ్‌లకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, మ్యాచ్‌లను వినోద ప్రక్రియలో చూడాలి తప్ప కుటుంబంలో విషాదం నింపేదిగా ఉండరాదన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల జోలికి పోకూడదని సూచించారు. బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయమొచ్చినట్లు అనిపించినా, పలుమార్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. నష్టాలను భర్తీ చేసేందుకు, అప్పులు తీర్చేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్‌లకు పాల్పడినా, బెట్టింగ్‌లను నిర్వహించినా ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్‌లకు పాల్పడినట్లు సమాచారముంటే డయల్ 112/100కు లేదా సంబంధిత పరిధి పోలీసులకు తెలపాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి -
మట్టి మాఫియా
దంతలోమట్టి తరలిస్తున్న టిప్పర్సోమవారం రాత్రి చీకటిలో మట్టి తవ్వకాలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళి మండలంలోని దంత గ్రామంలో గల పెద్ద చెరువు నుంచి అక్రమంగా రాత్రి పూట మట్టి తరలిస్తున్నారు. కీలక నేత పేరు చెప్పుకుని మట్టి రవాణా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా ఇప్పుడా అక్రమాల్లో మట్టి కూడా చేరింది. టెక్కలి నియోజక వర్గంలో ఇప్పటికే మైనింగ్ దందా నడుస్తోంది. అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రానైట్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తున్నారు. పర్మిట్లతో పని లేకుండా బ్లాకులు తరలిపోతున్నాయి. ముఖ్యంగా కోటబొమ్మాళి మండలంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పుడు అదే మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రిపూట పెద్ద పెద్ద చెరువులను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అందులో భాగంగా దంత గ్రామంలోనీ పెద్ద చెరువును కూడా తవ్వేసి వందల లారీల్లో తరలించేస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో అధిక సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా పట్టుకునే నాథుడు లేకుండా పోయారు. టిప్పర్ల ద్వారా పెద్ద చెరువు నుంచి రాత్రి పూట మట్టి తరలిస్తున్నారని స్థానికులు అటు పోలీసులకు, ఇటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మాఫియా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చీకటిలో వెళ్తున్న టిప్పర్ -
నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు
హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్‌గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు. న్యాయం చేయండి నందిగాం: చట్టబద్ధంగా కొనుకున్న ఇంటిని ఖాళీ చేయించి, దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని మండలంలోని కొత్తగ్రహారానికి చెందిన ఏదూరు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమేశ్వరరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. 2022 మార్చి 30వ తేదీన కొత్త అగ్రహారంలో ఉన్నటువంటి ఇల్లు, ఖాళీ స్థలాన్ని పొట్నూరు ఆనందరావు, అతని సోదరులు, సోదరి తనకు అమ్మినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారని తెలియజేశారు. అప్పటినుంచి ఆ ఇంట్లోనే తాను, తన పిల్లలు, అత్తతో కలిసి ఉంటున్నానని తెలిపారు. భర్త గల్ఫ్ దేశంలో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే గ్రామానికి చెందిన దుంప కృష్ణారావు మరలా ఆనందరావుతో కోటబొమ్మాళి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఇంటి నుంచి తమను వెళ్లగొట్టడానికి పలుమార్లు దాడులు చేశారని వాపోయారు. కోర్టులో కేసు నడుస్తున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవారు, పిల్లలపై ఈ దాడులు మరింత తీవ్రంచేస్తూ దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడిని కలిసినా న్యాయం జరగలేదని తెలిపారు. అనంతరం దుంప కృష్ణారావు తదితరులు ఇంట్లో సామాన్లు పగలుగొట్టి, దాడులు చేసి ఇంటి నుంచి గెంటేశారని తెలిపారు. దీంతో ప్రస్తుతం వేరే వాళ్ల ఇంట్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మృతుడు అంబకండి వాసిగా గుర్తింపు పొందూరు: స్థానిక రైల్వేగేటు సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రేగిడి ఆమదాలవలస మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన బోడిసింగి వెంకటరమణ(25)గా గుర్తించినట్లు సోమవారం జీఆర్పీ ఎస్ఐ ఎస్.మధుసూదనరావు తెలిపారు. మృతుడు విజయవాడలో తాపీ పనులు చేస్తుంటాడని, వారం రోజుల క్రితం ఊరు వచ్చాడని పేర్కొన్నారు. తిరిగి మరలా విజయవాడ వెళ్లేందుకు పొందూరు రైల్వేస్టేషన్‌కు వచ్చాడన్నారు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు తండ్రి చిన్నారావు ఫిర్యాదు చేశారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపు నేడు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు. -
డప్పు కళాకారులను ఆదుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డప్పు కళాకారులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం గురువులు, గొర్లె రవి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో జిల్లాస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డప్పు ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని చైతన్య పరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో డప్పు కళాకారులు ఉన్నారని, ప్రధానంగా వీరంతా తరతరాలుగా డప్పు కళను వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.7 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. 2014 టీడీపీలో పెన్షన్లు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరలా సర్వే పేరుతో పెన్షన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు యథావిధిగా కొనసాగించాలని, కొత్త పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమన్నారు. సమావేశంలో ఆరవ డిల్లీ, బాలు, దమ్ము కృష్ణ, బోనేల రామయ్య, సవాలపురపు అప్పన్న, కాళ్ల అప్పారావు, గెడ్డపు రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● వ్యక్తికి తీవ్రగాయాలు కంచిలి: మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం అర్థరాత్రి ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు, రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన కప్పల జగదీష్ రెడ్డి అనే యువకుడు ఆదివారం కొల్లూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను జాడుపూడి వద్ద భోళా శంకర్ దాబాకు ఆదివారం రాత్రి డిన్నర్‌కు వచ్చాడు. డిన్నర్ పూర్తి చేసుకొని తన బైక్ మీద జాడుపూడి కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఇచ్ఛాపురం నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కప్పల జగదీష్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్‌లో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వేకువజామున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. -
టెన్త్ పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైన విద్యార్థిని
మెళియాపుట్టి: మండలంలోని పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న శ్వేత అనే విద్యార్థిని అస్వస్థతకు గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. నందిగాం మండలం సవరలింగుపురం గ్రామానికి చెందిన శ్వేత మెళియాపుట్టి మండలం పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతుంది. సోమవారం గణితం పరీక్ష రాస్తూ.. కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సపర్యలు చేశారు. పరీక్షలకు ముందు అనారోగ్యం బారిన పడడంతో తల్లిదండ్రులు పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందజేసినట్లు విద్యార్థి తెలిపింది. నీరసంగా ఉండడంతోనే కళ్లు తిరిగాయని వైద్య సిబ్బంది తెలిపారు. సపర్యల అనంతరం ఆమె మళ్లీ పరీక్ష రాసింది. -
గంజాయితో యువకుడు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తూ ఒక యువకుడు సోమవారం పట్టుబడినట్లు సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్, సబరాపల్లికి చెందిన ఆమద్ ఆనంద్ సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయితో పట్టుబడ్డాడు. స్వగ్రామం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకు తరలించేందుకు రూ.3 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, పలాస రైల్వేస్టేషన్ రన్నింగ్ రూం పక్కరోడ్డులో నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చే సమయంలో పోలీసులను చూసి రెండు బ్యాగులు వదిలి ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వెంబడించగా నిఖిల్ పాని తప్పించుకోగా, ఆమద్ అనంద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 21.7 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకందారులు, మధ్యవర్తులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సోమవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు షిఫ్ట్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు షిఫ్ట్–2లు పరీక్షా సమయంగా నిర్ణయించామన్నారు. పరీక్షకు అరగంట ముందుగా గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఈశ్వరి, పద్మప్రియ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి టీవీ బాలకష్ణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు -
దుప్పలపాడులో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం అల్లు మహేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అల్లు మహేశ్వరరావు, అతని భార్య లక్ష్మి ఇరువురు తమ ఇంటికి తాళం వేసి ఉదయం కూలి పనులకు వెళ్లిపోయారు. వారు సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడ్డారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న నగదుతో పాటు సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. -
● మా.. ఊరికి రండి..!
విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1990లో చదువుకున్న విద్యార్థులంతా, మూడున్నర దశాబ్ధాల తర్వాత మరలా మెడికల్ కళాశాలలో కలుసుకొని గత స్మృతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, డాక్టర్ హర్షవల్లి నేతృత్వంలో మా ఊరికి రండి పేరిట పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం వైభవంగా జరిగింది. రోజంతా ఆనందోత్సహాల నడుమ గడిపిన వైద్యులంతా, ప్రజలకు మరింత వైద్య సేవలు అందజేసేందుకు వినూత్న ఆలోచనలు చేశారు. వైద్యరంగంలో ప్రజా ఆరోగ్య సమస్యలను రూపుమాపేందుకు ప్రతిజ్ఞ చేశారు. –శ్రీకాకుళం అర్బన్ -
నిశిరాత్రి విధ్వంసం
కొత్తూరు అతలాకుతలం విద్యుత్ తీగ నుంచి మంటలు స్థానిక ఆదిఆంధ్ర వీధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వానకు విద్యుత్ తీగ తెగి పడిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సోమవారం ఉదయం 6గంటలు సమయంలో కరెంటు రావడంతో ఒక్కసారిగా ఆ విద్యుత్ వైరు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ వైరు పడిన భాగంలో ఉన్న కాగితాలు, కవర్లు మంటకు అంటుకున్నాయి. ఎవరైనా అటువైపుగా వెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ లైన్లు సరిచేశారు. –టెక్కలి రూరల్అరసవల్లి: ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉరుముల వాన జిల్లాకేంద్రంపై విరుచుకుపడింది. భారీ గాలు లు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో బీభత్సం సృష్టించింది. ఈ వాన దెబ్బకు జిల్లా కేంద్రం అంతా చీకటిగా మారిపోయింది. గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పలు చోట్ల భారీ చెట్లు, కొమ్మలు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పిడుగుల ధాటికి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో సోమవారం జిల్లా కేంద్రం సరిహద్దుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రహదారులన్నీ స్తంభించిపోయాయి. జిల్లాలో టెక్కలి, పలాస డివిజన్లలో ఈ వర్షం ప్రభావం పెద్దగా లేకపోవడంతో తీర ప్రాంతాల్లో పెద్ద ప్రభావం చూపలేదు. అయితే స్థానిక డివిజన్లో మాత్రం విద్యుత్ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చి ంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఇల్లిసిపురం, ఏఎస్ఎన్ కాలనీ, బొందిలీ పురం, పాలకొండ రోడ్డు, బలగ కూడలి, ఆసుపత్రి జంక్షన్, కత్తెర వీధి ఫీడర్ తదితర నగర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం రూరల్ గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో సుమారు 30 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పిడుగులు పడి సుమారు 16 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో పాటు భారీ వృక్షాలు నేలకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఫలితంగా విద్యుత్ శాఖకు రూ.35లక్షలు నుంచి రూ.40 లక్షల వరకు నష్టం వచ్చిందని అంచనా వేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్‌లు తెలియజేశారు. శరవేగంగా పునరుద్ధరణ అకాల వర్షాలకు శ్రీకాకుళం డివిజన్లో ప్రధానంగా జిల్లా కేంద్రంలోనే అత్యధిక ప్రభావం కనిపించింది. పిడుగుల ధాటికి ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో పాటు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. అలాగే గాలుల కారణంగా ఫ్లెక్సీలు విద్యుత్ వైర్లపై పడటంతో కూడా విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సోమ వారం వేకువజాము నుంచే విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదేశాల మేరకు టెక్నికల్ ఈఈ సురేష్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులు యుద్ధప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు బృందంతో కలిసి ఇల్లిసిపురం, బొందిలీపురంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో సోమవారం సాయంత్రానికి దాదాపుగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో మాత్రం సోమవారం రోజంతా విద్యుత్ సరఫరా జరగలేదు. రోజంతా కాంప్లెక్స్‌లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం కలిగించాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడడంతో కొత్తూరు, కర్లెమ్మ, బడిగాం, మహసింగి, సిరుసువాడ, కుంటిభద్ర, నివగాం, మెట్టూరు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సాగు చేస్తున్న వందలాది ఎకరాల అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గాలులకు నష్టపోయిన పంటలకు ప్రభు త్వం నష్ట పరిహారం చెల్లించాలని బాధిత రైతు లు తోకల ధర్మారావు, భాస్కరరావు, పెద్దకోట ఆనందరావుతో పాటు పలువురు కోరుతున్నా రు. ఈదురు గాలులకు మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. – కొత్తూరు కోలుకోలేని నష్టం చేతికి అందిన అరటి పంట ఈదురుగాలులకు నేలమట్టమైంది. ఎకరాకు సుమారు రూ. 75 వేల వరకు పెట్టుబడి పెట్టాము. ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన అరటి పంట గాలులకు నేలకొరిగిపోయింది. ఎకరాకు సుమారు రూ. 2 లక్షలు వరకు నష్టపోయాం. మమ్మల్ని ఆదుకోవాలి. – పెద్దకోట ఆనందరావు, అరటి రైతు, కొత్తూరు జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వాన శ్రీకాకుళం, రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల తెగిపడిన విద్యుత్ వైర్లు, కూలిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు రూ.40 లక్షల వరకు విద్యుత్ శాఖకు నష్టమని అంచనా