అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా

Published Sun, Apr 13 2025 1:32 AM | Last Updated on Sun, Apr 13 2025 1:32 AM

అదుపు

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా

నరసన్నపేట: మండలంలోని జాతీయ రహదారిపై మడపాం వద్ద గుడ్ల లారీ అదుపుతప్పి సర్వీసు రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడగా, లారీ చాలా వరకు నుజ్జు అయింది. దీంతో గుడ్లకు నష్టం వాటిళ్లింది. విజయవాడ నుంచి కోల్‌కతాకు గుడ్లుతో వెళ్లున్న లారీ శనివారం వేకువజామున మెయిన్‌ రోడ్డు నుంచి అదుపు తప్పి సర్వీసు రోడ్డులో బోల్తా పడింది. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. అయితే రాత్రి సమయం కావడంతో స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు.

గంజాయితో వ్యక్తి అరెస్టు

ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలో 16.330 కేజీల గంజాయితో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలియజేశారు. స్థానిక పోలీసు సీఐ కార్యాలయంలో శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ సమయంలో ఒడిశాలోని గజపతి జిల్లా మోహన బ్లాక్‌ అలిగెండా గ్రామానికి చెందిన బినసెంత బాన్‌సింగ్‌ అనే వ్యక్తి బ్యాగులో 16.330 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా అలిగెండా గ్రామానికి చెందిన టోప్పో అనే వ్యక్తి సూచనల మేరకు హైదరాబాద్‌ తీసుకెళ్లి ఒక వ్యక్తికి అందజేయడానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా చాకచక్యంగా వ్యవహరించిన ఇచ్ఛాపురం పోలీసులను ఎస్పీ అభినందించారన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.

వ్యక్తికి గాయాలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్లకు చెందిన పొన్నాడ గంగారావు శుక్రవారం ఎచ్చెర్ల పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొన్నాడు. దీంతో 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి వైద్య నివేదిక, క్షతగాత్రుని భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

కింగ్‌ కోబ్రా హల్‌చల్‌

సోంపేట: మండలంలోని కొర్లాం అయ్యప్ప దాబా వద్ద భారీ కింగ్‌ కోబ్రా శనివారం హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు, దాబా సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. అయ్యప్ప దాబా యాజమాన్య సిబ్బంది పాములు పట్టే నర్సింగ్‌ మహాపాత్రోకు సమాచారం అందజేశారు. మహాపాత్రో పాము ఉన్న స్థలానికి చేరుకుని చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం అటవీశాఖ అధికారి జోగారావు సమక్షంలో జలంత్రకోట రిజర్వ్‌ ఫారెస్టులో విడిచిపెట్టారు.

రైలు నుంచి జారిపడిన మహిళ

కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్‌ కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు రైలు నుంచి ఒక మహిళ జారిపడిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కలకత్తా నుంచి తమిళనాడు రాష్ట్రం చైన్నె వెళ్తుండగా సూపర్‌ఫాస్ట్‌ రైలు నుంచి జారిపడింది. విశ్వాస్‌ పాయల్‌ అనే మహిళగా గుర్తించిన పలాస 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పలాస వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు.

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా 1
1/3

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా 2
2/3

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా 3
3/3

అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement