
జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఆగూరు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ సెల్ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది, ప్రస్తుత జిల్లా బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావును నియమించారు. ఈ మేరకు సోమవారం జిల్లాకు వచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లాగా వెంగళరావు ఓ ప్రయివేటు భవనంలో బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమామహేశ్వరరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈయన నియామకం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగి శివప్రసాద్, పిట్టా దామోదర్‌రావు, కార్యవర్గ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం న్యాయవాదుల విభాగం జిల్లా అధ్యక్షుడు వాన కృష్ణచంద్, న్యాయవాదులు మామిడి క్రాంతి, బీసీ సంఘం నేత భద్రి సీతమ్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.