ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు

Apr 15 2025 1:50 AM | Updated on Apr 15 2025 1:50 AM

ఇంటర్

ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు

శ్రీకాకుళం రూరల్‌: ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన విద్యార్థులకు రాగోలు జెమ్స్‌ ఆస్పత్రి బొల్లినేని మెడిస్కిల్స్‌లో జీడీఏ, ఐసీయూ, ఓటీ అసిస్టెంట్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటి వ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కు బీఎస్సీ డిప్లమా పారామెడికల్‌ నర్సింగ్‌ బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించాలని కోరారు.

మాజీ సైనికుల భవనానికి

శంకుస్థాపన

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని రాగోలు పంచాయతీ రాయిపాడులో సైనిక్‌ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు సోమవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులతో కలిపి రూ.2 కోట్ల 92 లక్షల నిధులతో ఈ భవనాన్ని నూతనంగా సైనిక్‌ భవన్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, సైనిక్‌ సంక్షేమ సంచాలకులు వెంకటరెడ్డి, ప్రెసిడెంట్‌ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ఆక్రమణల తొలగింపు

శ్రీకాకుళం రూరల్‌: నగర పరిధిలోని డీసీసీబీ కాలనీలో భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, నర్సస్‌ కాలనీకి వెళ్లే రహదారి ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పలు ప్రజాసంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు మున్సిపల్‌ యంత్రాంగం దిగొచ్చింది. అధికారులు సోమవారం ఉదయం జేసీబీతో వెళ్లి ఆక్రమణలు తొలగించారు. దీంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.

శ్రీనివాస్‌కు సాహితీ లహరి పురస్కారం

శ్రీకాకుళం కల్చరల్‌ : నగరానికి చెందిన ఎన్‌టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ తెలుగు ఉపాధ్యాయుడు చాడ శ్రీనివాస్‌కు సాహితీ పురస్కారం దక్కింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సూర్యాపీఠం సమావేశ మందిరంలో సాహితీ లహరి, మంచిపల్లి సేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ డి.వి.జి.శంకరరావు, పక్కి రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

బొలెరో ఢీకొని

వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌: స్థానిక మండపొలం కాలనీ సమీపంలో పాత జాతీయ రహదారిపై సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చేరివీధికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జి.సింహాద్రి సైకిల్‌పై మండపొలం కాలనీ నుంచి తన వీధి వైపు వెళ్తుండగా వెనుక నుంచి బొలెరొ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సింహాద్రికి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జి ల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు   1
1/1

ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement