చిన్నబోయిన సన్నాలు | - | Sakshi
Sakshi News home page

చిన్నబోయిన సన్నాలు

Published Tue, Apr 15 2025 1:50 AM | Last Updated on Tue, Apr 15 2025 1:50 AM

చిన్న

చిన్నబోయిన సన్నాలు

● మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కరువు ● పెరిగిన విస్తీర్ణంతో ఎగుమతులకు తగ్గిన డిమాండ్‌ ● దళారుల చెప్పిన ధరకు అమ్ముకుంటున్న రైతులు

పోలాకి :

న్నబియ్యం రకం ధాన్యం సాగు చేస్తున్న రైతు లు చిన్నబోతున్నారు. సరైన మద్దతు ధర లేక దిగా లు చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ధరలు పతనం కావడంతో నష్టాలు చవిచూస్తున్నారు. గత్యంతరం లేక దళారులు చెప్పిన ధరకే ధాన్యం అమ్ముకుంటున్నారు.

డిమాండ్‌ ఉన్నా..

హోటల్‌ వంటకాలు, వివాహాది శుభకార్యాలు, ఇతర ఫంక్షన్‌లలో ఎక్కువగా వినియోగించేది సన్న బియ్యమే. ఎగువ మధ్య తరగతి నుంచి ఆపైస్థాయి కుటుంబాల్లో వంటింట్లో ఉడికేది కూడా ఎక్కువగా సన్నబియ్యమే. దేవాలయాల్లో పులిహోరా, చక్కెరపొంగలి వంటి ప్రసాదం తయారీకి కూడా సన్నబియ్యమే వినియోగిస్తుంటారు. అలాంటి సన్న బియ్యం పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేక అవస్థలు తప్పడంలేదు. గతేడాది వరకు సన్నాలు (సన్నరకం ధాన్యం) పండించే రైతులకు అందుకు తగ్గ ప్రతిఫలంగానే ధరలు ఉండేవి. ముఖ్యంగా సాంబమసూరిగా పిలవబడే బీపీటీ– 5204, ఎంటీయూ–1224, జేజేఎల్‌–1798, ఎన్‌ఎల్‌ఆర్‌–34449తోపాటు అంకూర్‌ సోనామ్‌, సూపర్‌ అమన్‌ వంటి పలు సూపర్‌ఫైన్‌ వరి రకాలకు మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉండేది. మద్దతు ధర కంటే ఎక్కువ ధర చేతికందేది. మార్కెట్‌లో సన్నబియ్యంకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా ధర పెరుగుతుందని ఆశించిన అన్నదాతకు మాత్రం ఈఏడాది నిరాశే మిగిలిందని చెప్పాలి. గతేడాది అత్యధికంగా రూ.2900 వరకు పలికిన సన్నబియ్యం క్వింటా ధర నేడు మద్దతు ధర రూ. 2320 కంటే కిందికి దిగజారింది. 80 కిలోల బస్తా రూ.1650 నుంచి రూ.1700 మాత్రమే పలుకుతోంది. అదికూడా సాంబమసూరి(బీపీటీ–5204) రకం మాత్రమే మిల్లింగ్‌కు బాగుంటుందని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల రబీలో పండించిన ఆర్‌ఎన్‌ఆర్‌ రకం సన్నాలు(సుగర్‌లెస్‌) పంట చేతికొచ్చిన నేపథ్యంలో మిగిలిన సన్నరకాలను కొనేవారే కరువయ్యారు.

మిల్లులో

ప్యాకింగ్‌కు

సిద్ధంగా వున్న

సన్నబియ్యం

డిమాండ్‌ బట్టే ధర..

సన్నరకం ధాన్యం ఉత్పత్తి పెరగటంతో డిమాండ్‌ తగ్గింది. అందులోనూ కొన్ని వైరెటీలు పొట్ట తెలుపు రావటంతో ఎగుమతులకు పనికిరావటం లేదు. బీపీటీ–5204(సాంబ రకం) మిల్లింగ్‌కు బాగుంటుంది. ప్రస్తుతం రబీలో పండించి న సన్నాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో డిమాండ్‌ మరింతగా తగ్గింది.

–పి.రవి, రైస్‌ ఎక్స్‌పోర్ట్‌ ఏజెంట్‌

ఎందుకు తగ్గిందో..

సన్నాలు పండించే రైతుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించాలి. ఎఫ్‌సీ వైరెటీలు(దుడ్డు, మధ్యస్థ రకాలు) కంటే తక్కువ దిగుబడి వచ్చినా మద్దతు ధర కంటే ఎక్కువ ఉంటుందనే కారణంతోనే సన్నాలు పండించాం. సన్నబియ్యానికి డిమాండ్‌ ఉన్నా ధాన్యానికి ధర లేకపోవటం ఏంటో అర్ధం కావటంలేదు.

– సీపాన రామారావు, రైతు, రేగుపాడు

చిన్నబోయిన సన్నాలు 1
1/4

చిన్నబోయిన సన్నాలు

చిన్నబోయిన సన్నాలు 2
2/4

చిన్నబోయిన సన్నాలు

చిన్నబోయిన సన్నాలు 3
3/4

చిన్నబోయిన సన్నాలు

చిన్నబోయిన సన్నాలు 4
4/4

చిన్నబోయిన సన్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement