కాశీబుగ్గలో రేషన్ డిపో సీజ్
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు రెల్లివీధిలో రేషన్ డిపోను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. రెల్లివీధి నుంచి నెహ్రూనగర్‌కు నూతనంగా తరలించి రేషన్‌డిపో నడుపుతున్న డీలర్ రామరాజుపై కార్డుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలాస డిప్యూటీ తహసీల్దార్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బియ్యం, పంచదార, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువులను తప్పుడు తూకంతో తక్కువగా అందజేస్తున్నందున 5వ నంబర్ డిపోను సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, డిపో డీలర్ మాత్రం తనకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ చాలనందుకే డిపోలో పనిచేసే సిబ్బందికి జీతం ఇవ్వడానికి తూకం తగ్గించి ఇస్తున్నట్లు చెప్పడం గమనార్హం.


