వేలూరు: ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఎంసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు షణ్ముగం అన్నారు. వేలూరు రంగాపురంలో వీఎంఆర్ మెమోరియల్ హాల్, కార్మిక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం, పార్టీ జెండా అవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కార్మికుల సంక్షేమానికి అవసరమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ఘనత డీఎంకే ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ కార్మిక సంఘం రీజనల్ చైర్మన్ నటరాజన్, వేలూరు జోన్ ప్రధాన కార్యదర్శి వల్లువన్, వేలూరు ఉమ్మడి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు మణి, కార్యదర్శి రమేష్, కోశాధికారి క్రిష్ణన్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ట్రాన్స్‌పోర్టు కార్మికులకు అండగా ఉంటాం