
యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ సేవలు
ఈనెల 21, 22 తేదీలలో ప్రత్యేక శిబిరాలు
మోర్తాడ్: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్‌హెచ్ ఉచిత వీసాలను జారీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూలు నిర్వహించి అనేకమంది నిరుద్యోగులకు యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ సంస్థకు చెందిన లైసెన్స్‌డ్ ఏజెన్సీ జీటీఎం ఆధ్వర్యంలో మరోసారి వీసాల జారీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 21, 22 తేదీలలో జగిత్యాల, నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేటరింగ్, సపోర్టింగ్గ్ సర్వీసెస్ రంగంలో వలస కార్మికులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు పేర్కొంది.
ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు (ECNR Passport) కలిగి, బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడేవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్‌రావు కోరారు. 250 మందికి వీసాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారతీయ కరెన్సీలో రూ.23 వేల వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. వీసాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
వీసాల జారీతో పాటు యూఏఈకి వెళ్లడానికి విమాన టికెట్‌ను సంస్థే ఉచితంగా సమకూరుస్తుందని వెల్లడించారు. ఆసక్తిగలవారు 86868 60999 (నిజామాబాద్), 83320 62299 (ఆర్మూర్), 83320 42299 (జగిత్యాల), 93476 61522 (సిరిసిల్ల) నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకుని టోకెన్లు పొందాలని సూచించారు.