833 ఇంజనీర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల | Job Notifications: TSPSC Notifies 833 Assistant Engineer Posts | Sakshi
Sakshi News home page

833 ఇంజనీర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల

Published Tue, Sep 13 2022 3:24 AM | Last Updated on Tue, Sep 13 2022 3:24 AM

Job Notifications: TSPSC Notifies 833 Assistant Engineer Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్‌ సర్వీసులకు సంబంధించి 833 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఇంజనీర్, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్, టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ కేటగిరీల్లోఖాళీలున్నాయి.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28 నుంచి వచ్చేనెల 21వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement