
సాక్షి, నల్గొండ: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్‌ఎస్ తరపున నిర్వహించిన ప్రతి సభ, కార్యక్రమానికి హాజరై పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆటపాటలతో జనాలను హోరెత్తిస్తారు.
తాజాగా మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఊళ్లో పూజలు నిర్వహించి.. మహిళలు, మరుగుజ్జులతో కలిసి బతుకమ్మ ఆడుతూ స్థానిక ఓటర్లను ఆకట్టుకున్నారు.