
కామారెడ్డి జిల్లా: జిల్లాలోని బీర్కూర్, నసురుల్లాబాద్ మండలం అంకోల్, సంగ్యం, దామరాంచ గ్రామాల్లో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్లుతాగిన 100 మందికిపైగా అస్వస్తతకు గురయ్యారు. అయితే ఇందులో చాలామంది బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు.మెడలు వెనక్కి పడిపోయి నడుస్తున్నారు. కొంతమంది నాలుక పెద్దగా కావడం, మాట్లాడలేకపోవడం వంటి విషయాలు వారిలో కనిపించాయి.
దాంతో పలువుర్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది వైద్య శాఖ. 20 మంది వరకూ బాధితుల్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది, కల్లులో డ్రగ్ డోస్ ఎక్కువ కావడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.