
సాక్షి, నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తొలుత రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్‌లో ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్‌తో పాటు మరో నలుగురి మృతదేహాలను గుర్తించింది. ఏఈ సుందర్‌తో పాటు మోహన్ మృత దేహాలను బయటకు తరలించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరో అయిదు గంటల సమయం పట్టనుంది. కాగా గురువారం రాత్రి 10.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రమాద ఘటన గురించి సీం కేసీఆర్‌కు వివరించామని పేర్కొన్నారు (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..)