
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎరువులు ఉచితంగా ఇస్తానని 2017 ఏప్రిల్ 13న కేసీఆర్ చెప్పిన మాటలు నాలుగేళ్లు దాటినా అమల్లోకి రాలేదని, చెప్పిన మాటలను ఆయన విస్మరించారని శుక్రవారం ట్విట్టర్‌లో రేవంత్ పోస్ట్ చేశారు. సవాళ్లు చేసి చర్చలకు రాకుండా తప్పించుకునే బదులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన తండ్రి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.