
సీఎం ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రేపు(శుక్రవారం) తుది వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ మీడియా ముందు పెట్టిన ఫుటేజ్‌ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. హై ప్రొఫైల్ కేసు దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు బయటకు ఎలా వెళ్లాయని అన్న పిటిషన్లు.. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టుకు తెలిపారు.
సీఎం ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రేపు(శుక్రవారం) తుది వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌ను సీఎం కోర్టుకు పంపించారు.
చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..