
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈనెల 15న ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 63 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిధులు సమకూర్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదేరోజు రూ.లక్ష చెక్కుల పంపిణీ చేస్తారని వెల్లడించారు.