గుజరాత్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లో పర్యటించగా, మరుసటి రోజే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.