చెన్నైలోని తెలుగు సినీ నటుడు దివంగత శోభన్‌బాబు విగ్రహం తొలగించాలని తమిళగ మున్నేట్ర దళం(టీఎండీ) ఆందోళనకు పిలుపు నివ్వడంతో సోమవారం ఆ విగ్రహానికి పోలీసులు రక్షణ కల్పించారు. ముం దు జాగ్రత్తగా టీఎండీ కార్యదర్శి కె. వీరలక్ష్మి ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శోభన్‌బాబు మరణించిన తరువాత చెన్నై మెహతానగర్ నెల్సన్ మాణిక్యం రోడ్డు మలుపులో ఆయన విగ్రహం నెలకొల్పారు.