రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకోనుందా..? తెలంగాణలో ఉప్పు–నిప్పులా ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ ఒకదానికొకటి సహకరించుకోనున్నాయా? రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, వలసలతో చిక్కి శల్యమైన టీ–టీడీపీ.. పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ చదరంగంపై ఎత్తులు వేయడం మొదలు పెట్టిందా..? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు ఆ మొదటి ఎత్తు టీడీపీ నుంచే వచ్చింది!