మంత్రి పరిటాల సునీత పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. డ్వాక్రా మహిళల అరెస్టులను వైఎస్సార్సీపీ ఖండించింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్వాక్రా మహిళల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. డ్వాక్రా మహిళలను పోలీసులు అడ్డుకోవడం దారుణమని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు.