ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందని తిరుపతి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎంపీగా రాజీనామా చేసినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు.