ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్, బీజేపీలకు జాలి, కరుణ లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎన్డీయే నుంచి బయటికొచ్చి ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలోని అన్ని సమస్యల్లో ఏపీకి హోదా ఒకటి అన్నట్టు కాంగ్రెస్ పార్లమెంటులో మాట్లాడిందని తెలిపారు.