వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని తెలిపారు. ఈ పాదయాత్రలో ఆయనను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన వైఎస్ జగన్‌ను వైజాగ్‌లో స్వామివారే కాపాడి.. నేడు తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎప్పుడు సామాన్యునిలానే ఉంటారని..